మోటో జీ మూడవ జనరేషన్‌ను లీక్ చేసిన ఫ్లిప్‌కార్ట్!

Posted By:

 మోటో జీ మూడవ జనరేషన్‌ను లీక్ చేసిన ఫ్లిప్‌కార్ట్!

భారత్‌లో మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మోటో జీ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా రాబోతున్న మోటో జీ (మూడవ జనరేషన్‌) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి పలు వివరాలను లీక్ చేసింది.

 మోటో జీ మూడవ జనరేషన్‌ను లీక్ చేసిన ఫ్లిప్‌కార్ట్!

ప్రస్తుతం మోటో జీ సెకండ్ జనరేషన్ రూ.12,999 ధర ట్యాగ్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ తన లిస్టింగ్స్‌లో పేర్కొన్న వివరాల మేరకు మూడవ జనరేషన్ మోటో జీ AP3560AD1K8 మోడల్ నెంబర్‌తో వస్తుంది.

 మోటో జీ మూడవ జనరేషన్‌ను లీక్ చేసిన ఫ్లిప్‌కార్ట్!

థర్డ్ జనరేషన్ మోటో జీ మార్కెట్లో విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ విధమైన అధికారిక సమాచారం లేదు. రూమర్ మిల్స్ వెల్లడించిన వివరాల మేరకు మూడవ జనరేషన్ మోటో జీ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

(ఇంకా చదవండి: ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్ )

5 లేదా 5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 610 ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

English summary
Surprise! Flipkart Accidently Leaked third-generation Motorola Moto G. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot