టెలికాంలో 41 లక్షల ఉద్యోగాలు: ఆసియాలో కుబేరులెవరంటే..

Written By:

ఏటా 15 శాతం వృద్ధి చెందుతోన్న భారత టెలికం రంగానికి 2022 నాటికి 41 లక్షల మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమౌతారని కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రజలకు శిక్షణనిచ్చే నిమిత్తం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్), స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (ఎంఎస్‌డీఈ) మంత్రిత్వశాఖ మధ్య ఒక పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.

టెలికాంలో 41 లక్షల ఉద్యోగాలు: ఆసియాలో కుబేరులెవరంటే..

ఈ ఒప్పందంలో భాగంగా డాట్, ఎంఎస్‌డీఈలు స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన జాతీయ ఆక్షన్ ప్లాన్ అభివృద్ధి చేయడంతోపాటు దాన్ని టెలికం రంగంలో అమలు చేయనున్నారు. టెలికం రంగంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది శిక్షణ కోసం ఎంఎస్‌డీఈ, డాట్‌లు సంయుక్తంగా ఆర్థిక చేయూత అందించనున్నాయి. ఈ సందర్భంగా ఆసియాలో ఉన్న కుబేరులపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : పట్టా ఉన్నా టెక్ ఉద్యోగాలకు పనికిరారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కుబేరులు అత్యధికంగా నివసించే నగరాల జాబితాలో

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో కుబేరులు అత్యధికంగా నివసించే నగరాల జాబితాలో ఢిల్లీ, ముంబై టాప్‌ నగరాల సరసన చోటు దక్కించుకున్నాయి. ఇక భారత్‌లో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా తర్వాత ధనికులు అధికంగా ఉన్న నగరంగా హైదరాబాద్‌ నిలిచింది.

ముంబైలో 41,200 మిలియనీర్లు నివాసముంటుండగా

ఆర్థిక రాజధాని ముంబైలో 41,200 మిలియనీర్లు నివాసముంటుండగా, దేశ రాజధాని ఢిల్లీలో 20,600 మంది నివసిస్తున్నారని న్యూవరల్డ్‌ వెల్త్‌ నివేదిక వెల్లడించింది. 

టోక్యో ఎపిఆర్‌లో అత్యధిక కుబేరులున్న నగరంగా

న్యూ వరల్డ్ వెల్త్'కు సంబంధించిన ‘ఆసియా పసిఫిక్ 2016 వెల్త్' నివేదికలో టోక్యో ఎపిఆర్‌లో అత్యధిక కుబేరులున్న నగరంగా నిలిచింది. ఈ నగరంలో 2.64 లక్షల మంది లక్ష్మీ పుత్రులు ఉన్నారు. ముంబై 12వ స్థానంలో, ఢిల్లీ 20వ స్థానంలో నిలిచాయి.

ఒక మిలియన్ డాలర్లకు సమానంగా

ఒక మిలియన్ డాలర్లకు సమానంగా లేదా అధికంగా సంపదను కలిగిన వారిని ధనవంతులుగా (మిలియనీర్లు) పరిగణనలోకి తీసుకుంటారు.

మల్టీ మిలియనీర్ల జాబితాలో 9,650 మందితో హాంకాంగ్

కాగా పది మిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన మల్టీ మిలియనీర్ల జాబితాలో 9,650 మందితో హాంకాంగ్ అగ్రస్థానంలో ఉంది.

అగ్రస్థానంలో కోల్‌కతా (8,700 మంది)

అగ్రస్థానంలో కోల్‌కతా (8,700 మంది) నిలిచింది. ఇక వీటి తర్వాతి స్థానాల్లో బెంగళూరు (6,700 మంది), చెన్నై (6,000 మంది) ఉన్నాయి. 357 శాతం వృద్ధితో ముంబై, 335 శాతం పెరుగుదలతో ఢిల్లీ నాలుగు, ఐదు స్థానాలను దక్కిం చుకున్నాయి.

2025నాటికి ముంబై, కలకత్తా నగరాల్లో

2025నాటికి ముంబై, కలకత్తా నగరాల్లో కుబేరుల సంఖ్య మరింత పెరిగి టాప్‌ 3 నగరాలకు చేరతాయని పేర్కొంది.

భారత్‌లో మల్టీ మిలియనీర్లు

భారత్‌లో మల్టీ మిలియనీర్లు కోల్‌కతాలో 560 మంది, హైదరాబాద్‌లో 510 మంది, బెంగళూరులో 430 మంది ఉన్నారు.

మిలియనీర్ల విషయానికొస్తే

కోల్‌కతాలో 8,700 మంది, హైదరాబాద్‌లో 7,800 మంది, బెంగళూర్‌లో 6,700 మంది, చెన్నైలో 6,000 మంది, పుణెలో 3,800 మం ది, అహ్మదాబాద్‌లో 3,700 మంది మిలియనీర్లున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Telecom sector will need over 4 million workforce by 2022: Ravi Shankar Prasad
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot