Airtel థాంక్స్ యాప్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను మార్చడం ఎలా??

|

టెలికాం రంగంలో అధిక మంది యూజర్లను కలిగి ఉండి ఇప్పటికప్పుడు వినియోగదారులను పెంచుకుంటూ టాప్ పొజిషన్ లో ఉన్న ఎయిర్‌టెల్ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలోకి కూడా ప్రవేశించిన తరువాత తన యొక్క ప్రత్యర్థులలో ఒకరైన రిలయన్స్ జియోల మధ్య పోటీ తీవ్రంగా మారింది. టెలికాం రంగంలో మాదిరిగానే బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా మార్కెట్ వాటాను పొందడానికి మరియు ఆదాయాన్ని పెంచడానికి కొత్త ప్రయోజనాలను తన వినియోగదారులకు అందించడంలో ఎయిర్టెల్ అందరి కంటే ముందు వరుసలో ఉంది.

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్

ఎయిర్‌టెల్ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో అత్యంత సరసమైన ప్లాన్ లను అందించడం ప్రారంభించింది. దీని యొక్క చౌకైన ప్లాన్ రూ.499 ధర వద్ద ప్రారంభం అవుతుంది. ఇది 40 Mbps వేగంతో అపరిమిత డేటాను మరియు అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే మీకు దీనికంటే ఎక్కువ వేగవంతమైన ప్లాన్ కు మారాలి అని భవిస్తూ ఉంటే కనుక వినియోగదారులకు చాలా మార్గాలు ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్‌ను మార్చే విధానం

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్‌ను మార్చే విధానం

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్‌ను మార్చాలి అనుకుంటున్న వినియోగదారులు 121 లేదా 199 కస్టమర్ కేర్‌ నెంబర్ కు కాల్ చేయడానికి కంపెనీ మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే మీరు మీ రిజిస్టర్డ్ ఎయిర్‌టెల్ నంబర్ ద్వారా కాల్ చేయవలసి ఉంటుంది. తరువాత మీరు మీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను మార్చమని మీ కస్టమర్ కేర్‌ను అడగవచ్చు. దీనితో పాటుగా సంస్థ యొక్క థాంక్స్ అప్లికేషన్ ద్వారా కూడా మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ థాంక్స్ యాప్ మీ ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్, ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అదనంగా ఎయిర్‌టెల్ డిటిహెచ్ ప్లాన్‌లను కూడా మార్చడానికి, బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి మరియు ఇతర వివరాలను తనిఖీ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను మార్చే విధానం

ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను మార్చే విధానం

మొదట ఎయిర్టెల్ థాంక్స్ యాప్ యొక్క అప్లికేషన్‌ను ఆపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత దీనిని ఇంస్టాల్ చేసుకున్న తరువాత మై ఎయిర్‌టెల్‌ను ఎంచుకుని తరువాత అకౌంటును నిర్వహించు ఎంపిక మీద నొక్కండి. మీ యొక్క వివరాలతో అకౌంట్ క్రీయేట్ చేసిన తరువాత 'మై ప్లాన్' జాబితా నుండి క్రొత్త ఇంటర్నెట్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి మీకు అనుమతి ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఇందులో గల అన్ని సూచనలను పాటించాలి. తరువాత మార్చినట్లు మీరు సంస్థ నుండి నిర్ధారణ మెసేజ్ ను అందుకుంటారు.

ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఎయిర్టెల్ కంపెనీ తన యొక్క బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో ఐదు ఇంటర్నెట్ ప్లాన్‌లను అందిస్తోంది. రూ. 499, రూ. 777, రూ. 999, రూ. 1,499, మరియు రూ. 3,499 ధర వద్ద లభించే ఈ ప్లాన్‌లు అపరిమిత డేటా మరియు కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లు 40 Mbps, 100 Mbps, 200 Mbps, 300 Mbps మరియు 1 Gbps వేగంతో డేటాను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు వూట్, హంగమా ప్లే, డిస్నీ + హాట్‌స్టార్ వంటి యాప్ ల కంటెంట్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
How to Change Airtel Broadband Plan Using Airtel Thanks App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X