మాట్లాడుకోండి ఎంతసేపైనా..అపరిమితం

Written By:

తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారుల కోసం డొకొమో సరికొత్త ప్లాన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా డేటాతో పాటు ఎస్టీడీ, లోకల్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. అయితే ఇదే బాటలో టెలినార్ కూడా తన కష్టమర్ల కోసం అన్ లిమిటెడ్ కాల్స్ ని ప్రవేశపెట్టింది. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీలు చెబుతున్నాయి.

జియో ఉచితాన్ని ఎందుకు పొడిగించారు, వివరణ కోరిన ట్రాయ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ .148 ప్లాన్

ప్రీపెయిడ్ చందాదారులకోసం ప్రవేశపెట్టిన రూ .148 చెల్లించి 14 రోజుల పాటు స్థానిక, ఎస్టీడీ కాల్స్‌ను అపరిమితంగా చేసుకోవచ్చని, ఒక జీబీ డేటాను కూడా పొందొచ్చని డొకొమో కంపెనీ తెలిపింది.

రూ .246 ప్లాన్

అలాగే రూ .246 చెల్లించిన వారు 28 రోజుల పాటు 2 జీబీ డేటాతోపాటు స్థానిక, ఎస్టీడీ కాల్స్‌ను అపరిమితంగా మాట్లాడుకోవచ్చు.

రూ .74 ప్లాన్

టెలినార్ కూడా తెలుగు రాష్ట్రాల్లోని చందాదారుల కోసం ప్రత్యేక టారిఫ్ ఓచర్లు (ఎస్టీవీ) ను ప్రవేశపెట్టింది. రూ .74 చెల్లించి టెలినార్ నుంచి టెలినార్ ఫోన్లకు 28 రోజులు అపరిమితంగా స్థానిక, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఒక జీబీ డేటా కూడా ఇస్తుంది.

రూ .249 ప్లాన్

ఇక మరొక ప్లాన్‌లో రూ .249 చెల్లిస్తే ఏ నెట్వర్క్‌కు అయినా అపరిమితంగా ఫోన్ చేసుకోవచ్చు. దీంతో పాటు 2 జీ డేటా కూడా అపరిమితంగా ఇస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులకు

ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులకు మాత్రమేనని వారు మాత్రమే ఈ ఆపర్లను సద్వినియోగం చేసుకోగలరని కంపెనీలు చెబుతున్నాయి

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tata Docomo launches new unlimited calling plans for Rs. 148 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot