షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

Written By:

టెక్ రంగంలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న గూగుల్ 2016 సంవత్సరానికి గానూ కొన్నిషాక్ పుట్టించే ఫీచర్స్ ను తీసుకువస్తోంది. మిగతా కంపెనీలకు దడ పుట్టిస్తున్న ఈ ఫీచర్స్ ను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆవిష్కరించారు. కొత్త కొత్త టెక్నాలజీతో వీటిని మార్కెట్లోకి తీసుకురానున్నారు. వీటిలో గూగుల్ అసిస్టెంట్ ,గూగుల్ హోమ్ , అలాగే వీడియో కాలింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవి మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంతో పనిచేస్తాయి. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఈ మిస్టరీలు శాస్ర్తవేత్తలకే అర్థం కావడం లేదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ అసిస్టెంట్ ( Google assistant)

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

దీని ద్వారా మనకు అవసరమైన పనులను గూగుల్ కు చెబితే అది చేసి పెడుతుంది. అంటే మీరు పని చేస్తూనే ఇంకొ పనిని పూర్తి చేయవచ్చు. ఉదాహరణకు మీరు డ్రైవింగ్ చేస్తూనే సినిమా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అది మీరు గూగుల్ కి చెబితే చాలు చేసేస్తుంది.

గూగుల్ హోమ్ ( Google home)

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

గూగుల్ హోమ్ .. ఇది ఒక వైస్-యాక్టివేటెడ్ ప్రొడక్ట్. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. దీంతో ఇంట్లో పలు పనులను చేయొచ్చు. అంటే వాయిస్ కమాండ్స్ ద్వారా గదిలో పాటలను ప్లే అవుతాయి. లైట్స్‌ను ఆన్ చేసుకోవచ్చు. గూగుల్ హోమ్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని పిచాయ్ తెలిపారు.

అలో: ( Allo is a messaging app)

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

ఫేస్బుక్ మెసెంజర్, వాట్సప్‌కు పోటీగా గూగుల్ ఈ మెసేజింగ్ యాప్ ను ఆవిష్కరించింది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది. మీరు మీ స్నేహితుడికి ఒక ఫోటో పంపాలనుకుంటే .. దాన్ని అప్లోడ్ చేస్తే .. ఈ యాప్ దానికి సరైన కొటేషన్ ని చూపిస్తుంది. అలాగే ఇది మనకు ఏదైనా టెక్స్ కు సరిపడే వీడియో లింక్స్ ను చూపిస్తుంది.

డుయో ( Duo is Google’s FaceTime competitor)

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

ఇది వీడియో కాలింగ్ యాప్. స్లో నెట్వర్క్ లో కూడా నాణ్యమైన వీడియో కాలింగ్ తమ ఉద్దేశమని పిచాయ్ తెలిపారు. ఇందులో నాక్ నాక్ ఫీచర్ కూడా ఉంటుందని, దీంతో కాల్ కు ఆన్సర్ చేయక ముందే అవతలి వారి లైవ్ వీడియో చూడొచ్చని పేర్కొన్నారు. ఈ సమ్మర్లోనే రెండు యాప్స్ అందుబాటులోకి తెస్తామన్నారు.

ఇన్‌స్టాంట్ యాప్స్ ( Android Instant Apps )

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

గూగుల్ సంస్థ తన ఆండ్రాయిడ్ ఓఎస్ లో ఇన్‌స్టాంట్ యాప్స్ అనే మరొక ఫీచర్ ను జతచేయనున్నది. ఇన్‌స్టాంట్ యాప్స్ అంటే వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్‌స్టాల్ చేసుకోకుండానే పనిచేస్తాయి. ఈ యాప్స్ స్మార్ట్ ఫోన్ కు బదులు గూగుల్ సర్వర్లలో రన్ అవుతాయి.

వీఆర్ ఫ్లాట్ పాం

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

దీనికి డే డ్రీమ్ అని నామకరణం చేసింది. కార్డ్ బోర్డ్ కన్నా చాలా పవర్ పుల్ గా ఇది పనిచేస్తుంది. ఎంత వేగంతో పనిచేస్తుందో మీరు చూస్తారని గూగుల్ చెబుతోంది. లుక్ కూడా దుమ్ము రేపే విధంగా ఉందని తెలుస్తోంది.

గూగుల్ మ్యాప్ ( popular traffic-tracking app)

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు


గూగుల్ మ్యాప్ ఇప్పుడు సరికొత్త హంగులతో ముందుకు రానుందని సుందర్ పిచాయ్ తెలియజేశారు. ఇది డ్రైవర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

వీఆర్ హెడ్ సెట్ ( Google made a VR headset)

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

ఇదొక అత్యధ్బుతమైన ఫీచర్ . ఈ ఫీచర్ ని గూగుల్ నక్సస్ ఫోన్లకు ముందుగా అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఆండ్రాయిడ్ వేర్ 2 .0 ( Android Wear 2.0)

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

ఇది స్మార్ట్ వాచీలకు సూపర్ గా పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది. స్మార్ట్ ఫోన్లు మాదిరిగానే స్మార్ట్ వాచీలకు ఈ వర్సన్ అందుబాలుటోకి తీసుకొచ్చినట్లు గూగుల్ చెబుతోంది.

ఆండ్రాయిడ్ ఎన్ ( Android N )

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

మీరు గూగుల్ లో సెర్చ్ చేస్తూనే ఇంకో పనిచేయవచ్చు. అంటే మల్టీ టాస్కింగ్ యాప్. ఉదాహరణకు మీరు గూగుల్ లో ఏదైనా విషయం శోధిస్తూ మీ ప్రెండ్స్ తో వాట్సప్ లో చాట్ చేయవచ్చు.

మొబైల్ సాప్ట్ వేర్ కి సంబంధించి కొత్త అప్ డేట్

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

ఇదే కాకుండా మొబైల్ సాప్ట్ వేర్ కి సంబంధించి కొత్త అప్ డేట్ ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్లన్నింటినీ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన సంస్థ వార్షిక డెవలపర్ సమావేశంలో సుందర్ పిచాయ్ ఆవిష్కరించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The 10 biggest announcements from Google I/O 2016
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting