Home
News

Tata Sky వినియోగదారులకు ఊహించని శుభవార్త...

ఇండియాలో DTH రంగంలో అత్యంత ప్రసిద్ధచెందిన సర్వీస్ ఆపరేటర్లలో టాటా స్కై ఒకటి. ఇది తన వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తూ ప్రస్తుతం మొదటి స్థానంలో నిలిచింది. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు జాతీయ లాక్డౌన్ ప్రకటించినప్పుడు టాటా స్కై తన వినియోగదారులకు వివిధ రకాల 10 పే ఛానెళ్లను ఉచితంగా ప్రకటించింది.

టాటా స్కై

లాక్డౌన్ యొక్క మొదటి దశలో COVID-19 యొక్క ముప్పు కంట్రోల్ కానందున ఈ ప్రాణాంతక వైరస్ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం 2020 మే 03 వరకు లాక్డౌన్ వ్యవధిని పొడిగించింది. ఈ ప్రకటనతో టాటా స్కై తన చందాదారులను ఇళ్లలో ఉంచడానికి ముందు అందించిన ఉచిత ఇంటరాక్టివ్ సేవల యొక్క చెల్లుబాటు కాలాన్ని ఇప్పుడు పొడిగించింది. అలాగే చందాదారులు అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉన్న విద్యా మరియు సమాచార ఛానెల్‌లను చూడటం ద్వారా వారి ఖాళీ సమయంలో ఆనందం పొందగలుగుతున్నారు.

ఉచిత ఛానెల్‌లు

ఉచిత ఛానెల్‌లు

టాటా స్కై వారు 10 ఇంటరాక్టివ్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ముందే ప్రకటించారు. దీని యొక్క సెటప్-బాక్స్ లేదా టాటా స్కై యాప్‌లో ఛానెల్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే వినియోగదారులు వీటి అదనపు సేవలను ఆస్వాదించడానికి అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. టాటా స్కై డాన్స్ స్టూడియో (ఛానల్ 123), టాటా స్కై బ్యూటీ (ఛానల్ 119), టాటా స్కై క్లాస్‌రూమ్ (653), టాటా స్కై ఫిట్‌నెస్ (110), టాటా స్కై వేదిక్ మాథ్స్ (702), టాటా స్కై కుకింగ్ (127), టాటా స్కై ఫన్ లెర్న్ (664 & 686), టాటా స్కై జావేద్ అక్తర్ (150) వంటి ఛానల్లు ఉచితంగా అందిస్తున్నది.

టాటా స్కై అత్యవసర బ్యాలెన్స్ క్రెడిట్ సర్వీస్

టాటా స్కై అత్యవసర బ్యాలెన్స్ క్రెడిట్ సర్వీస్

10 ఉచిత ఇంటరాక్టివ్ సేవలతో పాటు టాటా స్కై తన చందాదారులకు అత్యవసర బ్యాలెన్స్ క్రెడిట్ సేవలను కూడా అందిస్తోంది. లాక్డౌన్ వ్యవధిని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి టాటా స్కై చందాదారులు సమీప రిటైల్ దుకాణాలు మూసివేయబడినందున వారి అకౌంటును రీఛార్జ్ చేయలేకపోయారు. నిర్బంధ కాలంలో చందాదారులు డిటిహెచ్ సేవలను ఆస్వాదించడానికి టాటా స్కై అత్యవసర క్రెడిట్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇది అదనపు వడ్డీ లేకుండా ఒక నిర్దిష్ట సమయం కోసం బ్యాలెన్స్ లోన్‌ను అందిస్తుంది.

 క్రెడిట్ సర్వీసు యాక్టివేట్

క్రెడిట్ సర్వీసు యాక్టివేట్

టాటా స్కై అత్యవసర బ్యాలెన్స్ క్రెడిట్ సర్వీసును పొందటానికి టాటా స్కై చందాదారులు వారి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 080-6999922 కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. కాల్ విజయవంతంగా కనెక్ట్ అయిన తర్వాత చందాదారుల అకౌంట్ స్వయంచాలకంగా యాక్టివేట్ అవుతుంది మరియు దాని యొక్క అన్ని రకాల సేవలు తిరిగి ప్రారంభించబడతాయి. చందాదారులు తమ యొక్క అకౌంటును తదుపరిసారి రీఛార్జ్ చేసినప్పుడు ఆ మొత్తం అదనపు వడ్డీ లేకుండా వారి అకౌంట్ నుండి డెబిట్ చేయబడుతుంది.

టాటా స్కై ఫిట్‌నెస్ షెడ్యూల్

టాటా స్కై ఫిట్‌నెస్ షెడ్యూల్

టాటా స్కై ఫిట్‌నెస్ ఛానల్ యొక్క షెడ్యూల్ విషయానికొస్తే యోగా & వర్కౌట్ ఉదయం 6 నుండి 12 గంటల వరకు మరియు 4 PM నుండి 11 PM వరకు ఉంటుంది. ఉమెన్స్ స్పెషల్ మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ప్రసారం చేయబడుతుంది. ధ్యానం మరియు మ్యూజిక్ ప్రోగ్రామ్స్ 11 PM నుండి 5 AM మధ్య ప్రసారం చేయబడతాయి. ఆదివారాలలో ఒక సెలబ్రిటీ స్పెషల్ ప్రోగ్రాం ఉంటుంది. పైన పేర్కొన్న వర్కౌట్‌లకు సమయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చివరగా టాటా స్కై ఫిట్‌నెస్‌లో ఉదయం 6:30 నుండి 7:30 AM మరియు 6:30 PM నుండి 7:30 PM మధ్య ప్రత్యేకమైన సీనియర్ సిటిజెన్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. టాటా స్కై ఫిట్‌నెస్‌ను చందాదారులు రోజుకు రూ.2 చొప్పున పొందవచ్చు. అయితే ఇండియాలో ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌లో భాగంగా ఈ ఛానెల్ను మరియు దాని యొక్క సర్వీసులను ఉచితంగా అందిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata Sky Offers 10 Pay Channels Services at Free of Cost On Full Lockdown Time
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X