టాటా స్కై బింగే + సెట్-టాప్-బాక్స్ ఎలా ఉందొ చూడండి
డిటిహెచ్ ఆపరేటర్ టాటా స్కై కొత్త 4K ఆండ్రాయిడ్ సెట్-టాప్-బాక్స్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నది. టాటా స్కై బింగే + అని పిలువబడే ఈ సెట్-టాప్-బాక్స్ ఈ రోజు అంటే డిసెంబర్ 16న అధికారికంగా రిలీజ్ కాబోతున్నది.

ఇది రిలీజ్ అవ్వడానికి ముందే దీని యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. వీటి యొక్క మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి మరింత ముందుకు చదవండి.

టాటా స్కై బింగే + వివరాలు
బింగే + సెట్-టాప్-బాక్స్‌తో టాటా స్కై ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మరియు డిష్ SMRT హబ్‌తో పోటీపడుతున్నది. మార్కెట్ లో లీకైన వివరాల ప్రకారం ఈ టాటా స్కై బింగే + బాక్స్ ఆండ్రాయిడ్ 9 పై OSతో రన్ అవుతుంది. ఇది 4K రిజల్యూషన్‌లో చూడటానికి తోడ్పడుతుంది. ఈ సెట్-టాప్-బాక్స్‌ను పారిస్కు చెందిన సంస్థ ‘టెక్నికలర్' తయారు చేసింది.

టాటా స్కై బింగే డాంగిల్ మాదిరిగానే బాక్స్ వై-ఫై లేదా ఈథర్నెట్ కనెక్షన్ ద్వారా OTT కంటెంట్‌ను కూడా అందిస్తుంది. ఇది శాటిలైట్ డిష్ ను అనుసంధానించబడిన RF కేబుల్ ఉపయోగించి లైవ్ టీవీకి మద్దతు ఇస్తుంది. సాధారణంగా ఇది హైబ్రిడ్ అనుభవంతో వినియోగదారులను అందిస్తుంది.

స్ట్రీమింగ్ సర్వీస్
లీకైన ప్రమోషనల్ బ్రోచర్ ఆధారంగా ఈ బాక్స్ బింగే సర్వీస్ యొక్క ఒక నెల కాంప్లీమెంటరీ చందాతో వస్తుంది. ఇది హాట్‌స్టార్, Zee5, హంగమా ప్లే, ఈరోస్ నౌ వంటి ప్లాట్‌ఫామ్‌లకు యాక్సిస్ ను అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ OSతో రన్ అవుతున్నందున మీరు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలకు మరియు Voot, ALTBalaji వంటి మరిన్ని యాప్ లకు కూడా యాక్సిస్ ను పొందుతారు. అయితే ఈ సర్వీసులను యాక్సెస్ చేయడానికి ప్రత్యేక చందా అవసరం.

టాటా స్కై బింగే + స్పెసిఫికేషన్స్ & ఫీచర్స్
టాటా స్కై బింగే + యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇది హుడ్ కింద బ్రాడ్‌కామ్ BCM72604 SoC 1.8GHz వద్ద క్లాక్ చేయబడి ఉంటుంది. ఇది 2Gb ర్యామ్, 8Gb స్టోరేజ్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది బ్రాడ్‌కామ్ వీడియోకోర్ V హెచ్‌డబ్ల్యు జిపియుతో కూడా రానుంది. ప్రస్తుతానికి దీని యొక్క ధర మరియు లభ్యత వంటి ఇతర వివరాలు అందుబాటులో లేవు. ఈ రోజు టాటా స్కై బింగే + లాంచ్ అవుతున్నందున మరింత సమాచారం కోసం గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ ను చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








