శిథిలమై రోదిస్తున్న చారిత్రక నగరం

Written By:

సిరియా...ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్న దేశం. ఇప్పుడు అగ్రదేశాల ఆధిపత్యపోరులో నలిగిపోతోంది. టెర్రరిస్టుల దాడుల్లో చితికిపోతోంది. ఒకప్పుడు ప్రశాంతతకు పెట్టని కోటగా విరాజిల్లిన సిరియా నేడు వైమానిక దాడులతో.. బాంబుల హోరుతో..తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. ఒకప్పుడు వారసత్వపు సంపదకు మకుటం లేని మహరాజుగా వెలిగిన సిరియా ఇప్పుడు వలసలదేశంగా మారి మత మౌడ్యంతో సహాయం చేయమంటూ ప్రపంచ దేశాలను అర్ధిస్తోంది. వేలాది మంది సిరియా శరణార్థులు రేపు ఏమవుతుందో తెలియక..సొంత ఊరికి ఎప్పుడు పోతామో తెలియక బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న వైనం ప్రపంచాన్నే కలచివేస్తోంది. ఈ సందర్భంగా నాటి సిరియాఎలా ఉంది....?నేటి సిరియా ఎలా ఉంది..?ప్రతి మనసుని తట్టి లేపే చిత్రాలను మీ ముందుకు తెస్తున్నాం.

Read more: త్రిముఖ పోరులో సిరియా రక్తపుటేరులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాడు రక్షణ కోట.. నేడు యుద్దానికి కోట

ఇది 13వ శతాబ్దంలో అలెప్పో నగరానికి రక్షణగా నిలిచిన కోట.ప్రపంచంలో అత్యంత పురాతనమైన కోటగా అలాగే అతి పెద్ద కోటగా గుర్తింపు పొందినది.ఇది ప్రపంచ వారసత్వ సంపదలో సిరియా నుంచి ఆరవ స్థానం సంపాదించింది. ఇప్పుడు అది ప్రభుత్వానికి టెర్రరిస్టులకు మధ్య యుద్ధానికి వేదికగా మారింది.ఈ చిత్రంలో మే 2013న తీసింది. దాన్ని జూమ్ చేసి 2014లో తీసిన చిత్రం ట్రయాంగిల్ లో ఉన్నది.

మసీదు లేదు హోటల్ లేదు అన్నీ ధ్వంసమే

ఈ చిత్రం 2014 జులైలో తీసింది. ఎర్ర బాణంతో మీకు కనిపిస్తున్నది సిరియాలోని న్యాయ మంత్రిత్వ బిల్డింగ్ నేలమట్టమయిన ప్రదేశం. న్యాయం అక్కడ లేదంటూ అది నేలమట్టమయింది. ఇక గ్రీన్ యారో ధ్వంసమయిన కుర్సీవేవ్ మసీదు. నీలం రంగు బాణం అత్యంత ప్రసిద్ధి పొందిన కార్లటన్ కితాడెల్ హోటల్. పూర్తిగా నేలమట్టమయింది. పసుపు బాణాలు ధ్వంసమయిన అనేక కట్టడాలను చూపిస్తున్నాయి.

గోపురం లేదు... కోట లేదు

ఈ ఫోటో 2014 ఆగస్టు 14న తీసింది. కుర్సీవేవ్ మసీదు పూర్తిగా ధ్వంసమయిన చిత్రం. ఆరంజ్ బాణంతో కనిపిస్తున్నది ధ్వంసమైన గ్రాండ్ సెరాలి కోట. ఇక పర్పుల్ బాణంతో ఉన్నది ధ్వంసమైన హిందూ హమ్మామ్ యల్ బోగా గోపురం.

ఎంత అందమైన ప్రదేశం

ఈ ఫోటో 2011లో ఆర్కియాలజికల్ దగ్గర ఉన్న ప్రిస్టిన్ రోమన్ ధియేటర్ ది. ఎంత అందంగా ఉందో కదా. ఇది సిరియాలోని మరొక ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశం బొర్సా. ఇప్పుడు భారీగా నష్టం వాటిల్లి పూర్తిగా ధ్వంసమయ్యేందుకు రెడీ అయింది. ఆ అందాల నగరం ఎలా ఉందో తరువాతి ఫోటోచూస్తే తెలుస్తుంది.

నేడు ధ్వంసమయిన ప్రదేశం

ఇది 2014 ఏప్రిల్ లో తీసింది. ఇప్పుడు మట్టి దిబ్బలుగా మారింది. మీకు కనిపిస్తున్న బాణాలు నిర్మాణంలో ఉన్న ధియేటర్ ఎంట్రన్స్ దారులు. అక్కడ తవ్వకాల్లో బయటపడిన ఓ చిన్న కొండ కూడా ఉంది.

