ఐటీకీ ఇండియాలో ఇక గడ్డు పరిస్థితులే

By Hazarath
|

ఇప్పటికే సంక్షోభంతో అల్లాడిపోతున్న ఐటీ పరిశ్రమకు రానున్న కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇదే విషయంపై నిపుణులు ఐటీ రంగంపై సంక్షోభపు బాంబును పేల్చారు. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత ఐటీ రంగం గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెబుతున్నారు.

 

పంపిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా..?

గత జులై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే

గత జులై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే

గత జులై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో గత 8 సంవత్సరాలుగా లేని బలహీనమైన ట్రెండ్ ఉంటుందని నివేదించారు. ఆయా కంపెనీల ఆదాయం, నికర లాభం తదితరాలు గణనీయంగా తగ్గనున్నాయని రిపోర్ట్ చేశారు.

డాలర్ పరంగా ఐటీ సంస్థల ఆదాయం

డాలర్ పరంగా ఐటీ సంస్థల ఆదాయం

డాలర్ పరంగా ఐటీ సంస్థల ఆదాయం క్షీణించడం, ఈ పరిణామాలకు దారి తీయనుందని మోతీలాల్ ఓస్వాల్ ఒక నివేదికలో పేర్కొంది. గ్రోత్ అండ్ మార్జిన్ విషయంలో ఈ ఏడాది గడ్డుకాలమేనని సెంట్రమ్ వ్యాఖ్యానించింది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం
 

రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రెక్సిట్ వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మరికొంతమంది తెలిపారు. సంప్రదాయ ఐటీ వ్యాపారం ఆటోమేషన్ దిశగా సాగుతుండటం, కొత్త క్లయింట్ల చేరిక ఆశాజనకంగా లేకపోవడం ఇందుకు కారణాలని విశ్లేషించారు.

బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో

బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో

బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో మందగమనం, బ్రెగ్జిట్ పరిణామాలు తదితర అంశాలు భారతీయ ఐటి కంపెనీల పాలిట ఇబ్బందికర పరిణామాలని అభిప్రాయపడ్డారు. వృద్ధి మందగించడం ఒక కారణమైతే, కంపెనీలే ముందుకొచ్చి భయంతో గైడెన్స్ తగ్గించడం మరో ప్రమాదమని విశ్లేషిస్తున్నారు.

అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్, మైండ్ ట్రీ

అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్, మైండ్ ట్రీ

మరోవైపు దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్, మైండ్ ట్రీ తదితరాలు ఇప్పటికే తమ ఆదాయంపై అతిగా ఆశలు పెట్టుకోవద్దన్న సంకేతాలిచ్చాయి. ఇప్పటికే ఒకసారి గైడెన్స్‌ను తగ్గించిన ఇన్ఫోసిస్ ఈ క్వార్టర్లో మళ్లీ అంచనాను తగ్గించవచ్చని ఇండస్ట్రీ భావిస్తోంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సంవత్సరం 10 నుంచి 11.5 శాతం

ఈ సంవత్సరం 10 నుంచి 11.5 శాతం

అలాగే ఈ సంవత్సరం 10 నుంచి 11.5 శాతం మధ్య వృద్ధి ఉంటుందని ఇన్ఫీ ప్రకటించగా, అది 9 శాతాన్ని మించకపోవచ్చని ఐటీ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా టీసీఎస్, ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను వచ్చేవారం ప్రకటించనున్నాయి.

Best Mobiles in India

English summary
TCS, Infosys, Wipro et al brace for weakest quarter in 8 years on BFSI weakness read more at telugu gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X