అంత డబ్బును ఏం చేసుకుంటారో..?

Posted By:

పాత రోజుల్లో విలాసవంతమైన భవనాలంటే స్విమ్మింగ్ పూల్స్.. టెన్నిస్ కోర్ట్స్.. వ్యాయామ శాల.. క్రీడా మైదానం ఇలా అనేక రకాలైన సదుపాయాలను కలిగి ఉండేవి. నేటి ఆధునిక యుగంలో కనిపిస్తున్న సూపర్ - లగ్జరీ గృహాల్లో ప్రత్యేకమైన స్మార్ట్ ఫీచర్లను ఏర్సాటు చేస్తున్నారు. హోమ్ థియేటర్ సిస్టమ్స్, ప్లస్ లైట్స్, లాకబుల్ విండోస్, థెర్మోస్టాట్స్, విండో షేడ్స్ వంటి ప్రత్యేక సదుపాయాలను ఈ లగ్టరీ ఇళ్లలో కల్పిస్తున్నారు.

Read More: 20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!
తమ విహారయాత్రలకు టెక్ మిలియనీర్లు విలాసవంతమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటారు. బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్), ఎరిక్ స్కిమిడ్ట్ (గూగుల్), పాల్ ఆలెన్ (మైక్రోసాఫ్ట్), జెఫ్ బిజోస్ (ఆమోజాన్ డాట్ కామ్), లారీ ఎల్లీసన్ (ఒరాకిల్) వంటి గొప్పగొప్ప వ్యక్తులు కోట్లు వెచ్చించి తమ విహార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ ప్రముఖల విహార స్థావరాలు

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిలిగేట్స్ తన గారాల కూతురు కోసం ఇటీవల $8.7 మిలియన్ వెచ్చించి ఫ్టోరిడాలోని 4.8 ఎకరాల విస్తర్ణీం గల వెకేషన్ ప్యాడ్‌ను కొనుగోలు చేసారు.

టెక్నాలజీ ప్రముఖల విహార స్థావరాలు

గూగుల్ బాస్ ఎరిక్ స్కిమిడ్ట్ లండన్ నగరంలో కొత్త గృహం కోసం వెదుకుతున్నారు. ఎరిక్ 2007లో $20 మిలియన్ వెచ్చించి ఎల్లెన్ డేజనెర్స్ ' పాత ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

 

టెక్నాలజీ ప్రముఖల విహార స్థావరాలు

నాలుగు ఎకరాలు విస్తీర్ణం గల ఈ నివాసం అందమైన పెరటీ తోటలను కలిగి ఉంటుంది. ఇక్కడ విశాలవంతమైన మాస్టర్ సూట్ 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయటం జరిగింది.

 

టెక్నాలజీ ప్రముఖల విహార స్థావరాలు

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు పాల్ అలెన్‌కు అనేకమైన ఆస్తులు ఉన్నాయి. వాటిలో మాలిబులోని ఓ విహార యాత్రా స్థావరం ప్రత్యేకతను సంతరించుకుంది. దీని విలువ $25 మిలియన్.

 

టెక్నాలజీ ప్రముఖల విహార స్థావరాలు

ఈ వెకేషన్ ప్యాడ్ 5 బెడ్ రూమ్‌లతో పాటు స్విమ్మింగ్ పూల్ ఇంకా స్ర్కీనింగ్ రూమ్ ఇంకా వ్యాయామ శాలలను కలిగి ఉంటుంది.

టెక్నాలజీ ప్రముఖల విహార స్థావరాలు

ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక బాత్ రూమ్ అత్యాధునిక వసతులను కలిగి ఉంటుంది.

టెక్నాలజీ ప్రముఖల విహార స్థావరాలు

ఆమెజాన్ డాట్ కామ్ వ్యవస్థాపకులు జెఫ్ బిజోస్‌కు బెవర్లీ హిల్స్‌లో $25 మిలియన్ విలువ చేసే నివాసముంది. ఈ ఇంటికి పొరుగున ఉన్న నివాసం ప్రముఖ హాలీవుడ్ హీరో టామ్ క్రూజీది కావటం విశేషం.

 

టెక్నాలజీ ప్రముఖల విహార స్థావరాలు

ఈ పచ్చని వసతి గృహం టెన్నిస్ కోర్టు ఇంకా విశాలమైనన అవుట్ డోర్ ప్రాంగణాన్ని కలిగి ఉంటుంది. మొత్తం విస్తీర్ణం 2 ఎకరాల 11,000 చదరపు అడుగులు పైనే.

 

టెక్నాలజీ ప్రముఖల విహార స్థావరాలు

ఒరాకిల్ సంస్థల సహ వ్యవస్థాపకులైన లారీ ఎల్లీసన్ అనేకమైన ఆస్తులను కలిగి ఉన్నారు. వాటిలో ఒకటైన పోర్కుపైన్ క్రీక్ విలువ అక్షరాలా $43 మిలియన్.

 

టెక్నాలజీ ప్రముఖల విహార స్థావరాలు

ఈ ప్రాంగణంలో ప్రధాన నివాసం విస్తీర్ణం 18,430 చదరపు అడుగులు. 4 అతిథి గృహాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఒక్కో అతిథి గృహం విస్తీర్ణం 1860 చదరపు అడుగులు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tech's Richest People Vacations. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot