40 ఏళ్ల కోరిక... ఫేస్‌బుక్ ఒక్క రోజులో తీర్చింది

|

నాలుగు దశాబ్దాల తరువాత ఆమె స్వప్నం సాకారమైంది. ఓ నర్సు ఒడిలో తాను హాయిగా ఒదిగిపోయిన చిన్ననాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను చూసి..మైమరచిపోయేది. కాలిన గాయాలతో బాధపడుతున్నప్పుడు అక్కున్న చేర్చుకున్న ఆ మహిళను చూడాలన్నదే ఆమె తపన..ఆమండా స్కార్పినాటి ఇరవై ఏళ్ల పాటు ఎలాంటి ఆధారం లేకుండా తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది. తాను ఎలాగైనా ఆ నర్సును కలవాలన్నదే ఆమె ఆశ.అమండాకు ఇప్పుడు 38 ఏళ్లు. ఫేస్‌బుక్ లక్ష్య సాధనకు సహకరించింది.ఇరవై ఏళ్ళ స్వప్పాన్ని ఒక్క రోజులో సాకారం చేసింది.మరి ఆమె ఎలా కలిసింది..కలిసిన తరువాత ఆ క్షణాలు ఎలా ఉన్నాయి. 40 ఏళ్ల నిరీక్షణ తరువాత వారి ఫీలింగ్స్..ఆ మెమొరీస్ ఎలా కెమెరాల్లో బంధించారు.. స్లైడర్ లో చదవండి .

 

Read more : ఫేస్‌బుక్‌లో ‘Auto-Play Videos'ను ఆఫ్ చేయటం ఏలా?

ఇరవై ఏళ్లుగా తన శోధన సాగిస్తూనే ఉంది

ఇరవై ఏళ్లుగా తన శోధన సాగిస్తూనే ఉంది

న్యూయార్క్ లోని అథెన్స్ లో హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ గా పనిచేస్తున్న అమండా స్కార్పినాటి ఇరవై ఏళ్లుగా తన శోధన సాగిస్తూనే ఉంది. కేవలం మూడు నెలల పసిపాపగా ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లు పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలకు మందు రాసి తలకు చేతికి తెల్లని గుడ్డతో కట్లు కట్టారు. పలు సర్జరీలు కూడా చేశారు. చివరక ఎలాగోలా గాయాలు తగ్గాయి. ఎట్టకేలకు తాను బతికి బయటపడింది. అయితే తనను అంతలా లాలిత్యంతో సాకిన నర్సు ఎవరు..?ఆమెను జీవితంలో ఎలాగైనా కలవాలి అన్నదే అమాండా ఆశ

1997 సంవత్సరంలో అమండాకు ఓ చిన్నపాటి క్లూ

1997 సంవత్సరంలో అమండాకు ఓ చిన్నపాటి క్లూ

1997 సంవత్సరంలో అమండాకు ఓ చిన్నపాటి క్లూ దొరికింది. అల్బానీ మెడికల్ సెంటర్ ప్రచురించిన వార్షిక నివేదికలో కార్ల్ హోవార్డ్ తీసిన చిత్రాల్లో ఆ నర్సు ఫోటో కనిపించడంతో అమండా ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆ శీర్షికలో నర్స్ పేరు మాత్రం ప్రసా్తవించలేదు. దాంతో అమండాకు దొరికిన చిన్న ఆశ నీరుగారిపోయింది. అయినా ఆమె పట్టు వీడలేదు.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను ఫేస్‌బుక్ లో పోస్ట్
 

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను ఫేస్‌బుక్ లో పోస్ట్

ఈ నెల మొదట్లో అమండా తన చిన్ననాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసింది. ఆల్బనీ మెడికల్ సెంటర్ లోని వార్షిక నివేదికలోని ఫోటోలను కూడా వరుసగా పోస్ట్ చేసింది. పై ఫోటోలోని నర్స్ పేరును గుర్తు పట్టేందుకు ట్రై చేయమని రిక్వస్ట్ కూడా పెట్టింది. తన ప్రయత్నంపై ఓ పక్క అనుమానం కలుగుతూనే ఉంది.ఆమె పోస్ట్ చేసిన పన్నెండు గంటల్లోపే ఆ ఫోటోలు ఐదు వేల సార్లు షేర్ అయ్యాయి. అంతేకాదు ఒక్క రోజులోనే ఆమెకు ఫలితం లభించింది. మెడికల్ సెంటర్ లో ఫెలోగా ఉన్న యాంజెలా ల్యూరీ ఫోటోలోని బెర్గర్ ను గుర్తు పట్టింది. అమండాకు ఆమె సుశాన్ బెర్గర్ అని చెప్తూ మెసేజ్ చేసింది.

ఆమె ఎవరో నాకు తెలియదు

ఆమె ఎవరో నాకు తెలియదు

ఆమె ఎవరో నాకు తెలియదు నేను తీవ్రమైన గాయాలదో ఉన్నప్పుడు నన్ను అక్కున చేర్చుకుని చికిత్స అందించింది. ఆమె ఒడిలో నేను సేద తీరానని నా ఫోటోలు చూస్తే నాకు తెలుస్తోంది. అంతేకాదు ఆమె నాపై ఎంతో శ్రధ్ధ చూపించినట్లు కూడా తెలుస్తోంది. నేనిప్పుడు ఆమెను కలుస్తున్నాను.ఈరోజు వస్తుందని నేను అనుకోలేదు. అంటూ ఎంతో ఆనందంలో తేలిపోయింది అమండా స్కార్పినాటి

అమండాను కలిసే ముందు బెర్గర్ కూడా ..

అమండాను కలిసే ముందు బెర్గర్ కూడా ..

అమండాను కలిసే ముందు బెర్గర్ కూడా అప్పటి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంది.సాధారణంగా పిల్లలు సర్జరీ తరువాత నిద్రపోతుంటారు. లేదా ఏడుస్తారు.కాని అప్పట్లో ఈ పాపా చాలా ప్రశాంతంగా ఉండేది. అంటూ జరిగిన విషయాన్ని నెమరువేసుకుంది. మనను జీవితంతా గుర్తుకు తెచ్చుకునే అదృష్టం ఎంతమందికి కలుగుతుందో నాకు తెలయిదు కాని నిజంగా నేను అటువంటి అదృష్టాన్ని పొందడం చాలా సంతోషంగా ఉందం అంటూ తన మనసులోని ఆనందాన్ని పంచుకుంది.

ఇది జీవిత కాల స్నేహమే

ఇది జీవిత కాల స్నేహమే

ఓ లోకల్ టీవి రిపోర్టర్ బెర్గర్ ను కలిసే ముందు అమండాతో ఫోన్ లో మాట్లాడించాడు. పన్నెండేళ్ల అమండా కుమారుడు కూడా ఇది ఎంతో ఆనందకరమైన సందర్శనమని బెర్గర్ మాటలు వింటే ఆమె ఎంతటి సౌమ్యురాలో అర్థమైందని అన్నారు. వారిద్దరి మీటింగ్ ప్రారంభమైన తర్వాత అమండా తన ఫీలింగ్ ను అందరితో పంచుకుంది. నిజంగా తీను బెర్గర్ ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని తమ స్నేహం ఇప్పుడు మొదలయ్యేది కాదని పరిచయం లేకపోయినా ఇది జీవిత కాల స్నేహమేనని తెలిపింది.

నలబై ఏళ్ల తరువాత వారి కలయిక

నలబై ఏళ్ల తరువాత వారి కలయిక

సుమారు నలబై ఏళ్ల తరువాత వారి కలయిక ఇప్పుడు మెడికల్ సెంటర్ కాన్పరెన్స్ రూమ్ లో అందర్నీ ఆకట్టుకుంది. ఆ ఉద్వేగ క్షణాల్ని ఎన్నో కెమెరాలు క్లిక్ మనపించాయి.

వారిద్దరి కలసినప్పుడు జరిగిన ఉద్వేగ క్షణాలు

వారిద్దరి కలసినప్పుడు జరిగిన ఉద్వేగ క్షణాలు 

గాయాలతో చిన్నప్పుడు అమాండా

గాయాలతో చిన్నప్పుడు అమాండా

గాయాలతో చిన్నప్పుడు అమాండా 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

Best Mobiles in India

English summary
Here write Thanks to a viral Facebook appeal, the pair finally met again today

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X