జోర్డాన్ లోని జతారి శరణార్ధుల క్యాంపు

ఇది జోర్డాన్ లోని జతారి శరణార్ధుల క్యాంపు. సిరియా బార్డర్ సరిహద్దును క్రాస్ చేస్తే అక్కడ ఉంటుంది. ఇది 2013 సెప్టెంబర్ 13 న తీసిన చిత్రం.

ఇది కూడా అదే క్యాంపు

ఇది కూడా అదే క్యాంపు.. జనవరి 2013 న తీసింది .

జోర్డాన్ లోనే అతి పెద్ద సిటీ

ఇది కూడా జతారి శరణార్థుల క్యాంపు. దీన్ని ఫిబ్రవరి 26 2013న తీసారు. ఇది జోర్డాన్ లోనే అతి పెద్ద సిటీ. వేల మంది నివాసాలు ఇక్కడ ఉన్నాయి.

2009 అక్టోబర్ కి 2014 మార్చికి మధ్య మార్పులు

2009 అక్టోబర్ కి 2014 మార్చికి మధ్య మార్పులు ఈ చిత్రంలో స్పష్టంగా చూడొచ్చు. పైన ఉన్న చిత్రం 2009లో తీసింది. అక్కడ అంతా అందమైన పాల్ మైరా ఆర్కియాలజికల్ పార్కు కోసం నిర్మాణం జరుగుతోంది. దానికి సంబంధించిన రోడ్డును కూడా చిత్రంలో చూడవచ్చు. అది ఇప్పుడు మిలిటరీ వాహనాలకు వేదికగా మారి బాంబుల మోత మోగిస్తోంది. పసుపు బాణం గుర్తులో ఉన్నవి మిలిటరీ వాహనాలు.పింక్ బాణంలో ఉన్నవి మట్టి దిబ్బలు.

పాడుబడిన ఆలయాలు,చర్చిలు

ఇది యూరప్ నగరంలో ఏకైక సంప్రదాయ నగరం. ఇప్పుడు పాడుబడి దర్శనమిస్తోంది. దీన్ని 3వ శతాబ్దం బిసిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత పాత చర్చిల్లో ఇది ఒకటి. అలాగే పురాతన ఆలయాలు ఉన్న ప్రదేశాల్లో ఇది ఓ ప్రదేశం. దీన్ని 2012 జూన్ లో తీసారు.

నాడు వారసత్వ సంపద నేడు దోపిడిదారుల సంపద

ఇది 2014 ఏప్రిల్ లో తీసిన చిత్రం. అప్పుడు ప్రపంచ వారసత్వ సంపదగా మన్ననలు అందుకున్న ఈ ప్రదేశం ఇప్పుడు దోపిడిదారులకు అడ్డగా మారింది. వారు అక్కడ అన్ని ప్రదేవాలను ఆక్రమించుకుని యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు.

శరణార్థుల ఆర్తనాదాలు

ఇది నార్త్ రన్ ఇరాక్ లోని ట్రిగిస్ రివర్ పై గల బ్రిడ్జి. ఈ బ్రిడ్జి ఇప్పుడు వేలమంది సిరియా శరణార్థులను ఆ దేశాన్ని దాటేందుకు సహాయం చేస్తోంది.ఈ ఫోటోని ఆగస్టు 17 2013న తీసారు.

సిరియా బార్డర్

ఇది సిరియాలోని సాల్ మేహ్ సరిహద్దు ప్రాంతం. ఇక్కడి నుంచి సిరియా శరణార్థులు టర్కీలో తలదాచుకోడానికి వెళుతున్నప్పుడు క్లిక్ మనిపించిన చిత్రం.

అలెప్పొ నగరం

ఇది శాటిలైట్ ద్వారా తీసిన అలెప్పో నగరం.ఇక్కడ మీకు కనిపిస్తున్న రెడ్ గుర్తులు అక్కడ దారులు మూసివేసిన ప్రదేశాలు. దాదాపు 371 దారులను మూసివేసారు. దీన్ని 2012 సెప్టెంబర్ 9న తీసారు.

ఇదొక పెద్ద విషాద గాధ

ఇది మే 2013 నాటికి మరింతగా ముదిరింది. దాదాపు 1171 రోడ్లను మూసివేశారు. 8 నెలల కాలంలో సిరియా నుంచి బయటకు రాకుండా ఇలా అక్కడి దారులన్నీమూసివేసారు. ఇదొక పెద్ద విషాద గాధ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇమేజ్ సోర్స్ : DigitalGlobe/AAAS

Read more about:
English summary
Here Write Syria from space: satellite images of civil war
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot