Tata Sky యూజర్లకు చేదు వార్త!! ఇక మీద అందుబాటులో 4 STBలు మాత్రమే
ఇండియాలోని డిటిహెచ్ ఆపరేటర్‌లలో ఒకటైన టాటా స్కై ఇప్పుడు తన వినియోగదారులకు ఒక చేదు వార్తను అందిస్తున్నది. ఇక నుంచి వినియోగదారులు కొనుగోలు చేయడానికి కేవలం నాలుగు సెట్-టాప్ బాక్స్ లను మాత్రమే అందించనున్నది. టాటా స్కై ఇకపై తన 4K సెట్-టాప్ బాక్స్ (STB) ను అందించడం లేదు.

టాటా స్కై STB
టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ మార్కెట్లో చౌకైన ధర వద్ద ప్లాన్ లను మరియు STB లను అందిస్తున్నప్పటికీ దాని ఖరీదైన ధరల వద్ద కూడా అద్భుతమైన సేవలను అందిస్తుంది. ఇప్పుడు డిటిహెచ్ ఆపరేటర్ తన 4K ఎస్‌టిబిని వినియోగదారులకు అందించడం లేదు. కాబట్టి వినియోగదారులు ఎంచుకోవడానికి కేవలం నాలుగు ఎస్‌టిబిలు టాటా స్కై బింగే +, టాటా స్కై హెచ్‌డి సెట్-టాప్ బాక్స్, టాటా స్కై + హెచ్‌డి సెట్-టాప్ బాక్స్, మరియు టాటా స్కై ఎస్‌డి సెట్-టాప్ బాక్స్ వంటివి మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

టాటా స్కై SD సెట్-టాప్ బాక్స్
టాటా స్కై సంస్థ తన SD సెట్-టాప్ బాక్స్ ను రూ.1,499 ధర వద్ద అందిస్తుంది. ఇది స్టాండర్డ్-డెఫినిషన్ వీడియో నాణ్యతకు మద్దతు ఇస్తుంది. వినియోగదారుడు దీని ద్వారా టాటా స్కై యొక్క SD సేవల శ్రేణిని ఆనందించవచ్చు. ఇది SD సెట్-టాప్ బాక్స్ కాబట్టి HD ఛానల్స్ ఏవీ కూడా ఈ STBలో యాక్సిస్ చేయలేము. కానీ కస్టమర్ SD సెట్-టాప్ బాక్స్ నుండి HD లేదా ఇతర STB డిటిహెచ్ ఆపరేటర్ల సమర్పణలను కోరుకున్నప్పుడు దీనిని అప్‌గ్రేడ్ చేయవచ్చు.

టాటా స్కై HD సెట్-టాప్ బాక్స్
టాటా స్కై HD సెట్-టాప్ బాక్స్ లో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇది SD STB కంటే ఉన్నతమైనది అయినప్పటికీ SD STB యొక్క అదే సమానమైన ధరను కలిగి ఉంటుంది. కస్టమర్ హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌ను రూ.1,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది అన్ని వీడియోలను 1080i రిజల్యూషన్ వద్ద డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్‌లో అందించబడతాయి. వినియోగదారులు ఈ బాక్స్ ను కలిగి ఉంటే కనుక DTH ఆపరేటర్ అందించే HD ప్లాన్ లను ఎంచుకోవచ్చు.

టాటా స్కై + HD సెట్-టాప్ బాక్స్
ప్రస్తుతం టాటా స్కై అందించే అత్యంత ఖరీదైన STB టాటా స్కై + HD సెట్-టాప్ బాక్స్ . ఇది రూ.4,999 ధర వద్ద లభిస్తుంది. ఇది టాటా స్కై HD సెట్-టాప్ బాక్స్‌కు సమానమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. కానీ రెండు STBల మధ్య ఒక ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే టాటా స్కై + HD సెట్-టాప్ బాక్స్ ఒకేసారి మూడు వేర్వేరు ఛానెల్‌లను రికార్డ్ చేయగలదు. కాబట్టి కస్టమర్ తమ అభిమాన షోలను దేనిని కూడా మిస్ అవ్వకుండా రికార్డ్ చేయడానికి వీలుకల్పిస్తుంది. ఇది 1080i రిజల్యూషన్ వీడియో సపోర్ట్ మరియు డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ సపోర్ట్‌తో వస్తుంది.

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్
టాటా స్కై అందించే ఆండ్రాయిడ్ STB ఇదే కావడం విశేషం. ఇది అన్ని లైవ్ టీవీ ఛానెల్‌లకు మద్దతుతో వస్తుంది. కానీ ఈ STB అందించే బింగే సేవతో మీకు ఇష్టమైన OTT కంటెంట్ ప్లాట్‌ఫాంలను కూడా ప్రసారం చేయవచ్చు. వాయిస్ ఆదేశాలను తీసుకోవడానికి రిమోట్‌లో గూగుల్ అసిస్టెంట్ కూడా అమర్చబడి ఉంది. ఈ STB అంతర్నిర్మిత Chromecast తో వస్తుంది కాబట్టి మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీలో కూడా డిస్ప్లే చేయవచ్చు. వినియోగదారులు ఎవరైనా కొత్త టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్‌ను కొనుగోలు చేసినప్పుడు మొదటి 6 నెలలు బింగే సర్వీస్ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది.


Click it and Unblock the Notifications








