డొకొమో నుంచి అదిరే ఆఫర్లు

Written By:

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో రూ. 500, రూ. 1000 నోట్లు ఎందుకు పనికిరాకుండా పోయాయి. అయితే ఈ నోట్లతో కూడా కొన్ని పనులు చేయవచ్చు. పాత నోట్లతో రీ ఛార్జ్ చేసుకోవచ్చని డొకొమో చెబుతోంది. అందులో భాగంగా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రీజియన్లలో ఈ ప్రత్యేక ఆఫర్ల వెసులుబాటును కల్పించింది.

జియో యూజర్లకు చేదు వార్త, ఉచితానికి పుల్‌స్టాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 500తో రూ. 600 టాక్ టైం

డొకొమో నుంచి వచ్చిన కొత్త ప్లాన్ తో రూ. 500 రీ ఛార్జ్ చేసుకుంటే రూ.600 టాక్ టైం పొందవచ్చు. రూ.100 ఎక్స్ ట్రా టాక్ టైం లభిస్తుంది.

అన్ లిమిటెడ్ కాల్స్ ప్యాక్

రూ. 500 ప్యాక్ తో పాటు కొత్త ప్యాక్ రూ. 494 కూడా లాంచ్ చేసింది. దీంతో నెలరోజుల పాటు మీరు అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇది లోకల్ కాల్స్ కు మాత్రమే వర్తిస్తుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

న్యూ కాంబో ప్యాక్

ఈ ప్యాక్ ద్వారా మీరు రూ. 496తో రీ ఛార్జ్ చేసుకుంటే రూ. 250 టాఖ్ టైంతో పాటు 5జిబి 3జి డేటాను రెండు నెలల పాటు పొందవచ్చు.

స్పెషల్ డేటా ప్యాక్

మీరు రూ. 495తో రీ ఛార్జ్ చేసుకుంటే 10 జిబి 3జీ డేటాను 90 రోజుల పాటు పొందవచ్చు.

డిసెంబర్ 15 వరకే

అయితే పైన చెప్పిన ప్లాన్లన్నీ డిసెంబర్ 15 వరకే పాత నోట్లకు వర్తిస్తాయని, ఆ తర్వాత ఇవి వర్తించవని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tata DoCoMo Launches Special Prepaid Plans for Rs. 500 to Overcome Demonetization Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot