ఖంగుతిన్న జియో:15 కోట్ల కాల్స్‌లో 12 కోట్ల కాల్స్ ఫెయిల్

By Hazarath
|

దేశీయ టెలికం రంగంలో రోజు రోజుకు వార్ వేడెక్కుతోంది. దిగ్గజ టెల్కోలకు అలాగే రిలయన్స్ జియోకు మధ్య కాల్స్ విషయంలో వ్యవహారం సద్దుమణగకపోగా మరింతంగా రాజుకుంటోంది. ప్రధానంగా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాకు.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రతరమైంది.ఈ ముగ్గురు ఆపరేటర్లు తగినంత ఇంటర్ కనెక్టివిటీ కల్పించకపోవడంతో తమ వినియోగదారులు ఎన్ని ఇబ్బందులెదుర్కొంటున్నారని తెలుపుతూ జియో కాల్‌డ్రాప్స్ చిట్టాను విడుదల చేసింది. ఏ నెట్ వర్క్ నుంచి ఎన్ని కాల్స్ డ్రాప్ అయ్యాయో మీరే చూడండి.

 

రహస్య మెసేజ్‌లు పంపుకునే ఏకైక యాప్

జియో మొదటి నుంచి ఆరోపణలు

జియో మొదటి నుంచి ఆరోపణలు

రిలయన్స్ జియో కాల్ డ్రాప్స్ డేటాను తన వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. తన నెట్‌వర్క్ నుంచి వెళ్లే కాల్స్‌కు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తగినన్ని ఇంటర్‌కనెక్షన్ పాయింట్లను ఇవ్వడం లేదంటూ జియో మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం విదితమే.

మొత్తం 12 కోట్ల కాల్స్

మొత్తం 12 కోట్ల కాల్స్

ఈనెల 22న జియో కస్టమర్లు మొత్తం 15 కోట్ల కాల్స్ చేయగా.. అందులో 12 కోట్ల కాల్స్ విఫలమైనట్లు సంస్థ వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం ద్వారా వెల్లడవుతున్నది.

 ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

గత గురువారం నాడు జియో వినియోగదారులు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు 6.13 కోట్ల కాల్స్ చేయగా అందులో 4.8 కోట్ల (78.4 శాతం) కాల్స్ డ్రాప్ అయ్యాయి.

వొడాఫోన్
 

వొడాఫోన్

వొడాఫోన్ నెట్‌వర్క్‌కు 4.69 కోట్ల కాల్స్ చేయగా 3.95 కోట్ల (84.1 శాతం) కాల్స్ విఫలమయ్యాయి.

ఐడియా

ఐడియా

ఐడియా నెట్‌వర్క్‌కు 4.39 కోట్ల కాల్స్ చేయగా 3.36 కోట్ల కాల్స్ ఫెయిల్ అయ్యాయి.

24 గంటల్లో ఎన్ని కాల్స్ డిస్‌కనెక్ట్

24 గంటల్లో ఎన్ని కాల్స్ డిస్‌కనెక్ట్

ఒక్కో ఆపరేటర్ కారణంగా 24 గంటల్లో ఎన్ని కాల్స్ డిస్‌కనెక్ట్ అయ్యాయో తెలిపే డాటాను తన వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.

రూ.9,900 కోట్ల జరిమానా

రూ.9,900 కోట్ల జరిమానా

ఇదిలా ఉంటే జియోకు ఇంటర్‌కనెక్టివిటీ కల్పించకుండా లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాపై రూ.9,900 కోట్ల జరిమానా విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీసీ పటేల్.. టెలికం మంత్రి మనోజ్ సిన్హాకు లేఖ రాశారు.

ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు కాల్స్ వివరాలను

ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు కాల్స్ వివరాలను

ట్రాయ్ కూడా ఈ విషయంపై స్పందించింది. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు కాల్స్ వివరాలను ట్రాయ్ తెప్పించుకుని పరిశీలించింది. తమ పరిశీలనలో నిబంధనల ఉల్లంఘన తేలడంతో ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు ట్రాయ్ చైర్మన్ శర్మ తెలిపారు.

మిగతా టెల్కోలు ఎలా రియాక్షన్ అవుతాయనేది

మిగతా టెల్కోలు ఎలా రియాక్షన్ అవుతాయనేది

మరి ముందు ముందు ట్రాయ్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ట్రాయ్ నిర్ణయంపై మిగతా టెల్కోలు ఎలా రియాక్షన్ అవుతాయనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

 

 

జియో ఎలా, ఎక్కడ పుట్టింది

జియో ఎలా, ఎక్కడ పుట్టింది

 క్లిక్ చేయండి  క్లిక్ చేయండి 

 

 

 ఉచితం వెనుక ఉన్న ప్రయోజనాలు

ఉచితం వెనుక ఉన్న ప్రయోజనాలు

 క్లిక్ చేయండి క్లిక్ చేయండి

ముకేష్ అంబాని టార్గెట్

ముకేష్ అంబాని టార్గెట్

 ముకేష్ అంబాని టార్గెట్ ముకేష్ అంబాని టార్గెట్

 

 

Best Mobiles in India

English summary
Telco war: Reliance Jio makes live operator-wise call drop data read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X