Tata Sky 300Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇతరులతో పోలిస్తే ఎంత మెరుగ్గా ఉంది?
ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో గల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP) జియోఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్ వంటి ప్రత్యర్తులతో పోటీపడడానికి టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇటీవల పలు నగరాల్లో 300 Mbps ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అనేది టాటా స్కై అందించే అత్యంత వేగవంతమైన ప్లాన్.

టాటా స్కై vs జియోఫైబర్ vs ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్: 300Mbps ప్లాన్ ధరలు
జియో ఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ సంస్థలు రూ.1,500 ధర వద్ద 300Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. అయితే టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అదే 300Mbps ప్లాన్‌ను రూ.1,600 ధర వద్ద అందిస్తోంది. టాటా స్కై ఇతర ఆపరేటర్లతో పోటీ పడటానికి అందించే OTT సబ్స్క్రిప్షన్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై 300Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు
టాటా స్కై సంస్థ అందిస్తున్న 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అపరిమిత డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క అపరిమిత డేటాలో ప్రతి నెలా 3.3TB లేదా 3,300GB FUP పరిమితి ఉంటుంది అని గమనించాలి. FUP పరిమితి ఎక్కువగా ఉన్నందున టాటా స్కై నుండి ఈ ప్లాన్‌తో డేటా రోల్‌ఓవర్ సౌకర్యం అందుబాటులో లేదు. అంతేకాకుండా సంస్థ ఇటీవల ప్రారంభించిన టాటా స్కై యొక్క ల్యాండ్‌లైన్ సర్వీస్ ద్వారా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. చివరగా 300 Mbps ప్లాన్‌ను ఎంచుకునే టాటా స్కై యూజర్లు తిరిగి పొందగలిగే ప్రాతిపదికన ఉచిత డ్యూయల్-బ్యాండ్ రౌటర్‌ను పొందుతారు. అలాగే ఇన్స్టాలేషన్ ఛార్జీలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.

టాటా స్కై 300Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 6నెలలు & వార్షిక వాలిడిటీపై ధర తగ్గింపు
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఈ 300Mbps ప్లాన్‌ను వివిధ రకాల చెల్లుబాటు కాలంతో పొందవచ్చు. ఈ ప్లాన్‌ను నెలకు రూ.1,600 ధర వద్ద, మూడు నెలలకు రూ.4,800 ధర వద్ద పొందవచ్చు. అలాగే 6నెలలు మరియు ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి వరుసగా రూ.8,400 మరియు రూ.15,600 ధర వద్ద పొందవచ్చు. మీరు సరిగ్గా గమనిస్తే కనుక సెమీ వార్షిక మరియు వార్షిక ప్లాన్లపై కంపెనీ రూ.1,200 మరియు రూ.3,600 తగ్గింపును అందిస్తోంది.

టాటా స్కై vs జియోఫైబర్ vs ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్
టాటా స్కై యొక్క 300 Mbps ప్లాన్ ఇతర ఆపరేటర్లకు పోటీ ధర నిర్ణయించినప్పటికీ ఎటువంటి OTT సభ్యత్వాలను అందించడం లేదు. ఉదాహరణకు రూ.1,499 ధర వద్ద లభించే జియోఫైబర్ యొక్క 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ.1,800 చందా ప్రయోజనం గల 12 OTT యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. అదే విధంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క 300 Mbps ప్లాన్ కూడా అనేక OTT చందా ప్రయోజనాలతో వస్తుంది. టాటా స్కై తన 300 Mbps ప్లాన్‌తో OTT చందా ప్రయోజనాలను అందించగలిగితే కనుక చాలా మంది వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇందులో గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే టాటా స్కై దాని బింగే + సెట్-టాప్ బాక్స్‌ను బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో అందించడం లేదు. ఎయిర్‌టెల్ మరియు జియోఫైబర్ దాదాపు ప్రతి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో అందిస్తున్నాయి.


Click it and Unblock the Notifications