Telegram హిట్ - వాట్సాప్ ఫట్!! 2రోజులలో 25 మిలియన్ల డౌన్‌లోడ్‌లు..

|

సోషల్ మీడియా యాప్ లలో ప్రపంచవ్యాప్తంగా అధిక మంది యూజర్లను కలిగిన వాట్సాప్ కు ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విధానం అమలులోకి వచ్చిన తరువాత కేవలం గత 72 గంటల్లో సుమారు 25 మిలియన్ల మంది కొత్త యూజర్లు తమ ప్లాట్‌ఫామ్‌లో చేరినట్లు టెలిగ్రామ్ సంస్థ ప్రకటించింది.

టెలిగ్రామ్

జనవరి మొదటి వారం సమయానికి టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారుల మార్కును అధిగమించిందని సంస్థ ప్రకటించింది. కేవలం 72 గంటల్లోనే 25 మిలియన్ల మంది కొత్త వినియోగదారులు ఈ ప్లాట్‌ఫామ్‌లో చేరడం అనేది సరికొత్త రికార్డు. ఇది ఇంకా పెరుగుతూనే ఉంది. కొత్తగా జోడించిన 25 మిలియన్ల వినియోగదారులలో 38% మంది ఆసియాకు చెందినవారు అయితే యూరప్ కు చెందిన వారు 27% మంది ఉన్నారని టెలిగ్రామ్ ప్రకటించింది. అలాగే లాటిన్ అమెరికా నుండి 21% మరియు MENA ప్రాంతం నుండి 8% మంది కొత్త వినియోగదారులు టెలిగ్రామ్ లోకి చేరినట్లు ప్రకటించింది. టెలిగ్రామ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో కొత్త చందాదారులను చేర్చుకుంటున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్

టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్

టెలిగ్రామ్ యొక్క ప్లాట్‌ఫామ్‌లోకి కొత్తగా చేరిన వినియోగదారులను సంస్థ సీఈఓ మరియు వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ప్రశంసించారు. 2020 లో టెలిగ్రామ్ ప్రతిరోజూ 1.5 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను చేర్చుకుందని ఆయన పేర్కొన్నారు. అయితే గత మూడు రోజులలో డౌన్‌లోడ్‌ల పెరుగుదల మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంది. వినియోగదారుల యొక్క గోప్యతను పరిరక్షించడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే టెలిగ్రామ్ సంస్థ యొక్క 7 సంవత్సరాల చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు జరగని డౌన్‌లోడ్‌లు ఇప్పుడు అందుకోవడం ఆశ్చర్యంగా ఉంది అని దురోవ్ ఇటీవల తన యొక్క బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

వాట్సాప్

2021 కొత్త సంవత్సరంలో ప్రజలు ఉచిత సేవలను వారి గోప్యతను మార్పిడి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. టెక్ ఆధిపత్యాల ద్వారా ప్రజలు బందీలుగా ఉండటానికి ఇష్టపడనందున యాప్ ల వినియోగదారుల సంఖ్యను కలిగి ఉన్నంతవరకు వారు దేనితోనైనా తప్పించుకోగలరని భావిస్తున్నారని ఆయన అన్నారు. వాట్సాప్ యొక్క సేవలను మరింత మెరుగుపరచడానికి ఫేస్‌బుక్‌తో డేటాను పంచుకుంటామని ఇటీవల తెలిపింది. వాట్సాప్ తన మాతృ సంస్థతో ప్రైవేట్ మెసేజ్ లు మరియు కాల్ సంబంధిత డేటాను పంచుకోవడం లేదు అని ఒక వివరణాత్మక FAQ పోస్ట్‌లో క్లియర్ చేసింది.

టెలిగ్రామ్ డౌన్‌లోడ్‌లు

టెలిగ్రామ్ డౌన్‌లోడ్‌లు

ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రామ్ ఇప్పుడు 0.5 బిలియన్ వినియోగదారుల మార్కును దాటింది. గతంతో పోలిస్తే సంస్థ యొక్క వృద్ధి భారీగా పెరిగింది. గోప్యత మరియు భద్రతకు కట్టుబడి ఉన్న కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ కోరుకునేవారికి టెలిగ్రామ్ ఇప్పుడు ఉపయోగకరంగా ఉంది. టెలిగ్రామ్ కూడా వినియోగదారుల నమ్మకాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుందని మరియు భవిష్యత్తులో వినియోగదారులను తగ్గించకూడదు అని గట్టి నమ్మకంతో ఉంది.

టెలిగ్రామ్ VS సిగ్నల్ VS వాట్సాప్

టెలిగ్రామ్ VS సిగ్నల్ VS వాట్సాప్

ప్రపంచవ్యాప్తంగా గత మూడు రోజులలో గూగుల్ ప్లే స్టోర్‌లో టెలిగ్రామ్ 500 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేయబడింది. సోషల్ మీడియా కేటగిరీలో ఆపిల్ యాప్ స్టోర్‌లో మొత్తం డౌన్‌లోడ్‌లలో టెలిగ్రామ్ రెండవ స్థానంలో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ సిగ్నల్ అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన అప్లికేషన్‌గా అవతరించింది. టెలిగ్రామ్ దాని తరువాతి స్థానంలో ఉంది.

Best Mobiles in India

English summary
Telegram Global Downloades Cross 25 Million in Past 72 Hours on Google Play and Apple Store

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X