Home
News

Tata Sky యూజర్లకు స్పెషల్ ఆఫర్!!! 2నెలల క్యాష్‌బ్యాక్ పొందే గొప్ప అవకాశం...

భారతదేశపు డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్లలో ఒకటైన టాటా స్కై ఇప్పుడు తన వినియోగదారులకు ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తున్నది. వినియోగదారులు ఎవరైనా సరే ఒక సంవత్సరం పాటు అంటే పూర్తిగా 12 నెలల చెల్లుబాటు కాలానికి రీఛార్జ్ చేసినప్పుడు వారికి అదనంగా 2 నెలల క్యాష్‌బ్యాక్‌ను ఉచితంగా అందిస్తోంది.

టాటా స్కై - ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫర్

టాటా స్కై - ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫర్

ఐసిఐసిఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో తమ యొక్క అకౌంటును రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఆపరేటర్ ప్రత్యేకంగా తెలిపారు. అలాగే చందాదారులు 6 నెలల చెల్లుబాటు కాలానికి రీఛార్జ్ చేస్తే కనుక ఒక నెల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వార్షిక క్యాష్‌బ్యాక్ ఆఫర్ మాదిరిగానే ఆరు నెలల చెల్లుబాటు కాలానికి రీఛార్జ్ చేసే వినియోగదారులు ఒక నెల క్యాష్‌బ్యాక్‌కు అర్హత పొందడానికి ఐసిఐసిఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టాటా స్కై స్పెషల్ ఆఫర్ ఐసిఐసిఐ బ్యాంక్ చందాదారులకు

టాటా స్కై స్పెషల్ ఆఫర్ ఐసిఐసిఐ బ్యాంక్ చందాదారులకు

టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ ఐసిఐసిఐ బ్యాంక్ వినియోగదారుల కోసం అందిస్తున్న ప్రత్యేకమైన స్పెషల్ ఆఫర్లలో భాగంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ను పొందడానికి కొన్ని నిబంధనలు మరియు షరతులను కూడా విధించింది. అక్టోబర్ 31, 2020 వరకు మాత్రమే ఈ ఆఫర్ చందాదారులకు వర్తిస్తుందని ప్రత్యేకంగా తెలిపింది. అంతేకాకుండా టాటా స్కై యొక్క వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నేరుగా జరిగే లావాదేవీలు మరియు రీఛార్జిలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

టాటా స్కై స్పెషల్ ఆఫర్ నిబంధనలు

టాటా స్కై స్పెషల్ ఆఫర్ నిబంధనలు

టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ ఐసిఐసిఐ బ్యాంక్ వినియోగదారులకు అందిస్తున్న క్యాష్‌బ్యాక్ 7రోజులలో నేరుగా యూజర్ యొక్క అకౌంటులోకి జమచేయబడుతుంది అని డిటిహెచ్ ఆపరేటర్ తెలిపింది. అయితే కస్టమర్ రెండు నెలల క్యాష్‌బ్యాక్ ను పొందుతుంటే కనుక మొదటి నెల క్యాష్‌బ్యాక్ 48 గంటల్లోనే జమచేయబడుతుంది. మిగిలిన రెండవ నెల క్యాష్‌బ్యాక్ 7 రోజులలో జమ అవుతుంది. టాటా స్కై అకౌంటును యాక్టీవేట్ చేసిన రోజున చేసిన రీఛార్జీలు ఈ ఆఫర్ కింద ప్రయోజనాలను పొందటానికి అర్హత పొందవు.

టాటా స్కై స్పెషల్ ఆఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా యూజర్లకు

టాటా స్కై స్పెషల్ ఆఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా యూజర్లకు

భారతదేశంలో అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ అయిన టాటా స్కై ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు కూడా ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను అందిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ వినియోగదారుల మాదిరిగానే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డును ఉపయోగించి టాటా స్కై అకౌంటును 12 నెలల చెల్లుబాటు కాలంతో రీఛార్జి చేసిన వారికి రెండు నెలల క్యాష్‌బ్యాక్ పొందటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్ 2020 నవంబర్ 30 వరకు కార్డుకు ఒకసారి చెల్లుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ యూజర్లు లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా యూజర్లు లేని వినియోగదారులు కూడా 12 నెలల రీఛార్జిపై ఒక నెల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Tata Sky Provide Special Offer For ICICI Bank users !!! Great Chance to Get 2 Months Cashback
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X