Home
News

Tata Sky యూజర్లకు ఉచితంగా "క్లాస్‌రూమ్ సర్వీసులు"!!! విద్యార్థులకు శుభవార్త..

కరోనా మహమ్మారి ప్రభావం ఇండియాలో చాలా రంగాల మీద పడింది. ముఖ్యంగా విద్యావ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం పడింది. దాదాపుగా 8 నెలల నుంచి పిల్లలు కేవలం తమ ఇళ్లలోకే పరిమితం కావడంతో పాటుగా ఎక్కువ మంది ఇ-లెర్నింగ్ వ్యవస్థ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ ఆన్ లైన్ క్లాసుల చొరవను పెంచడానికి చాలా కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రస్తుత కరోనా సమయంలో అధిక మంది వినియోగదారులను పొందిన డైరెక్ట్-టు-ది-హోమ్ టెలివిజన్ కంపెనీలు కూడా తమ వినియోగదారులకు వర్చువల్ క్లాస్ రూమ్ ఇ-లెర్నింగ్ సేవలను అందించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి.

టాటా స్కై ఇ-లెర్నింగ్ సర్వీస్

టాటా స్కై ఇ-లెర్నింగ్ సర్వీస్

ఇండియాలో దాదాపుగా 30 మిలియన్లకు పైగా చందాదారులతో దేశంలో అతి పెద్ద డిటిహెచ్ ఆపరేటర్ గా పేరును పొందిన టాటా స్కై తన ప్లాట్‌ఫాంలో ఇప్పుడు తన యూజర్ల కోసం కొత్తగా ‘టాటా స్కై క్లాస్‌రూమ్' సర్వీసును ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సర్వీసుతో టాటా స్కై వినియోగదారుల యొక్క పిల్లలు తమ టెలివిజన్ స్క్రీన్ నుండే నేరుగా నేర్చుకోవడంలో సహాయపడుతుంది. ఇంతకు ముందు టాటా స్కై క్లాస్‌రూమ్ సర్వీసును రోజుకు రూ.3లకు అందించేది. అయితే ఇప్పుడు ఉచితంగా అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై క్లాస్‌రూమ్ సర్వీస్ పూర్తి వివరాలు

టాటా స్కై క్లాస్‌రూమ్ సర్వీస్ పూర్తి వివరాలు

టాటా క్లాస్‌ఎడ్జ్ ఆధారిత టాటా స్కై క్లాస్‌రూమ్ సర్వీస్ ప్రస్తుతం హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో మాత్రమే లభిస్తుంది. టాటా స్కై ఆపరేటర్ ప్రస్తుతం ఈ సర్వీసును ఉచితంగా అందిస్తున్నందున పిల్లలు వారి టీవీల్లోనే తమ యొక్క తరగతుల క్లాసులను సులభంగా వినవచ్చు. ఈ టాటా స్కై క్లాస్‌రూమ్ సర్వీసులో 5 వ తరగతి నుండి 8 వ తరగతి విద్యార్థులకు మాథ్స్ మరియు సైన్స్ కోర్సులకు సంబందించిన అన్ని రకాల క్లాసులను అందిస్తుంది. టాటా స్కై యొక్క ఈ కొత్త సర్వీసులో రెగ్యులర్ కోర్సు-సంబంధిత తరగతులతో పాటుగా పాఠ్య ప్లాన్లతో కూడిన గేమ్స్, శాంపిల్ పేపర్స్ మరియు ఫుల్-లెంగ్త్ ప్రాక్టీస్ పరీక్షలను కూడా అందిస్తుంది. క్లాస్ రూమ్ యొక్క ఉపాధ్యాయుల ఉపన్యాసాలను చూడటం ద్వారా విద్యార్థులు నేర్చుకున్న వాటిని అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది.

టాటా స్కై క్లాస్‌రూమ్ సర్వీస్ ఛానల్ నెంబర్ వివరాలు

టాటా స్కై క్లాస్‌రూమ్ సర్వీస్ ఛానల్ నెంబర్ వివరాలు

టాటా స్కై క్లాస్‌రూమ్ సర్వీస్ ఇప్పటికే ఛానల్ నంబర్ 653 లో అందుబాటులో ఉంది. టాటా స్కై క్లాస్ రూమ్ సర్వీసును ఉచితంగా అందివ్వడానికి గల ప్రధాన కారణం టైర్ 2, 3 & 4 నగరాల్లోని విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ యొక్క తరగతుల యొక్క పాఠ్యముసంలను నేర్చుకోవడానికి అనుమతించడం. కరోనా మహమ్మారి 2020 సంవత్సరం విద్య విభాగానికి చాలా సవాళ్లను తెచ్చిపెట్టింది. భారతదేశంలోని కొన్ని మారుమూల ప్రాంతాలకు సరైన ఇంటర్నెట్ సేవ లేనికారణంగా ఇ-లెర్నింగ్ సేవల ద్వారా విద్యార్థులకు ఈ టాటా స్కై క్లాస్‌రూమ్ సర్వీస్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా విద్యార్థులు ఇప్పుడు తమ టీవీల నుండే నేర్చుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata Sky Now Provide Classroom Service at Channel Number 653 Free of Cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X