Amazon Fire TV Stickను ఉచితంగా అందిస్తున్న టాటా స్కై

|

టాటా స్కై ఇప్పుడు తన DTH కనెక్షన్‌తో పాటు OTT కంటెంట్‌ను వినియోగదారులకు అందించే ఆలోచనలో ఉంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ మరియు ఎక్స్‌స్ట్రీమ్ డాంగిల్, డి 2 హెచ్ మరియు డిష్ టివి వంటి క్రోమ్‌కాస్ట్‌లో కూడా OTT కంటెంట్‌ను అందిస్తున్నాయి. టాటా స్కై కంపెనీ ఇటీవలే OTT కంటెంట్‌ కోసం కొత్తగా టాటా స్కై బింగేను పరిచయం చేసింది. ఇది అమెజాన్ ఫైర్ టివి స్టిక్ డాంగిల్‌ను కలిగి ఉండి OTT సర్వీసులను అందిస్తుంది.

 

DTH కనెక్షన్

మీరు కొత్త DTH కనెక్షన్ కోసం చూస్తున్నారా అయితే వీటితో పాటు OTT కంటెంట్‌ను అందిస్తున్న దానిని ఎంచుకోవడం చాలా ఉత్తమం. ప్రస్తుతం ఉన్న రోజులలో చాలా మంది OTT సర్వీసులను ఉపయోగించడం ఎక్కువగా జరుగుతున్నది. కాబట్టి కొత్త కనెక్షన్ పొందాలన్న ఉన్న దానిని అప్‌గ్రేడ్ చేయాలన్న దీని కంటే సరైన సమయం మరొకటి ఉండదు. ఎందుకంటే DTH ఆపరేటర్లు ఒకరిని చూసి మరొకరు ఉచిత సేవలను అందిస్తున్నారు.

 

Tata Sky Binge: ZEE5 సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న టాటా స్కై బింగే సర్వీస్Tata Sky Binge: ZEE5 సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న టాటా స్కై బింగే సర్వీస్

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్
 

ఇప్పుడు టాటా స్కై యొక్క కొత్త హెచ్‌డీ సెట్-టాప్ బాక్స్ తీసుకున్నవారికి 'అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ను ఉచితంగా అందిస్తోంది. అంటే మీరు సెట్-టాప్ బాక్స్ తీసుకుంటే రూ.3,999 విలువైన అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉచితంగా లభిస్తుంది. ఒక్కరూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే టాటాస్కై కనెక్షన్ ఉన్నవారు హెచ్‌డీ సెట్-టాప్ బాక్స్‌కు అప్‌గ్రేడ్ చేసుకున్నా కూడా ఈ ఆఫర్ పొందొచ్చు. కేవలం నెలవారీ చందా రూ.249 మాత్రమే వసూలు చేయబడుతుంది. డాంగిల్ అలెక్సా రిమోట్‌తో వస్తుంది.

కనెక్షన్

కొత్త కనెక్షన్ ప్రారంభ ధర రూ.1,499 నుంచి ప్రారంభం అవుతుంది. మీరు ఎంచుకునే ఛానెల్ ప్యాకేజీని బట్టి ఇది మారొచ్చు. మీరు కనెక్షన్ తీసుకున్న తర్వాత హెచ్‌డీ సెట్-టాప్ బాక్స్‌తో పాటు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉపయోగించుకోవచ్చు. గతంలో 'టాటా స్కై బింగే ' సర్వీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్

'అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్'‌ను మీ టీవీలోని హెచ్‌డీఎంఐ పోర్ట్‌కు, మీ ఇంట్లోని వైఫై నెట్వర్క్‌కు కనెక్ట్ చేయాలి. సెట్-టాప్ బాక్స్‌కు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌లో అమెజాన్ ప్రైమ్‌తో పాటు హాట్‌స్టార్, జీ5, ఎరోస్ నౌ లాంటి స్ట్రీమింగ్ యాప్స్ కు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందిస్తోంది.

టాటా స్కై బింగే డాంగిల్

ఫైర్ టీవీ స్టిక్ ప్లాట్‌ఫాం (టాటా స్కై బింగే డాంగిల్) కూడా ALT బాలాజీ మరియు నెట్‌ఫ్లిక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే వీటికి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్-టాప్ బాక్స్ అవసరం లేదంటే టాటా స్కై బింజ్ సర్వీస్ తీసుకోవచ్చు. నెలకు రూ.249 చెల్లిస్తే చాలు హాట్‌స్టార్, ఎరోస్ నౌ, జీ5, హంగామా ప్లే, సన్ నెక్స్ట్‌ లాంటి సర్వీసుల్ని పొందొచ్చు.

Best Mobiles in India

English summary
Tata Sky Users Now Get Amazon Fire TV Stick For Free

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X