ఇన్నోవేటివ్ దేశాల్లో ఇండియాకు చోటు లేదు

Written By:

2008 నుంచి కార్నెల్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గ్లోబల్ ఇండెక్స్ ఓ రిపోర్ట్ ని విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఇందులో దాదాపు అన్ని దేశాలు తమ ప్రత్యేకతను చాటుకుంటూ పోటీ పడుతుంటాయి. అయితే ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా టాప్ 15 ఇన్నోవేటివ్ దేశాలను జీఐఐ సెలక్ట్ చేసింది. మొత్తం ఏడు కేటగిరిలలో ఈ సెలక్షన్స్ జరిపారు. రీసెర్చ్,ఇన్ ప్రాస్ట్రక్ఛర్ ,ఇనిస్టిట్యూట్, మార్కెట్ తో పాటే బిజినెస్ ,నాలెడ్జ్,కమిట్ మెంట్ ,క్రియేటివిటీ మొదలగు అన్ని అంశాల్లో నుంచి ఈ ప్రత్యేక దేశాలను తీసుకున్నారు. ఈ దేశాల జాబితాలో మన ఇండియా స్థానం సంపాదించలేదు.అయితే వీటిలో ఎక్కువ భాగం టెక్ కు సంబంధించిన వాటి నుంచే స్థానం సంపాదించాయి. ఏయే దేశాలు ఏయే రంగాల్లో దూసుకుపోతున్నాయి. తమ ప్రత్యేకతను ఏ రంగంలో చాటుకుంటున్నాయో ఓ సారి చూద్దాం.

Read more:ఇండియాలో టెక్ ధనవంతులు వీరే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

న్యూజిలాండ్

న్యూజిలాండ్

సినిమా రంగంలోకి కొత్త ఆవిష్కరణ న్యూజిలాండ్ నుంచి జరిగింది. సినిమాల్లో డ్రోన్స్ వాడకంతో న్యూజిలాండ్ తమ ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకుంది.

రిపబ్లిక్ ఆప్ కొరియా

రిపబ్లిక్ ఆప్ కొరియా

పడిలేచిన కెరటంలా ముందుకు దూసుకుపోతోంది దక్షిణకొరియా. రీసెర్చ్ అలాగే డెవలప్ మెంట్ సెక్టార్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది.

ఐస్‌లాండ్

ఐస్‌లాండ్

ఆర్థిక బాధల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఐస్‌లాండ్ వరల్ట్ ఇంటర్ నెట్ డాటా స్టోరేజిని సాధించడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతోంది.

జర్మనీ

జర్మనీ

ఆటోమొబైల్ టెక్నాలజీ రంగంలో మకుటం లేని మహరాజు జర్మనీ. టెక్నాలజీని జర్మనీ వాడినంతగా ఎవరూ వాడరంటే అతిశయోక్తి కాదు.

హాంగ్ కాంగ్

హాంగ్ కాంగ్

గత చేదు జ్ఙాపకాలనుంచి తేరుకొని ప్రపంచ ఆర్థిక రంగంలో దూసుకుపోతోంది. ప్రపంచార్థిక రంగాన్ని శాసించడానికి తనదైన ప్రయత్నాలను చేస్తోంది.

డెన్మార్క్

డెన్మార్క్

డెన్మార్క్ లో ప్రభుత్వ పరంగా సిస్టం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎంతోమంది రీసెర్చర్స్ అలాగే క్వాలిటీ విద్య డెన్మార్క్ సొంతం

లక్సంబర్గ్

లక్సంబర్గ్

ఇక లక్సంబర్గ్ ఈ జాబితాలో 9వ స్థానం సంపాదించింది. వర్తక వాణిజ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టడంలో ఈ దేశం అన్ని దేశాలకు పోటీగా నిలుస్తోంది. విద్యలోనూ తనదైన శైలిలో దూసుకుపోతోంది.

ఐర్లాండ్

ఐర్లాండ్

ఇన్ ప్రా స్ట్రక్చర్ కు అలాగే క్రియేటివ్ అవుట్ పుట్ కోసం ఐర్లాండ్ మూడు ప్రదేశాలను 2014లో గుర్తించిది. అక్కడ క్రియేటివ్ డిజైన్ కల్చర్ తో దూసుకుపోతోంది.

సింగపూర్

సింగపూర్

ప్రపంచదేశాలలో స్థిరమైన స్థానంగల దేశం ఏది అంటే అది సింగపూర్ అనే చెప్పాలి. అక్కడ రాజకీయ వాతావరణం పర్యావరణ స్థిరత్వం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఫిన్‌ల్యాండ్

ఫిన్‌ల్యాండ్

2014లో రెండు దెబ్బలు తగిలినా వాటికి తట్టుకుని ఇప్పుడు టెక్నాలజీ ,రీసెర్చ్ అలాగే విద్యా రంగంలో తనదైన ముద్రను వేసుకుంటూ ముందుకు పోతోంది.

యునైటైడ్ స్టేట్స్

యునైటైడ్ స్టేట్స్

ఇంటర్నెట్ శాసించండం దగ్గర నుంచి ట్రేడ్ స్టాక్ మార్కెట్ అలాగే గ్లోబల్ రంగంలో తనకు తానే తిరుగులేదని చాటి చెబుతూ ముందుకు దూసుకుపోతంది యుఎస్

నెదర్లాండ్స్

నెదర్లాండ్స్

ఆన్ లైన్ సంస్కృతికి నెదర్లాండ్ పుట్టినిల్లు.ఇక్కడ కూడా రీసెర్చ్ అలాగే టెక్నాలజీ అవుట్ పుట్ వంటి అంశాలు ఆదేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి.

స్వీడన్

స్వీడన్

యూనివర్సిటీలకు పెట్టింది పేరు. ఇక్కడ యూనివర్సిటీలు ఎంతో అత్యద్భుతంగా డిజైన్ చేయబడి అలాగే నాణ్యమైన విద్యకు పెట్టింది పేరుగా ఉంటాయి. గత 4 సంవత్సరాల నుంచి టాప్ 3లో స్థానం సంపాదించుకుంటూనే వస్తోంది.

యునైటైడ్ కింగ్‌డమ్

యునైటైడ్ కింగ్‌డమ్

ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అన్నింటి కన్నా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం కాబట్టి యునైటైడ్ కింగ్‌డమ్ టాప్ 2లో స్థానం సంపాదించింది.

స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్

ఇది ఎప్పుడూ నెంబర్ వన్ కంట్రీనే. కొత్త కొత్త ప్రాజెక్టులతో అదిరిపోయే ఎకానమితో ముందుకు దూసుకువెళుతున్న దేశం.అక్కడ ఉన్న యుఎస్ బి బ్యాంకే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆ బ్యాంకులో ప్రపంచం నుంచి అందరూ అకౌంట్లుకలిగి ఉంటారు.

ఇండియాకు చోటు లేదు

ఇండియాకు చోటు లేదు

ఈ దేశాల జాబితాలో మన ఇండియా స్థానం సంపాదించలేదు. టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The 15 most innovative countries in the world
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot