ఈ మిస్టరీలు శాస్త్రవేత్తలకే అర్థం కావడం లేదు

|

విశ్వానికి సంబంధించి శాస్ర్తవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. విశ్వానికి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకోవడానికి వారు కుస్తీలు పడుతున్నారు. అయితే ఇప్పటికీ చాలా రహస్యాలు రహస్యాలుగానే మిగిలి ఉన్నాయి. అయితే శాస్ర్తవేత్తలు మాత్రం వాటిని చేధించామని చెబుతారు. ఈ స్పేస్ మిస్టరీలకు సైంటిస్టులు చేధిస్తారా లేదా అనే సందేహాలు రావడం సహజమే. ఆ రహస్యాలు ఏంటో మీరే చూడండి.

Read more: భూమి పుట్టుకపై మీకు తెలియని రహస్యాలు..

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

మనం విశ్వంలో అయిదు శాతం మాత్రమే చూడగలుగుతున్నాం. మిగతాదంతా చీకటి ప్రపంచంగా, కృష్ణ పదార్ధంగా కనిపిస్తోంది. దానిని మనం ఎప్పటికీ చూడలేం. మరి దాన్ని ఎందుకు చేధించలేకుపోతున్నారు.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

అయితే దీనికి శాస్ర్తవేత్తలు చెప్పే సమాధానం అదొక మిస్టరీ ప్రదేశం. అలాగే గురుత్వ సిధ్దాంతంలో అదొక పెద్ద లోపంతో ఉందని చెబుతారు. అదొక అదృశ్య పదార్థమని దాన్ని కనుక్కోవడం చాలా కష్టమని వాదిస్తారు.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?
 
ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

మార్స్ పైన మనుషులు జీవించేదానికి అనుకూలంగా ఉందని శాస్ర్తవేత్తలు వాదిస్తారు. అక్కడ ద్రవరూపంతో కూడిన నీరు ఉందని ఒకప్పుడు సముద్రాలు ప్రవహించాయని ఇప్పటికీ చెబుతారు.అయితే మార్స్ మీదకి మనుషులను ఎందుకు పంపే ఏర్పాట్లు చేయడం లేదు.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మార్స్ మీదకి 35 ఏళ్ల వయసులో వెళితే తిరిగి అతను వచ్చేనాటికి 65 ఏళ్లు నిండుతాయి అతనికి. అక్కడే రిటైర్మెంట్ ఉంటుంది. అందువల్ల వెనకడుగు వేస్తున్నారా అనే సందేహాలు కూడా ఉన్నాయి.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

అంగారక గ్రహానికి భూమికి మధ్య దూరం 55 మిలియన్ల నుంచి 400 మిలియన్ల కంటే ఎక్కువ దూరం ఉంటుంది. అత్యంత అనుకూల స్థితుల్లో సైతం అంగారక గ్రహానికి ఒకసారి పోయి తిరిగి రావాలంటే కనీసం 18 నెలలు సమయం పడుతుంది. అందుకే ఆ గ్రహంమీదికి మనుషులను శాశ్వత ప్రాతిపదికను పంపించే ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

చాలా మంది వ్యోమగాములు అంతరిక్షం లోకి పోతూ వస్తున్నారు. అయితే వారు ఈ విశ్వ కిరణాల శక్తి ఎక్కడనుంచి వస్తుందనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. ఎక్కడో వేల కోట్ల దూరం నుంచి ప్రసరిస్తున్న కిరణాలు ( Cosmic rays) భూమి మీదకు ఎక్కడ నుండి వస్తున్నాయనే విషయం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

చిన్న చిన్న కిరణాల ప్రసరణ సూర్యుడి నుండి వస్తోందని మాత్రమే తెలుసు. మరి అత్యధిక కిరణాల ప్రసరణ సూర్యుడి నుండి కాకుండా మరెక్కడి నుండో వస్తోందని వారు చెబుతన్నారు. అదెక్కడ అనే ఖచ్చితమైన నిర్థారణ ఇవ్వలేకపోతున్నారు.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

కొన్ని సార్లు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు ఈ కిరణాలు అత్యధిక ఉష్ట్ణోగ్రతలను వెదజల్లుతాయట. వాటి వేడి దెబ్బకు మాడిమసయ్యే ప్రమాదం కూడా ఉందని వారు చెబుతారు. వీటినే ఫాస్ట్ రేడియో బ్రస్ట్స్ అని చెబుతారు.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

అయితే ఇవి కాస్మోక్ కిరణాలలాగానే అత్యధిక వేడిని వెదజల్లుతూ ఉంటాయి. ఇవి ఈ మధ్య ఓ రెండు పేపర్ల ద్వారా బయటకు వచ్చాయి. వీటి ద్వారా భయంకరమైన వైపరీత్యాలు చోటు చేసుకునే ప్రమాదముందని హెచ్చరికలు కూడా అందాయి. అయితే వీటిని ఎప్పుడు కనుగొంటారో చూడాలి.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

