ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌ టీసీఎస్

Written By:

ఐటీ రంగంలో ఇప్పుడు మకుటం లేని మారాజుగా టీసీఎస్ నిలిచింది. అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్ వేల్యూయేషన్ కంపెనీ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన 2016 వార్షిక జాబితాలో టీసీఎస్ కు ప్రధమస్థానం దక్కిందని కంపెనీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది బ్రాండ్లను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ తయారు చేసింది.

Read more : సముద్రం లోపల మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు

ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌ టీసీఎస్

వీటితో పాటు నిబద్ధత, ఉద్యోగుల సంతృప్తి, కార్పొరేట్ పేరు, ప్రఖ్యాతులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన ఈ జాబితాలో 78.3 పాయింట్ల స్కోర్ తో, ఏఏప్లస్ రేటింగ్ తో అగ్రస్థానంలో నిలిచామని టీసీఎస్ పేర్కొంది. అన్నిరంగాల పరంగా చూస్తే అత్యంత శక్తివంతమైన బ్రాండ్ గా డిస్ని, అత్యంత విలువైన బ్రాండ్ గా ఆపిల్ నిలిచాయని తెలిపారు.

Read more : ఇంటిదారి పట్టనున్న 17 వందల మంది యాహూ ఉద్యోగులు !

ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌ టీసీఎస్

గత ఆరేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్ గా కూడా టీసీఎస్ నిలిచింది. 2010 లో 234 కోట్ల డాలర్లుగా ఉన్న టీసీఎస్ బ్రాండ్ విలువ ఈ ఏడాది 940 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక తమ కంపెనీలోని 3,44,000 మంది ఉద్యోగుల కృషి ఫలితంగానే అగ్రస్థాయి ఐటీ కంపెనీగా ఎదిగామని టీసీఎస్ సీఈఓ, ఎండీ, ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు.ఈ సంధర్భంగా టాప్ టెన్ లో ఉన్న వాల్యుబుల్ టెక్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్

కష్టమర్ల అభిమానాన్ని ఎప్పుడూ చూరగొటూనే ఉంటుంది. ఆపిల్ నుంచి ఏ బ్రాండ్ వచ్చినా కష్టమర్లు ఎగబడీ మరీ కొంటారు

శ్యాంసంగ్

మొబైల్ సామ్రాజ్యంలో మకుటం లేని మహరాజు. ఇప్పటికీ అమ్మకాల్లో శ్యాంసంగ్ సింహభాగం. అగ్రస్థానాన్ని వరుసగా నిలబెట్టుకుంటూ వస్తోంది.

గూగుల్

సెర్చ్ ఇంజినకే రారాజు. దీన్ని ఢీ కొట్టే మొనగాడు ఇంకా రానే లేడు

మైక్రోసాఫ్ట్

ఐఓఎస్ రారాజు. విండోస్ సామ్రాజ్యాధినేత. విండోస్ 10తో సరికొత్త సంచలనానికి తెరలేపిన దిగ్గజ కంపెనీ

అమెజాన్

ఆన్‌లైన్ అమ్మకాల్లో అగ్రగామి. పడుతూ లేస్తూ ముందుకు దూసుకెళుతోంది.

ఐబీఎమ్

సాప్ట్‌వేర్ దిగ్గజం.ఎప్పుడూ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ లలో చోటు దక్కించుకునే ఏకైక కంపెనీ

ఇంటెల్ చిప్

టెక్నాలజీ రంగంలో ఇతర కంపెనీలకు పోటీగా దూసుకెళుతున్న కంపెనీ

ఫేస్‌బుక్

ఇదొక సోషల్ మీడియా సామ్రాజ్యం. దీన్ని క్రాస్ చేయాలని మిగతా సోషల్ కంపెనీలు తెగ ఆరాటపడుతుంటాయి.అయినా సింహబాగం ఫేస్‌బుక్‌దే

ఒరాకిల్

టెక్నాలజీ రంగంలో అమిత వేగంతో దూసుకుపోతున్న కంపెనీ

సిమెన్స్

టెక్నాలజీ రంగంలో పుంజుకోవాలని ఆరాటపడుతున్న దిగ్గజం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write TCS rated world's most powerful brand in IT services: Report
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot