టాటా డొకొమో ఆఫర్.. నచ్చిన అంకెలతో మీ ఫోన్ నంబర్

Posted By:

నచ్చిన 10 అంకెలతో మీ ఫోన్ నంబర్

కస్టమర్‌లు తమకు నచ్చిన అంకెలతో ఫోన్ నెంబర్‌ను సెట్ చేసుకునే విధంగా టాటా డొకొమో సోమవారం ఓ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ‘ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై నంబర్' పేరుతో ప్రవేశపెట్టిన ఈ సరికొత్త సర్వీస్‌లో భాగంగా టాటా డొకొమో యూజర్లు తమకు ఇష్టమైన 10 అంకెలతో సొంతంగా మొబైల్ ఫోన్ నెంబర్‌ను సృష్టించుకోవచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

తమ పుట్టిన రోజు తేదీలతో గాని, ఇష్టమైన అంకెలతో లేదా తమకు సలువుగా గుర్తుండే అంకెలతో మొబైల్ ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని టాటా టెలీ సర్వీసెస్ హెడ్ (బ్రాండెడ్ రిటైల్, స్ట్రాటజిక్ డిస్ట్రిబ్యూషన్) సందీప్ సింగాల్ తెలిపారు.

10 పెద్ద‌తెర స్మార్ట్‌ఫోన్‌లు (ట్రెండింగ్)

నచ్చిన 10 అంకెలతో మీ ఫోన్ నంబర్

ఈ సర్వీసును పొందాలనుకునే వారు తమ సమీపంలోని టాటా డొకొమో స్టోర్స్‌కు వెళ్లి తమ సొంత మొబైల్ నెంబర్‌ను పొందవచ్చని అన్నారు. కొత్త కస్టమర్‌లకే కాకుండా ప్రస్తుత కస్టమర్‌లు కూడా ఈ సదుపాయాన్ని వినియోగిచుకోవచ్చని సింగాల్ తెలిపారు. టాటా టెలీసర్వీసెస్‌లో ఓ భాగమైన టాటా డొకొమో దేశవ్యాప్తంగా 19 టెలికామ్ సర్కిళ్లలో మొబైల్ వాయిస్ కాలింగ్ ఇంకా ఇంటర్నెట్ డేటా సేవలను అందిస్తోంది.

English summary
Tata Docomo allows subscribers to create own phone numbers. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting