టెలిగ్రామ్ పెయిడ్ ప్రీమియం వెర్షన్! కొత్త సర్వీసులు & ఫీచర్లు ఇవే...

|

ప్రముఖ సోషల్ మీడియా యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ తన యొక్క ప్లాట్‌ఫారమ్‌లో కొత్తగా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను అందిస్తున్నట్లు కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ప్రకటించారు. ఈ కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఇంకా అధికారికంగా ప్రారంభించబడలేదు. అయితే ఇది ఈ నెలలోనే అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వ్యవస్థాపకులు ధృవీకరించారు. తన టెలిగ్రామ్ ఛానెల్‌లో పావెల్ దురోవ్ ఈ కొత్త చర్య వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. కొత్తగా ప్రారంభించే ప్రీమియం మెంబర్‌షిప్ తో ఎటువంటి ఫీచర్‌లను ఆశించవచ్చో వివరించాడు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టెలిగ్రామ్

టెలిగ్రామ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ యొక్క "ప్రస్తుత పరిమితులను పెంచమని" చాలా మంది వినియోగదారులు తనను అడుగుతున్నారని దురోవ్ పేర్కొన్నారు. ఇందుకోసం కంపెనీ వివిధ మార్గాల్లో ప్రయత్నించారని వ్యవస్థాపకుడు పేర్కొన్నాడు. అయితే సమస్య ఏమిటంటే ప్రతి ఒక్కరికీ పరిమితులను తీసివేయడానికి ప్రస్తుతం అందుబాటులో గల సర్వర్లు వాటి యొక్క ట్రాఫిక్ కు తగ్గట్టుగా పని చేయలేకపోతున్నాయి. అదనంగా ఖర్చులు కూడా నిర్వహించలేనివిగా మారాయి. కాబట్టి ప్రతి ఒక్కరికీ పరిమితులను తొలగించడం అనేది కొద్దిగా సమస్యగా మారింది కావున ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను అందుబాటులోకి తీసుకొనివస్తున్నట్లు దురోవ్ తెలిపాడు.

టెలిగ్రామ్ పైడ్ సబ్స్క్రిప్షన్ ఎందుకు?

టెలిగ్రామ్ పైడ్ సబ్స్క్రిప్షన్ ఎందుకు?

టెలిగ్రామ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ లో ప్రస్తుతం ఉన్న సమస్యలను అధిగమించడానికి వారు "నో లిమిట్స్" అనుభవాన్ని అందించడానికి పైడ్ సబ్స్క్రిప్షన్ ను పొందవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. "కొంత ఆలోచన చేసిన తర్వాత మా ప్రస్తుత ఫీచర్‌లను ఉచితంగా ఉంచుతూనే అధిక మొత్తంలో డిమాండ్ ఉన్న అభిమానులకు మెరుగైన ఫీచర్లను అనుమతించే ఏకైక మార్గం పెంచిన పరిమితులను పైడ్ ఎంపికగా మార్చడం అని మేము గ్రహించాము అని అతను ఒక ప్రకటనలో తెలిపారు. అందుకే ఈ నెలలో మేము టెలిగ్రామ్ ప్రీమియంను పరిచయం చేస్తున్నాము. అదనపు ఫీచర్లు, స్పీడ్ మరియు వనరులను పొందేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అనుమతిస్తుంది. ఇది టెలిగ్రామ్‌కు మద్దతు ఇవ్వడానికి మరియు ముందుగా కొత్త ఫీచర్‌లను స్వీకరించే క్లబ్‌లో చేరడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

టెలిగ్రామ్ ప్రీమియం ఫీచర్లు
 

టెలిగ్రామ్ ప్రీమియం ఫీచర్లు

పైడ్ సబ్స్క్రిప్షన్ పొందే వినియోగదారులకు అన్ని రకాల ఉచిత సేవలకు ఎటువంటి ఆటంకం కలిగించదని దురోవ్ హామీ ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కరికి ప్రస్తుత ఫీచర్‌లు ఉచితంగా అందించబడతాయి. కనీసం పరోక్షంగానైనా కొత్త పైడ్ సబ్స్క్రిప్షన్ నుండి ఉచిత సభ్యులు కూడా ప్రయోజనం పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఉచిత సబ్‌స్క్రిప్షన్ సభ్యులు ప్రీమియం వినియోగదారులు పంపిన అదనపు-పెద్ద డాక్యుమెంట్‌లు, మీడియా మరియు స్టిక్కర్‌లను యాక్సెస్ చేయగలరు. అంతేకాకుండా వాటికి ప్రతిస్పందించడానికి మెసేజ్‌కి ఇప్పటికే పిన్ చేసిన ప్రీమియం ప్రతిచర్యలను జోడించడానికి అనుమతిస్తుంది. కంపెనీ పబ్లిక్ ఛానెల్‌లలో ప్రకటనలను పరీక్షిస్తున్నప్పుడు మరియు అవి ఊహించిన దాని కంటే ఎక్కువ విజయవంతమయ్యాయని దురోవ్ తెలిపారు. ఈ యాప్‌కు వినియోగదారులు నిధులు సమకూర్చాలని మరియు ప్రకటనదారులు కాదని కంపెనీ విశ్వసిస్తోంది.

Best Mobiles in India

English summary
Telegram Announced Paid Premium Subscription With New Features and Service

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X