రూ. 6 వేల కోట్ల జరిమానాతో అల్లాడుతున్న టీసీఎస్

Written By:

టీసీఎస్ కు యుఎస్ కోర్టు భారీగానే షాకిచ్చింది. ఏకంగా 6000 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడంపై టీసీఎస్ ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. హెల్త్ కేర్ కు సంబంధించిన ఓ సాప్ట్ వేర్ విషయంలో ఈ భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.

Read more: ఇండియాలో ఇంటర్నెట్ ఎందుకు వాడుతున్నారంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టీసీఎస్‌కు యూఎస్ ఫెడరల్ కోర్టు ఏకంగా 940 మిలియన్ డాలర్ల ఫైన్

1

ప్రపంచంలోని అన్ని దిగ్గజ కంపెనీలకు సర్వీసెస్ ను అందించే టీసీఎస్‌కు యూఎస్ ఫెడరల్ కోర్టు ఏకంగా 940 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది.

హెల్త్ కేర్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను

2

హెల్త్ కేర్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అనుమతి లేకుండా తీసుకున్నందుకు అమెరికాలో టాటాకు చెందిన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌ను వెస్టర్న్ అమెరికాలోని విస్కన్సిన్ జిల్లాలో ఉన్న ఫెడరల్ కోర్టు ఎపిక్ సిస్టమ్స్?కు 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది.

వీరు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన 6,477 డాక్యుమెంట్లను

3

ఈ సాఫ్ట్‌వేర్ తయారీ ప్రక్రియను 2012లో ఇరు కంపెనీలు ప్రారంభించాయి. ఒరేగాన్ కైసర్ పర్మనెంట్‌లోని కన్సల్టెంట్లను క్లయింట్లుగా ఎరిక్ సిస్టమ్స్ నియమించుకుంది. వీరు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన 6,477 డాక్యుమెంట్లను ( వీటిలో 1,687 డాక్యుమెంట్లు ఎరిక్ సిస్టమ్స్‌కు చెందినవి) తీసుకున్నారు.

ఎరిక్ అనుమతి లేకుండా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నందుకు

4

ఈ కేసును రెండు వారాల పాటు విచారించిన ఫెడరల్ జడ్జి విలియం ఎమ్.కాన్లీ ఎరిక్ అనుమతి లేకుండా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నందుకు శిక్షగా 700 మిలియన్ డాలర్లు, నష్ట పరిహారంగా 240 మిలియన్ డాలర్లను టాటా ఇంటర్నేషనల్ ఎరిక్ కంపెనీకి చెల్లించాలని తీర్పునిచ్చారు.

తమ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని

5

తమ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని ప్రత్యర్ధి కంపెనీ మెడ్ మంత్ర అనే హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసుకున్నాయని ఎపిక్ ఆరోపిస్తోందని తెలిపారు. ఎపిక్‌కు చెందిన సమాచారాన్ని కైసర్ పర్మనెంటే కంపెనీ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు టీసీఎస్‌కు చెందిన ఉద్యోగి ఆ సమాచారాన్ని మరో ఇద్దరు ఉద్యోగులతో పంచుకున్నారని కోర్టుకు తెలిపింది.

కొన్నేళ్లుగా కష్టపడి తయారుచేసుకున్న సమాచారాన్ని

6

కొన్నేళ్లుగా కష్టపడి తయారుచేసుకున్న సమాచారాన్ని టాటా కంపెనీయే ఉద్యోగుల నుంచి తస్కరించిందని ఎరిక్ ఆరోపిస్తోంది. దీనివల్ల మార్కెట్లో ఎపిక్‌ను నష్టపోయేలా చేయడం టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుందని తన 39 పేజీల ఫిర్యాదులో పేర్కొంది.

తమ ముందున్న ప్రశ్నలన్నింటికి కంపెనీ త్వరలో సమాధానం

7

దీనిపై స్పందించిన ముంబై టీసీఎస్ అధికారి ఒకరు తమ ముందున్న ప్రశ్నలన్నింటికి కంపెనీ త్వరలో సమాధానం చెబుతుందని తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write TCS to appeal against US jury's $940 million notice
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting