Bharti Airtel యొక్క 'వన్ ఎయిర్‌టెల్ ప్లాన్‌ల' బెనిఫిట్స్ మీద ఓ లుక్ వేయండి...
ఇండియాలో టెలికం, బ్రాడ్‌బ్యాండ్ మరియు డిటిహెచ్ రంగంలో అద్భుతమైన సేవలను అందిస్తున్న భారతి ఎయిర్‌టెల్ కొన్ని నెలల క్రితం తన యొక్క మూడు సేవలను ఒకే ప్యాకేజీగా కలుపుతూ 'వన్ ఎయిర్‌టెల్' సిరీస్ పేరుతో కొన్ని ప్లాన్ లను ప్రవేశపెట్టింది. ఈ వన్ ఎయిర్‌టెల్ ప్లాన్‌లు రూ.899 మరియు రూ.1,999 ధరల వద్ద ప్రీమియం ప్లాన్‌లను అందిస్తోంది. ధరలు పెరిగే కొద్ది బండిల్ సేవలు కూడా పెరుగుతాయి. రూ.899 ధర వద్ద గల ప్లాన్ పోస్ట్‌పెయిడ్ మరియు డిటిహెచ్ సేవలను కలిపి అందిస్తుంది. అయితే రూ.1,999 ప్లాన్ పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ సేవలను మూడింటిని కలిపి అందిస్తుంది. ఎయిర్‌టెల్ ప్రస్తుతం దేశంలోని 17 నగరాల్లో తన యొక్క "వన్ ఎయిర్‌టెల్ సిరీస్ ప్లాన్‌లను" ఒకే రకమైన ప్రయోజనాలతో అందిస్తోంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రూ.899 వన్ ఎయిర్‌టెల్ పూర్తి వివరాలు
ఎయిర్‌టెల్ వన్ సిరీస్ ప్లాన్‌లలో రూ.899 తక్కువ ధర వద్ద లభించే చౌకైన ప్లాన్ కేవలం పోస్ట్‌పెయిడ్ మరియు డిటిహెచ్ యొక్క రెండు సేవలను కలుపుతూ అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, నెలకు 75GB డేటా మరియు రోజుకు 100SMS లను అందించే రూ.499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఎయిర్‌టెల్ ఒక యాడ్-ఆన్ సిమ్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. వీటితో పాటుగా నెలకు రూ.350 విలువైన డిటిహెచ్ సబ్స్క్రిప్షన్ ను కూడా ఎయిర్‌టెల్ అందిస్తోంది. రూ.350 విలువైన టీవీ ఛానెళ్లను ఈ ప్లాన్‌లో అందిస్తుంది. ఈ ప్లాన్‌ను ఎంచుకుంటున్న యూజర్లు సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో రూ.1,500 చెల్లించి ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ పొందవచ్చు.

రూ.1349 వన్ ఎయిర్‌టెల్ ప్లాన్ పూర్తి వివరాలు
వన్ ఎయిర్‌టెల్ ప్లాన్ సిరీస్ లో రూ.1349 ధర వద్ద లభించే ప్లాన్‌తో భారతి ఎయిర్‌టెల్ అపరిమిత వాయిస్ కాలింగ్, నెలకు 150GB డేటా, రోజుకు 100 SMS లను అందిస్తోంది. రూ.1,349 వన్ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో యూజర్లు ఒక రెగ్యులర్ సిమ్ మరియు మూడు యాడ్-ఆన్ పోస్ట్‌పెయిడ్ సిమ్‌లతో కలుపుకొని మొత్తంగా నాలుగు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు పొందుతారు. అలాగే ఈ ప్లాన్ డిటిహెచ్ సర్వీసులలో 350 రూపాయల విలువైన టీవీ ఛానెళ్లను కూడా అందిస్తుంది. వినియోగదారులు రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడం ద్వారా ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను పొందవచ్చు.

రూ.1499 వన్ ఎయిర్‌టెల్ ప్లాన్ పూర్తి వివరాలు
వన్ ఎయిర్‌టెల్ ప్లాన్ సిరీస్ యొక్క జాబితాలో గల తదుపరి ప్లాన్ రూ.1499 ధర వద్ద లభిస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్, నెలకు 75GB డేటా మరియు రోజుకు 100 SMSలను కలుపుతూ అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌తో ఒక యాడ్-ఆన్ కనెక్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. రూ.1499 ధర వద్ద లభించే వన్ ఎయిర్‌టెల్ ప్లాన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను (ఫైబర్ + ల్యాండ్‌లైన్) అందిస్తుంది. ఇది రూ.999 విలువైన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌ను 200Mbps వేగంతో అందిస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అదనంగా అందిస్తుంది. వన్ ఎయిర్‌టెల్ 1499 ప్లాన్‌లో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ను ఉచితంగా లభిస్తుంది.

రూ.1999 వన్ ఎయిర్‌టెల్ ప్లాన్ పూర్తి వివరాలు
వన్ ఎయిర్‌టెల్ ప్లాన్ సిరీస్ జాబితాలో చివరిది రూ.1999 ధర వద్ద లభించే ప్లాన్. ఇది పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ వంటి మూడు సేవలను కలుపుతూ అందిస్తుంది. ఈ వన్ ఎయిర్‌టెల్ ప్లాన్ ఒక సాధారణ కనెక్షన్ మరియు రెండు ఉచిత యాడ్-ఆన్ సిమ్‌లతో నెలకు 75GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో వస్తుంది. వీటితో పాటుగా కంపెనీ రూ.442 విలువైన టీవీ ఛానెళ్లను మరియు రూ.3,999 విలువ గల ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇది 200Mbps డేటా వేగంతో లభించే రూ.999 ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌ను ఇందులో కలుపుతుంది. ఈ వన్ ఎయిర్‌టెల్ ప్లాన్‌లు అన్ని కూడా రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ సబ్స్క్రిప్షన్ లను కలిసి అందిస్తుంది.


Click it and Unblock the Notifications








