Home
News

తక్కువ ధరకే టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు 100Mbps స్పీడ్‌ & అన్‌లిమిటెడ్ డేటా

చందాదారులు 2 Mbps లేదా 10 Mbps డేటా వేగంతో సంతృప్తి చెందే రోజులు పోయాయి. గిగాబిట్ కనెక్షన్లు బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమలోకి ప్రవేశించడంతో చందాదారులు ఇప్పుడు అధిక వేగంతో ఎక్కువ డేటాను తక్కువ ధరకు లభిస్తున్న ప్లాన్ లను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్‌లకు మరియు టెలికాం ఆపరేటర్లకు మాత్రమే కాకుండా ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కు కూడా ఇది పెద్ద సవాలుగా మారింది.

టివి ఆపరేటర్లు

కేబుల్ టివి ఆపరేటర్లు మరియు డిటిహెచ్ ఆపరేటర్లు కూడా చివరి-మైలు కనెక్టివిటీ కారణంగా ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ లను అందిస్తున్నారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో వినిపించే పేరు టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్. ఇది బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చాలా తక్కువ సమయంలోనే చాలా నగరాలకు విస్తరించింది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వారి చందాదారులకు ఆకర్షణీయమైన ప్లాన్ లను తక్కువ ధర వద్ద అందిస్తున్నది. ఇప్పుడు టాటా స్కై తన బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోలో మరి కొన్ని కొత్త రివైజ్డ్ ప్లాన్‌లను చేర్చింది. ఈ ప్లాన్లలో కొన్ని వినియోగదారులకు అపరిమిత మరియు పరిమిత డేటాను అందిస్థాయి. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న ప్లాన్ ల గురించి తెలుసుకోవడానికి మరింత ముందుకు చదవండి.

టాటా స్కై అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

టాటా స్కై అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోలో వున్న మొదటి ప్లాన్ రూ.900 ప్లాన్. ఇది వినియోగదారులకు అపరిమిత డేటాను 25 ఎమ్‌బిపిఎస్ వేగంతో అందిస్తుంది. వినియోగదారులకు ఈ ప్లాన్ కింద సురక్షిత కస్టడీ ప్రయోజనం కూడా లభిస్తుంది. అదేవిధంగా టాటా స్కై ఈ పోర్ట్‌ఫోలియోలో 50 ఎమ్‌బిపిఎస్ మరియు 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో వచ్చే ఇతర ప్లాన్‌లను కలిగి ఉంది. వాటి ధర నెలకు రూ.1,000 మరియు రూ.1,100.

బ్రాడ్‌బ్యాండ్

ఇప్పుడు ఈ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో గమనించవలసిన విషయం ఏమిటంటే చందాదారులు దీర్ఘకాలిక చందాను ఎంచుకుంటే కనుక మరికొన్ని ప్రయోజనాలను పొందగలుగుతారు. ఉదాహరణకు టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ నుండి ఈ ప్లాన్‌ల యొక్క నెలవారీ సభ్యత్వాన్ని పొందటానికి బదులుగా చందాదారులకు మూడు నెలల ఉచిత చందా లభించడంతో పాటు ఉచిత రౌటర్ మరియు ఉచిత ఇన్‌స్టాలేషన్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తుంది.

టాటా స్కై అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ దీర్ఘకాలిక ప్రయోజనాలు

టాటా స్కై అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ దీర్ఘకాలిక ప్రయోజనాలు

అపరిమిత డేటా ప్లాన్‌లను పొందాలని కోరుకుంటున్న వారు 6 నెలల చందా లేదా 12 నెలల చందాను ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది మీకు ఉచిత రౌటర్ మరియు ఉచిత ఇన్‌స్టాలేషన్ ప్రయోజనాన్ని అందించడమే కాకుండా 10% తగ్గింపు కూడా లభిస్తుంది. ఆరు నెలలకు 100 ఎమ్‌బిపిఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కోసం మీరు 6,600 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే మీరు ఆరు నెలల సభ్యత్వాన్ని ఒకే సారి ఎంచుకుంటే కనుక మీకు కేవలం రూ.5,940 మాత్రమే ఖర్చవుతుంది. దీనితో పాటు మీరు ఉచిత రౌటర్ మరియు ఉచిత ఇన్‌స్టాలేషన్ ప్రయోజనం కూడా పొందుతారు. అపరిమిత డేటా ప్లాన్ యొక్క వార్షిక చందా విషయంలో చందాదారులు 10% కు బదులుగా 15% తగ్గింపును పొందుతారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata Sky Broadband Offers Unlimited Data with 100 Mbps Speed at Rs.1,100
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X