టెక్నాలజీ ఎక్కువయితే వచ్చే రోగాలు ఇవే !

By Hazarath
|

ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ఇప్పుడు ఈ పని చేయాలన్నా అది టెక్నాలజీతోనే ముడిపడి ఉంది. టెక్నాలజీ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తి కాదు.. అయితే 24 గంటలు టెక్నాలజీ మీద పనిచేయడం వల్ల కొన్ని రకాల ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవేంటో మీరే చూడండి.

Read more : సిలికాన్ వ్యాలీ సముద్రంలో కలిసిపోనుందా..

1

1

స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల మనిషి విపరీతమైన ఒత్తిడికి గురవుతాడని డాక్టర్లు చెబుతున్నారు. మీ ఫోన్ ఎప్పుడూ సైలెంట్ లో పెట్టుకుంటే ఈ బాధ నుంచి కాస్తైనా విముక్తి లభిస్తుందని వారంటున్నారు.

2

2

సెల్ ఫోన్ లో ఎన్నో రకాలైన బ్యాక్టీరియాలు ఉన్నాయి. వాటివల్ల మీకు మొటిమలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కనుక మీరు ఫోన్ వీలయినంతగా స్పీకర్ ఆన్ చేసి లేకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టి మాట్లాడ్డం మంచిది.

3

3

బ్లాక్ బెర్రీ ఫోన్ వాడేవారికి బొటన వేలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే అది ఎక్కువగా బొటన వేలు మీదనే పనిచేయాల్సి ఉంటుంది.

4

4

సెల్ ఫోన్ వాడకం వల్ల రేడియేషన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఫోన్ లేకుంటే ఓ రకమైన డిప్రెషన్ లోకి కూడా వెళతారు.కాబట్టి ఫోన్ వీలయినంత తక్కువగా వాడటం మంచిది.

5

5

సెల్ ఫోన్ వాడకం వల్ల అనేక రకాలైన అంటువ్యాధులు మీదరి చేరే అవకాశం ఉంది. ఈ వ్యాధులు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు తీసుకురావచ్చు.

6

6

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల మీరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

7

7

ఫోన్ తో అలర్జీ భారీన పడి ఇప్పటికే చాలామంది డాక్టర్లను కూడా సంప్రదించారు.

8

8

మీ ఫోన్ జేగంట మోగాలనో, కుప్పలు తెప్పలుగా నోటిఫికేషన్లు వచ్చి ఉండొచ్చనో .. గంటలో కనీసం మూడుసార్లు ఫోన్తో కుస్తీ పడుతున్నారా ..? ఈ లక్షణాలు ఉన్నాయంటే మీకు ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ ఉందని ఫిక్సయిపోండి. అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా ఊహించుకోవడం.

9

9

మీరు కంప్యూటర్ ముందు కూర్చుని అదేపనిగా టైప్ చేయడం వల్ల మణికట్టు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.

10

10

ఇక వెన్నుపూస నొప్పి, అలాగే మొడనొప్పులనేవి సర్వసాధారణమే.

11

11

రీసెంట్ గా ఓ స్టడీ తేల్చిందేమిటంటే వైఫై రేడియేషన్ వల్ల మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని. వైఫై అతి వాడకం మీ స్పెర్మ్ కౌంట్ ని చంపేస్తుందని వారంటున్నారు. సో ఇదిపెద్ద ప్రమాదమే.

12

12

మీ ల్యాప్ టాప్ ని ఎప్పుడూ మీ తొడల మీద పెట్టుకోవడం వల్ల ఆ వేడికి మీ స్మెర్మ్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

13

13

మీరు అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం వల్ల మీకు తలనొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంది.

14

14

నిద్రలేమి సమస్యలు వస్తున్నాయని ఇప్పటికే చాలమంది డాక్టర్లను సంప్రదించారని రిపోర్టులు కూడా తెలియజేస్తున్నాయి.

15

15

ఫేస్‌బుక్ వాడకం ఎక్కువయితే వారికి బ్రెయిన్ దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కామెంట్లు అలాగే లైకులు ఇవి వారిని విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తాయని చెబుతున్నారు.

16

16

ఇంటర్నెట్ అతిగా వాడటం వల్ల అమెరికాలో దాదాపు 60 శాతం మంది ఆందోళనలో జీవిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

17

17

గత ఎనిమిది సంవత్సరాల కాలంలో దాదాపు 108 మంది ఇలా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఎదురుగా వెనక నుంచి ఏం వస్తున్నాయో తెలియక చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి.

18

18

చెవుడు వచ్చే ప్రమాదం. హెడ్ ఫోన్స్ అతిగా వాడితే చెవుడు వచ్చే ప్రమాదం ఉంది.

19

19

మీరు రోజు సోషల్ మీడియా మీదనే గడపటం వల్ల మీ చావు మీరు చేతులారా కొని తెచ్చుకున్నట్లేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలయినంతవరకు దూరంగా ఉండటం మంచిది.

20

20

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write The 19 Worst Tech-Related Health Risks

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X