Tata Sky Broadband యూజర్లకు బంపర్ ఆఫర్!!! ఏమిటో చూడండి...
ప్రస్తుతం టాటా స్కై యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు అన్ని కూడా భారతదేశం అంతటా ఉన్న వినియోగదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతానికి టాటా స్కై తన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలోని 18 ప్రధాన నగరాల్లో అందిస్తోంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్
టాటా స్కై తన వినియోగదారులకు రెండు రకాల డేటా ప్లాన్లను అందిస్తున్నది. అందులో ఒకటి నెలవారి అపరిమిత డేటా ప్లాన్ ను కొనుగోలు చేసి నెల మొత్తం అపరిమిత డేటాను పొందుతారు. రెండవ రకమైన ప్లాన్ కూడా ఉంది కాకపోతే ఇది ఒక నెల మొత్తంలో నిర్ణీత డేటాను అందిస్తుంది. టాటా స్కై నాలుగు వేర్వేరు టైమ్‌స్టాంప్‌లతో 1 నెల, 3 నెలలు, 6 నెలలు మరియు 12 నెలలు ప్రణాళికలను అందిస్తుంది. ప్రతి టైమ్‌స్టాంప్ వాలిడిటీలో నాలుగు రకాల ప్లాన్ లు ఉన్నాయి. వాటి యొక్క వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 1 నెల ఫిక్స్‌డ్ డేటా ప్లాన్ వివరాలు
టాటా స్కై తన వినియోగదారులకు అందిస్తున్న మొట్టమొదటి ఫిక్స్‌డ్ డేటా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కేవలం రూ.790 ధర వద్ద 150GB నెలవారీ డేటాను 50Mbps వేగంతో అందిస్తుంది. ఇందులో రెండవ ప్లాన్ 100Mbps వేగంతో 250GB డేటాను రూ.950 ధర వద్ద అందిస్తుంది. మూడవ ప్లాన్ 50Mbps వేగంతో 500GB డేటాను 1,000 రూపాయలకు అందిస్తుంది. చివరగా రూ.1,050 ధర వద్ద 100Mbps వేగంతో 500GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో దేనిలోనూ కూడా ప్రత్యేక ఆఫర్ లేదు. ప్రతి ప్లాన్‌తో మీకు రౌటర్ ఉచితంగా లభిస్తుంది. అలాగే సేఫ్ కస్టడీ మరియు డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కూడా లభిస్తుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 3 నెలల ఫిక్స్‌డ్ డేటా ప్లాన్ వివరాలు
3 నెలల వాలిడిటీతో టాటా స్కై ఫిక్స్‌డ్ డేటా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల విషయానికి వస్తే ఇందులో మొదటి ఆఫర్ 50Mbps వేగంతో 150GB డేటాను రూ.2,250 ధర వద్ద వస్తుంది. రెండవ ప్లాన్ 100Mbps వేగంతో 250GB డేటాను రూ.2,700 ధర వద్ద అందిస్తుంది. మూడవ ప్లాన్ 50Mbps వేగంతో 500GB డేటాను రూ.2,850 ధర వద్ద ఆఫర్ చేస్తుంది. చివరి ప్లాన్ 100Mbps వేగంతో 500GB డేటాను రూ .3,000 రిటైల్ ధర వద్ద అందిస్తుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 6 నెలల ఫిక్స్‌డ్ డేటా ప్లాన్ వివరాలు
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 6 నెలల చెల్లుబాటు కాలానికి అందిస్తున్న ప్లాన్ ల విషయానికి వస్తే ఇందులో 50Mbps వేగంతో 150GB డేటాను రూ.4,050 ధర వద్ద ఆఫర్ చేస్తోంది. రెండవ ప్లాన్ 100Mbps వేగంతో 250GB డేటాను రూ.4,860 ధర వద్ద అందిస్తుంది. మూడవ ప్లాన్ 50Mbps వేగంతో 500GB డేటాను 5,130 రూపాయలకు అందిస్తుంది. చివరి ప్లాన్ 100Mbps వేగంతో 500 జిబి డేటాను రూ.5,400 ధర వద్ద అందిస్తుంది. ఈ ప్లాన్ల మీద వినియోగదారులు 10% అదనపు తగ్గింపును కూడా పొందుతారు. దానితో మీకు ఉచిత రౌటర్, ఉచిత ఇన్‌స్టాలేషన్, డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కూడా ఉచితంగా లభిస్తుంది.


Click it and Unblock the Notifications