విశ్వంలో ఇప్పుడు పదార్థం లభ్యమవుతుంది కాని యాంటీ మేటర్ అంటే విరుధ్ధ పదార్థం లభ్యం కావడం లేదు. పదార్థానికి విరుద్ధ స్వభావం కలిగిందే యాంటీమేటర్. మరి ఇది ఎందుకు లభ్యం కావడం లేదనేది అర్థం కాని విషయం.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ప్రతి పదార్థంలోనూ అణువులుంటాయి. ఈ పదార్థాలు హైడ్రోజన, హీలియం, ఆక్సిజన వంటి మూలకాల సమ్మేళనం. అణువుల్లోని కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. వీటి చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. న్యూట్రల్ శక్తిని కలిగి ఉండేవి న్యూట్రాన్లు కాగా, ప్రోటాన్లు ధనావేశాన్ని, ఎలకాన్ర్లు రుణావేశాన్ని కలిగి ఉంటాయి. అదే యాంటీమేటర్లో ఎలక్రాన్లు ధనావేశాన్ని, ప్రోటాన్లు రుణావేశాన్ని కలిగి ఉంటాయి.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

బిగ్ బ్యాంగ్ గురించి అందరికి తెలిసిందే. అయితే బిగ్ బ్యాంగ్ మహావిస్ఫోటనం జరిగినప్పుడు మేటర్, యాంటీమేటర్ రెండూ కూడా సమంగా వెలువడ్డాయనేది కొందరి శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే ఈ విశ్వంలో మేటర్ లభ్యమవుతుండగా, యాంటీమేటర్ లభ్యకావడం లేదు. దీనికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియవు. యాంటీమేటర్ కంటే మేటర్ ఎక్కువ మొత్తంలో వెలువడిందనేది మరికొన్ని సిద్ధాంతాల ప్రకారం తెలుస్తోంది.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఇది ప్రతి ఒక్కరికీ సాధారణంగా ఉధ్భవించే ప్రశ్న.దీనికి సైన్స్ పరంగా ఇప్పటిదాకా ఎవరూ సరైన క్లారిటీ ఇవ్వలేదు. భూమిపై 410 కోట్ల సంవత్సరాల కిందటే జీవం ఆవిర్భవించి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Affirs తాజా అధ్యయనం ప్రకారం ఇంతకు ముందు భావించిన దానికంటే 30 కోట్ల సంవత్సరాలు ముందుగానే భూమిపై జీవం ఏర్పడి ఉంటుందని అంచనా. 454 కోట్ల ఏళ్ల కిందట భూమి ఆవిర్భావం చెందిన కొద్దికాలానికే జీవం పుట్టుక కూడా సాధ్యమై ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

మరి అది ఎలా మొదలైందనేది మాత్రం సస్పెన్స్. ఆధునిక విశ్వ సిద్ధాంతాల (cosmology) ప్రకారం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటం (big bang) ద్వారా శక్తి రూపాంతరం చెంది విశ్వం (universe)గా మారింది. అని చెబుతారు. నెబులా అనగా వాయువుల సమూహాలు ఏర్పడ్డాయనీ, వాటిలో అగ్ని తీవ్రత ఉండేదనీ అది క్రమక్రమంగా ద్రవంగానూ, ఘనపదార్థంగానూ మారి నక్షత్రాలు, గ్రహాలుగా ఏర్పడ్డాయని చదువుతాం

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

మరి కొందరు అభిప్రాయం ప్రకారం విశ్వంలోని భూమి మరియు ఇతర గ్రహాలు సౌర నీహారిక (సూర్యుడు ఆవిర్భవించినప్పుడు వలయాకారంలో ఏర్పడిన ధూళి మరియు ఇతర వాయువుల సమూహము) నుండి ఆవిర్భవించినవి. ఈ ధూళి యొక్క సమూహము నుండి భూమి అవతరించడానికి 10-20 మిలియన్ సంవత్సరాలు పట్టిందని చెబుతారు.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఖగోళ శాస్త్రవేత్తలు భూమి 6 బిలియన్ల సంవత్సరాల తరువాత అంతమవుతుందని చెబుతారు. సూర్యుడు మరణించడం ద్వారా భూమి కూడా అంతమవుతుందని శాస్ర్తవేత్తలు చెబుతారు. అయితే విశ్వంలో మిగిలిన దాని గురించి మాత్రం చెప్పడం లేదు.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

భయంకరమైన వేడితో భూమి మొత్తం మాడి మసైపోతుందని కొంతమంది వాదిస్తారు. అయితే అప్పుడు వచ్చే వేడికి అన్ని గ్రహాలు కూడా అంతమవుతాయి. మరి భూమి ఒక్కటే అంతమవుతుందని ఎలా చెబుతున్నారు.

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

ఈ స్పేస్ మిస్టరీలను సైంటిస్టులు చేధిస్తారా..?

అయితే బిగ్ బ్యాంగ్ సంగతేంటి. విశ్వం పుట్టుకపై పరిశోధన చేస్తున్న ఈ బిగ్ బ్యాంగ్ సిధ్దాంతం దీన్ని వివరించడం లేదా అనే సందేహాలు రావచ్చు. గురుత్వాకర్షణ అనేది ప్రతి ఒక్కచోట జరుగుతుంది. మిగతా గ్రహాలపైన కూడా జరుగుతుంది. మరి భూమి మాత్రమే ఎలా అంతమవుతుందనేది చిక్కు ప్రశ్న.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write 7 Space Mysteries No Scientist Can Explain

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X