ఇండియాకు 4వ స్థానం..మరి పాకిస్తాన్‌కు..?

Posted By:

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశాలు ఏవీ... కళ్లు మూసి తెరిచే లోపు శత్రువును తుద ముట్టించగల అత్యాధునిక ఆయుధాలు ఏ దేశం కలిగి ఉంది.ఒకే ఒక దెబ్బతో శత్రు సైన్యాన్ని భస్మీ పటలం చేయగల మిస్సైల్స్ ఏ దేశంలో ఉన్నాయి. ఏ దేశం రక్షణ రంగానికి అధికంగా ఖర్చు పెడుతోంది..ఏ దేశం తన దేశ సంపదనంతా ఆయుధాల కోసం కేటాయిస్తోంది. ఇందులో ఇండియా స్థానం ఎంత..అసలు పాకిస్తాన్ ఇండియా దరిదాపుల్లో ఉందా.. ఇటువంటి విషయాలపై గ్లోబల్ ఫైర్ పవర్ ఈ మధ్య గగుర్పొడిచే నిజాలను బయటకు తెచ్చింది. తన సర్వేలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలిసాయి. ఆ నిజాలేంటో మనమూ చూద్దాం.

Read more: చైనాకు దడ పుట్టిస్తున్న ఇండియా ఆయుధాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ది యునైటైడ్ స్టేట్స్

అన్ని దేశాల కన్నా యునైటైడ్ స్టేట్స్ రక్షణ రంగానికి ఎక్కువ ఖర్చు పెడుతోంది. యుఎస్ ఢిపెన్స్ బడ్జెట్ దాదాపు 612 బిలియన్ల డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత శక్తింవంతమైన దేశంగా తయారయ్యేందుకు కావాల్సిన అన్ని రకాల ఆయుధాలను ఇప్పటి నుంచే సేకరించుకుంటోంది.

రష్యా

అమెరికా తరువాత అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశంగా రష్యా నిలిచింది. సంక్షోభంలో కూరుకుపోతున్నప్పటికీ రక్షణ రంగం మీదనే భారీగా వ్యయాన్ని పెడుతోంది రష్యా. రానున్న మూడు సంవత్సరాల్లో ఇంకా గణనీయంగా తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయని సర్వే చెప్పింది. రష్యా రక్షణ రంగానికి కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్ దాదాపు 76.6 బిలియన్ల డాలర్లు.ఇప్పుడు రష్యా చేతిలో 7,66,000 మంది ఫ్రంట్ లైన్ పర్సనల్ సిబ్బందితో పాటు రిజర్వ్ సిబ్బంది 24,85,000 మంది ఉన్నారు. 15,500 యుద్ధ ట్యాంకులులతో ప్రపంచంలోనే ఎక్కువ ట్యాంకులు కలిగిన దేశంగా నిలిచింది.

చైనా

చైనా కూడా తన మిలిటరీ సామర్ధ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 12.2 శాతవ ఎక్కువగా రక్షణ రంగానికి కేటాయించింది. చైనా ఢిపెన్స్ బడ్జెట్ ఇప్పుడు దాదాపు 126 బిలియన్ల డాలర్లు.ఇక చైనా చేతిలో 22,85,000 మంది సైనికులు అలాగే 23,00,000 రిజర్వు సిబ్బంది ఉన్నారు.

ఇండియా

ఇండియాకు కూడా ఇతర దేశాలతో పోటీ పడుతూ సరికొత్త అణ్వాయుధాలతో దూసుకుపోతోంది. 46 బిలియన్ల డాలర్లు రక్షణ రంగానికి కేటాయించింది. అయితే ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే 2020 కల్లా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీని కలిగిన దేశాల్లో భారత్ 4వ స్థానంలో నిలుస్తుందని బడ్జెట్ కూడా పెంచేందుకు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అనుక్షణం సరిహద్దులో కాలుదువ్వుతున్న చైనా పాకిస్తాన్ దేశాలతో పోరాడాలంటే ఆ మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టక తప్పదని విశ్లేషకులు సైతం సెలవిస్తున్నారు.

 

 

ది యునైటైడ్ కింగ్ డమ్

2010 నుంచి 2018 నాటికి ఆర్మీని 20 శాతం పెంచాలని యునైటైడ్ కింగ్ డమ్ ప్లాన్ చేస్తోంది. దీని ఢిపెన్స్ బడ్జెట్ దాదాపు 54 బిలియన్ల డాలర్లు.ది రాయల్ నేవీ ప్లానింగ్ఏంటంటే 2020 నాటికి 4.5 ఎకరాల్లో ఫ్లయిట్ డెక్ లను ఏర్పాటు చేయడం. 40ఎప్ 35బి వంటి జాయింట్ స్ట్రైక్ ఫైటర్స్ ను ప్రపంచవ్యాప్తంగా మళ్లించాలని క్వీన్ ఎలిజబెత్ రాణి ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది.

ఫ్రాన్స్

ఫ్రాన్స్ తన మిలిటరీలో ఉద్యోగులకు రాంరాం చెప్పింది. 10 శాతం జాబులకు కోత విధించింది.డబ్బులు ఆదా చేసుకునేందుకు అలాగే హై టెక్ ఎక్విప్ మెంట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ దేశం రక్షణ రంగానికి 43 బిలియన్ల డాలర్లు కేటాయిస్తోంది.

జర్మనీ

జర్మనీ ఈ మధ్యనే తన మిలిటరీ బలగాలను పెంచుకుంటూ వస్తోంది. నాటో దేశాలకు మిలిటరీ సపోర్ట్ అందిస్తూ వస్తోంది.అంతర్జాతీయంగా మిలిటరీ రంగంలో చాలా యాక్టివ్ గా ఉన్న దేశాల్లో జర్మనీ ఒకటి.దీని బడ్జెట్ దాదాపు 45 బిలియన్ల డాలర్లు.రెండవ ప్రపంచయుద్ధం తరువా జర్మనీ ప్రజలు శాంతిని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జర్మనీలో సైనిక సిబ్బంది 1,83 000 మంది ఉన్నారు.అలాగే రిజర్వులో 145000 మంది ఉన్నారు.

టర్కీ

ఈ దేశం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.4 శాతం ఎక్కువ మిలిటరీకే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న సిరియా యుద్ధం అలాగే కుర్దిష్ యుద్దా వల్ల అధికంగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ దేశ బడ్జెట్ 18.2 బిలియన్ల డాలర్లు

సౌత్ కొరియా

సౌత్ కొరియా కూడా తన సైనిక సామర్థ్యాన్ని బలంగా పెంచుకుంటూ పోతోంది. జపాన్ చైనాలతో పోటీపడుతూ ముందుకు దూసుకువెళుతోంది.అలాగే సౌత్ కొరియా అణుక్షణం కయ్యానికి కాలు దువ్వుతుండటంతో వీలయినంత ఎక్కువగా తన బడ్జెట్ ను మిలిటరీ అవసరాలకు కేటాయిస్తోంది. దీని బడ్జెట్ 34 బిలియన్ల డాలర్లు. సైనిక సిబ్బంది 6,40000మంది కాగా రిజర్వులో 29,00,000 మంది ఉన్నారు.అలాగే 2,346 ట్యాంకులు 1393 ఎయిర్ క్రాఫ్ట్ లను కలిగి ఉంది. ఈ మిలిటరీ ఇతర సైనికుల కంటే అత్యంత శక్తివంతమైన శిక్షణ పొందారు కూడా.

జపాన్

రక్షణ రంగం కోసం 11 సంవత్సరాల తరువాత జపాన్ చైనా కన్నాఎక్కువ వ్యయాన్ని కేటాయించింది.ఓ కొత్త సైనికి స్థావరాన్ని ఏర్పాటు చేసి అక్కడ సైనికులకు అత్యాధునికి శిక్షణ అందిస్తోంది. ఈ దేశం ఢిఫెన్స్ కోసం దాదాపు 49.1 బిలియన్ల డాలర్లు కేటాయిస్తోంది. ఢిపెన్స్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్న దేశాల్లో ఈ దేశం ఆరవది.దీని సైనిక సిబ్బంది 247000 మంది కాగా రిజర్వులో 57,900 మంది ఉన్నారు. 1595 ఎయిర్ క్రాఫ్ట్ లు లతో ప్రపంచంలోనే అయిదవ శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ దేశంగా నిలిచింది.131 షిప్ లు ఉన్నాయి.

ఇజ్రాయెల్

ప్రజల కోసం ఖర్చు పెట్టేదానికన్నా ఢిపెన్స్ మీదనే ఎక్కువ ఖర్చు పెడుతోంది. 2009లో 18.7 శాతం దేశ ఆర్థిక బడ్జెట్ నుంచి రక్షణ రంగానికి కేటాయించింది. ఇప్పుడు దీని బడ్జెట్ 15 బిలియన్ల డాలర్లు. ప్రపంచంలో అత్యంత అధునాతన ఢిపెన్స్ టెక్నాలజీని కలిగిఉన్న దేశం కూడా ఇదే. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇజ్రెయెల్ ఐరన్ డ్రోన్స్.పాలస్తీనా టెర్రరిస్టులకు చుక్కలు చూపిస్తోంది ఈ ఆయుదంతో ఇప్పుడు. ఇక దీని స్థానంలో మరో అధునాతనమైన డ్రోన్ ని ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీని పేరే ఐరన్ బీమ్.

14వ స్థానంలో పాకిస్తాన్

పాకిస్తాన్ ఈ వరుసలో 14వ స్థానంలో నిలిచిందని గ్లోబల్ ఫైర్ పవర్ తెలిపింది. ఇండియాకు దరిదాపుల్లో కూడా లేదని నివేదిక తేల్చి చెప్పింది. 

గ్లోబల్ ఫైర్ పవర్

గ్లోబల్ ఫైర్ పవర్ విడుదల చేసిన రిపోర్ట్ ఇదే. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు. https://www.facebook.com/GizBotTelugu

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The 11 Most Powerful Militaries In The World
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot