బింగే సర్వీసును ఒక నెల ఉచితంగా అందిస్తున్న టాటా స్కై

|

టాటా స్కై బింగే సర్వీసును ఎంచుకుంటున్న కొత్త కస్టమర్లకు ఇప్పుడు ఒక నెల పాటు ఉచిత ట్రయల్ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఇది ఒక నెలకు రూ.249 ధరతో అందుబాటులో ఉంది. టాటా స్కై బింగే సర్వీస్ యాక్సిస్ టీవీ వీక్షకులను అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, టాటా స్కై ఎడిషన్ ద్వారా OTT యాప్ల నుండి కంటెంట్ ను చూడటానికి అనుమతిస్తుంది.

టాటా స్కై బింగే
 

టాటా స్కై బింగే 249 రూపాయల సరసమైన ధర వద్ద OTT అన్ని యాప్ ల ప్రీమియం యాక్సెస్‌ను అందిస్తుంది. 30 రోజుల ఉచిత ట్రయల్‌తో పాటు టాటా స్కై యూజర్లు మూడు నెలల అమెజాన్ ప్రైమ్ చందాను కూడా ఉచితంగా పొందుతారు. ఈ అమెజాన్ ప్రైమ్ పోస్ట్‌కు ధర నెలకు రూ.129 ఉంటుంది. టాటా స్కై బింగే యొక్క మరోక హైలైట్ లక్షణం క్యాచ్-అప్ టీవీ సర్వీస్. టాటా స్కై బింగే ప్లాట్‌ఫాం ప్రేక్షకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏడు రోజుల వరకు అన్ని ప్రముఖ టీవీ షోలను కూడా చూడవచ్చు.

బేసిక్ రీఛార్జ్ రూ.49 ప్లాన్‌ను తొలగించించిన జియో

టాటా స్కై బింగే సర్వీసు కొత్త ట్రయల్ ఆఫర్‌

టాటా స్కై బింగే సర్వీసు కొత్త ట్రయల్ ఆఫర్‌

టాటా స్కై బింగే DTH ఆపరేటర్ నుండి పూర్తిగా భిన్నమైన సమర్పణను కలిగి ఉంది. డిటిహెచ్ ఆపరేటర్లు ఆండ్రాయిడ్ టివి ఆధారిత సెట్-టాప్ బాక్స్‌లను ప్రారంభించిన తర్వాత వినియోగదారులు శాటిలైట్ టివి మరియు OTT కంటెంట్‌ను ఒకే బాక్స్ ద్వారా చూడటానికి వీలుకల్పిస్తున్నారు. టాటా స్కై మాత్రం దీనికి భిన్నంగా వినియోగదారులను దాని స్వంత సెట్-టాప్ బాక్స్ ద్వారా అందిస్తున్నది. అయితే అదనంగా టాటా స్కై ఫైర్ టివి స్టిక్ ఎడిషన్ ద్వారా OTT యాప్ లకు యాక్సిస్ ను అందిస్తుంది.

టాటా స్కై బింగే

టాటా స్కై బింగే సర్వీసుకు నెలకు రూ.249 ఖర్చవుతుంది. మొదటి నెల కొత్త వినియోగదారులకు ట్రయల్ ఒకటి ఉంటుందని టాటా స్కై తెలిపింది. ఉదాహరణకు మీరు మొదటిసారి టాటా స్కై బింగేని ఎంచుకుంటే మొదటి నెల రూ .249 ఛార్జీలు మాఫీ చేయబడతాయి. అదనంగా టాటా స్కై మూడు నెలల అమెజాన్ ప్రైమ్ చందాను అదనపు ఖర్చు లేకుండా వినియోగదారులకు అందిస్తుంది. ఆ తరువాత వారు సభ్యత్వాన్ని యాక్టీవ్ లో ఉంచడానికి ప్రతి నెలా రూ .129 చెల్లించాలి.

డౌన్‌లోడ్‌లలో రికార్డు సృష్టించిన హాట్‌స్టార్

టాటా స్కై బింగే అంటే ఏమిటి?
 

టాటా స్కై బింగే అంటే ఏమిటి?

టాటా స్కై బింగే అనేది ఇప్పుడు దేశంలో అతిపెద్ద DTH ఆపరేటర్ నుండి వస్తున్న ఎంటర్టైన్మెంట్ సర్వీస్. ఈ ప్రత్యేకమైన సేవలో భాగంగా టాటా స్కై అమెజాన్ ఫైర్ టివి స్టిక్ యొక్క ప్రత్యేకమైన టాటా స్కై ఎడిషన్‌ను వినియోగదారులకు అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది. అయినప్పటికీ వినియోగదారులు రూ .249 నెలవారీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో హాట్స్టార్, సన్ఎన్ఎక్స్టి, హంగమా ప్లే, ఈరోస్ నౌ మరియు Zee5 వంటి OTT సర్వీస్ లకు ప్రీమియం యాక్సెస్ కూడా ఉంది.

టాటా స్కై బింగే ప్యాకేజీ

టాటా స్కై బింగే ప్యాకేజీ

అమెజాన్ ప్రైమ్ చందా టాటా స్కై బింగే ప్యాకేజీలో భాగం కాదు. అయితే టాటా స్కై బింగే వినియోగదారులకు డిటిహెచ్ ఆపరేటర్ అమెజాన్ ప్రైమ్ యొక్క మూడు నెలల ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ నెలవారీ మరియు వార్షిక చందాలు వరుసగా రూ .129 మరియు రూ.999. అమెజాన్ ఫైర్ టివి స్టిక్ కూడా నెట్‌ఫ్లిక్స్ యాప్ ను ప్రీఇన్‌స్టాల్ చేయబడి వస్తుంది. అయితే టాటా స్కై బింగే ప్రముఖ స్ట్రీమింగ్ సేవ యొక్క ప్రీమియం సభ్యత్వాన్ని అందించదు.

OTT యాప్

OTT యాప్ లతో పాటు ముందే ఇన్‌స్టాల్ చేయబడిన టాటా స్కై బింగే యాప్ కూడా ఉంది. టాటా స్కై బింగే యాప్ వేలాది టీవీ కార్యక్రమాలు మరియు మూవీ టైటిల్స్ కలిగిన ఆన్-డిమాండ్ లైబ్రరీని అందిస్తుంది. టాటా స్కై బింగే 400 కంటే ఎక్కువ లైవ్ టివి ఛానెల్‌లను కూడా ఆఫర్‌లో కలిగి ఉంది. అయితే కంపెనీ ప్రస్తుతం ఈ సేవను అందించడం లేదు. బదులుగా టాటా స్కై బింగే వినియోగదారులు గత ఏడు రోజుల వరకు జనాదరణ పొందిన టీవీ షోల ఎపిసోడ్లను చూడవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Offers Binge Service At Rs. 249 Per Month

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X