టాటా స్కై మ్యూజిక్ సర్వీసులో కొత్త మార్పులు!! రోజుకు రూ.2.5 మాత్రమే

|

టాటా స్కై తన వినియోగదారులకు చాలా సృజనాత్మక మరియు వినూత్న సేవలను అందిస్తుంది. ముఖ్యంగా కరోనా యొక్క ఈ సమయంలో ఇంటికి పరిమితమైన వారిని దృష్టిలో ఉంచుకొని అనేక సేవలను ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చింది. టాటా స్కై తన కస్టమర్ల సౌలభ్యాన్ని కోరుకోవడమే కాక తన యొక్క సేవలను చౌకగా అందించే వాటిలో కంపెనీ యొక్క బింగే సర్వీస్ ఒక నిదర్శనం.

 

టాటా స్కై

టాటా స్కై తన యొక్క వినియోగదారులకు అందించే అనేక వినోద సేవలలో మ్యూజిక్ సర్వీస్ కూడా ఒకటి. ఇంతకు ముందు టాటా స్కై ఆపరేటర్ టాటా స్కై మ్యూజిక్ మరియు టాటా స్కై మ్యూజిక్ + లను అందించేది. కానీ ఇప్పుడు టాటా స్కై మ్యూజిక్ మరియు టాటా స్కై మ్యూజిక్ + రెండింటిలోని ఉత్తమ భాగాలను ఏకీకృతం చేసి అప్ డేట్ మ్యూజిక్ సర్వీసును కంపెనీ ప్రకటించింది. సంస్థ యొక్క సరికొత్త మ్యూజిక్ సర్వీస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై మ్యూజిక్ చందాదారులకు ఉచితంగా హంగామా మ్యూజిక్ ప్రో

టాటా స్కై మ్యూజిక్ చందాదారులకు ఉచితంగా హంగామా మ్యూజిక్ ప్రో

టాటా స్కై మ్యూజిక్‌కు సభ్యత్వాన్ని పొందిన వినియోగదారులకు హంగామా మ్యూజిక్ ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. సాధారణంగా హంగామా మ్యూజిక్ ప్రో నెలకు రూ.99 ధర వద్ద లభిస్తుంది. ఇందులో వినియోగదారులు 20 వేర్వేరు ఆడియో స్టేషన్లు మరియు 5 వీడియో స్టేషన్ల నుండి పాటలను పొందుతారు.

 

 

Poco M3 Pro 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!!! 5G ఫోన్ రూ.15000 లోపే...Poco M3 Pro 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!!! 5G ఫోన్ రూ.15000 లోపే...

టాటా స్కై మ్యూజిక్ సబ్స్క్రిప్షన్
 

టాటా స్కై మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కొనుగోలులోని ఉత్తమమైన వాటిలో ఒకటి వినియోగదారుకు లభించే ప్రకటన రహిత అనుభవం. ఇంకా, వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఈ సర్వీసును యాక్సెస్ చేస్తుంటే కనుక వారు ఆఫ్‌లైన్ లిజనింగ్ కోసం పాటలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లకు ఎటువంటి పరిమితి లేదు కాబట్టి వినియోగదారులు తమకు కావలసిన పాటలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మ్యూజిక్ సర్వీసు

టాటా స్కై మ్యూజిక్ సర్వీసును కొనుగోలు చేసిన వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టీవీల్లో కూడా యాక్సెస్ చేయడానికి వీలు ఉంటుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ, గజల్, భక్తి, హిందుస్తానీ వంటి మరెన్నో వివిధ రకాల సంగీతం ఇందులో అందుబాటులో ఉంటుంది. టాటా స్కై నుండి ఇది అద్భుతమైన ప్రతిపాదన ఎందుకంటే ఇది రోజుకు రూ.2.5 ధర వద్ద మాత్రమే లభిస్తుంది.

టాటా స్కై మ్యూజిక్ సర్వీస్ అప్‌గ్రేడ్

టాటా స్కై మ్యూజిక్ సర్వీస్ అప్‌గ్రేడ్

టాటా స్కై మ్యూజిక్ సర్వీస్ అనేది ఇతర మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే చాలా చౌకగా ఉండడమే కాకుండా వాటి కంటే ఎక్కువ కంటెంట్‌ను అందిస్తుంది. టాటా స్కై మ్యూజిక్ ఒక కుటుంబానికి కూడా మంచిది ఎందుకంటే ఇది 360-డిగ్రీల సరసమైన ఫ్యామిలీ ప్లాన్ ను అందిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సర్వీసును ఉపయోగించడం కోసం మీరు మీ ఆండ్రాయిడ్ మరియు iOS పరికరంలో టాటా స్కై మొబైల్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టాటా స్కై మ్యూజిక్ మరియు టాటా స్కై మ్యూజిక్ + కు ఇప్పటికే సభ్యత్వం పొందిన వినియోగదారులు స్వయంచాలకంగా పునరుద్ధరించిన సర్వీసుకు అప్‌గ్రేడ్ చేయబడతారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Music New Service Now Available Just Rs.2.5 Per Day Only

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X