టెల్కోలకు భారీ షాక్ : రీజన్ తెలిస్తే ఇంకా షాక్

Written By:

నిబంధనల ఉల్లంఘనలతో టెల్కోలకు భారీషాక్ తగిలింది. టెల్కోలు ప్రజారోగ్యంతో ఆటలాడు కుంటున్నాయంటూ ప్రభుత్వం మండి పడింది. టవర్ల నుంచి వెలువడే రేడియేషన్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ఇది ఇలాగే సాగితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా టెల్కోలపై దాదాపు రూ. 11 కోట్ల జరిమాన విధించింది.

చైనా ఉత్పత్తుల బహిష్కరణ ఎండమావే ! షాకింగ్ కారణాలు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.10.8 కోట్ల జరిమానా

టెలికాం ఆపరేటర్లు మొబైల్ టవర్ల రేడియేషన్ నిబంధనలు ఉల్లఘించినందుకుగాను ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. రూ.10.8 కోట్ల జరిమానా విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రేడియేషన్ ప్రభావం వల్ల

ఈ జరిమానా నేపథ్యంలో రేడియేషన్ ప్రభావం వల్ల ప్రజారోగ్యంపై ఏర్పడే ప్రభావిత అంశాలను ప్రభుత్వం పరిశీలించింది. 2016 జూలై 31 వరకు టెలికాం డిపార్ట్‌మెంట్ మొత్తం 3.19 లక్షల బేస్ స్టేషన్లలో పరీక్షలు నిర్వహించగా కొన్ని బేస్ స్టేషన్లలో టెలికాం కంపెనీలు మొబైల్ టవర్ల రేడియేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తేలింది.

కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్‌లో

దీంతో టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ప్రభుత్వం 10.8 కోట్ల రూపాయల జరిమానా విధించింది. పార్లమెంట్‌లో మంగళవారం నిర్వహించిన కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్‌లో టెలికాం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

భారత్ మొబైల్ టవర్ల నుంచి వస్తున్న రేడియేషన్ ఉద్గారాలు

దేశంలో ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్ మొబైల్ టవర్ల నుంచి వస్తున్న రేడియేషన్ ఉద్గారాలు, ప్రపంచ నిబంధనల కంటే ఎనిమిది రెట్లు అధికంగా ఉన్నాయని తేలినట్టు ఎంపీ రవీంద్ర కుమార్ జెనా ఆరోపించారు.

పదేళ్లలో బ్రెయిన్ ట్యూమర్

మొబైల్‌ను అరగంట కంటే ఎక్కువ సేపు వాడితే పదేళ్లలో బ్రెయిన్ ట్యూమర్ బారినపడే అవకాశముందని యూరోపియన్ అధ్యయనాన్ని,ఇదేమాదిరి స్వీడన్ రిపోర్టును ఆయన ప్రస్తావించారు.

కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నట్టు తెలిస్తే

అయితే ఎంపీ రవీంద్ర కుమార్ జెనా ఆందోళనలపై తాము విచారణ చేస్తామని టెలికాం మంత్రి హామి ఇచ్చారు. ఎవరైనా ప్రైవేట్ టెలికాం ప్లేయర్లు రేడియేషన్లో కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నట్టు తెలిస్తే, వారిపై కఠిన తప్పవని టెలికాం మంత్రి హెచ్చరించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Telecom Operators Fined Rs. 10.8 Crores for Violating Mobile Radiation Norms Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot