Tata Sky యూజర్లకు బ్యాడ్ న్యూస్!!! 5 ఛానెళ్లు తొలగింపు...

|

భారతదేశంలోని డిటిహెచ్ రంగంలో అతిపెద్ద కస్టమర్ బేస్ ను కలిగి ఉన్న టాటా స్కై ఎల్లప్పుడూ తన వినియోగదారులకు గొప్ప ఆఫర్లను అందిస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఒక చేదు వార్తను అందిస్తున్నది. జూలై 22 నుంచి సత్యం టివితో సహా ఐదు ఛానెళ్లను తన ప్లాట్‌ఫాం నుండి తొలగించనున్నట్లు ఇప్పటికే వినియోగదారులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

టాటా స్కై యాక్సెస్‌ అప్‌డేట్

టాటా స్కై యాక్సెస్‌ అప్‌డేట్

డిటిహెచ్ ఆపరేటర్ టాటా స్కై ఇప్పటికే పలు మార్పులను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కొత్త అప్ డేట్ లో భాగంగా ఇది రిఫ్రెష్ చేసిన వెబ్ పోర్టల్ దాని సెట్-టాప్ బాక్స్‌లకు ఒక క్లిక్ యాక్సెస్‌ను మరియు దాని కొత్త వినియోగదారుల కోసం ప్యాక్‌లను అందిస్తుంది. ప్రస్తుతం టాటా స్కై వినియోగదారులకు వారి చందాదారుల అకౌంటులకు లైవ్ యాక్సిస్ కూడా లభిస్తుంది. టాటా స్కై కొత్త అప్ డేట్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై తొలగిస్తున్న ఐదు ఛానెళ్ల వివరాలు

టాటా స్కై తొలగిస్తున్న ఐదు ఛానెళ్ల వివరాలు

టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ జూలై 22 నుంచి తొలగించే ఐదు ఛానెళ్లలో సత్యం టివి, ఐ న్యూస్, అహో మ్యూజిక్, సూర్య భోజ్‌పురి మరియు సూర్ సినిమా ఛానెళ్లు ఉన్నాయి. డిటిహెచ్ ఆపరేటర్ ప్రస్తుతం ఐదు ఛానెళ్లలో బ్యానర్ నోటిఫికేషన్‌ను కలిగి ఉంది.

టాటా స్కై FTA కాంప్లిమెంటరీ ప్యాక్

టాటా స్కై FTA కాంప్లిమెంటరీ ప్యాక్

టాటా స్కై ఆపరేటర్ జూన్ 1 న FTA కాంప్లిమెంటరీ ప్యాక్ నుండి తొలగించిన 25 ఛానెళ్లలో సత్యం టివి కూడా ఉంది. నెట్‌వర్క్ ఫీజు కాల్కులేషన్ సమయంలో ఎఫ్‌టిఎ కాంప్లిమెంటరీ ప్యాక్‌లోని ఛానెల్స్ భాగంను పరిగణింలేదు. ఈ ఛానెల్‌లు ఇప్పటివరకు టాటా స్కై ప్లాట్‌ఫామ్‌లో భాగంగా కొనసాగుతుండగా వినియోగదారులు ఈ ఛానెల్‌లకు సభ్యత్వాన్ని పొందవలసి వచ్చింది.

టాటా స్కై వెబ్ పోర్టల్ న్యూ అప్‌డేట్

టాటా స్కై వెబ్ పోర్టల్ న్యూ అప్‌డేట్

టాటా స్కై ఆపరేటర్ తన వినియోగదారుల కోసం అదనంగా రిఫ్రెష్ చేసిన వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది. ఇది టాటా స్కై వాచ్‌కు లైవ్ యాక్సిస్ ను కూడా అందిస్తుంది. ఇది వినియోగదారులకు లైవ్ ఛానెల్‌లను చూడటానికి మరియు వీడియో ఆన్ డిమాండ్ వంటి ఫీచర్లను చూడటానికి వీలు కల్పిస్తుంది. ఇప్పటికే ఉన్న టాటా స్కై వినియోగదారుల కోసం సంస్థ మై అకౌంట్ పోర్టల్‌ను రిఫ్రెష్ చేసింది. అలాగే ఇది STB అప్‌గ్రేడేషన్, షోకేస్ ఆర్డర్ మరియు మల్టీ-టివి కనెక్షన్‌లకు కూడా స్టాండర్డ్ యాక్సిస్ ను అందిస్తోంది.

టాటా స్కై బింగే + సర్వీస్ వివరాలు

టాటా స్కై బింగే + సర్వీస్ వివరాలు

టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ తన టాటా స్కై బింగే + STBలోని టాటా స్కై బింగే విభాగానికి Zee5 కంటెంట్ ను అదనంగా జోడించింది. టాటా స్కై బింగే సర్వీస్ SunNXT, డిస్నీ + హాట్‌స్టార్, ఈరోస్ నౌ, హంగమా ప్లే మరియు షెమరూ మి వంటి పలు యాప్ ల కంటెంట్‌ను ఉచితంగా చూడటానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది. డిటిహెచ్ ఆపరేటర్ టాటా స్కై బింగే + STB యొక్క ధర రూ.3999 కాగా టాటా స్కై బింగే సర్వీస్ యొక్క నెల వారి అద్దె ధర రూ.249 గా నిర్ణయించారు.

Best Mobiles in India

English summary
Tata Sky Set to Discontinue Five Channels on July 22

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X