4జీ వార్‌కు తెర లేస్తోంది

By Hazarath
|

ఇప్పుడు భారత్ లో మొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. 2 జీ ,3జీ ఇప్పుడు 4జీ దిగొస్తున్న టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్ల విపణి హాట్ హాట్ గా మారుతోంది.3జీ ఫోన్లు పూర్తి స్థాయిలో కష్టమర్ల చేతుల్లో పడకుండానే అప్పుడే 4జీ యుద్ధం.. అదే మోడళ్ల హవా నడుస్తోంది.అత్యాధునిక ఫీచర్లకు తోడు ఔరా అనిపించే ధరలతో వస్తున్న 4జీ ఫోన్లతో మొబైల్ పరిశ్రమ రోజు రోజుకు వేడెక్కిపోతోంది. ఏప్రిల్ జూన్ నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్లలో 58 శాతం 4జీ మోడల్లు కైవసం చేసుకున్నాయి. కొన్ని కంపెనీలు ఒక అడుగు ముందుకేసి రూ.5వేలకే 4జీ ఫోన్లను ప్రవేశపెట్టాయి. మరికొన్ని కంపెనీలు కూడా అదే బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా చైనా ఇండియాల మధ్యనే 4జీ వార్ కు తెరలేవబోతోంది.

Read more: హ్యాకింగ్‌ సెక్స్‌తో అమితాబ్‌ విలవిల

4జీ యుద్ధం మొదలైంది

4జీ యుద్ధం మొదలైంది

ఇండియా చైనాల మధ్య ఇప్పుడు 4జీ యుద్ధం మొదలైంది. స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో ఇండియా చైనా పోటీ పడుతూ ముందుకు దూసుకువెళుతున్నాయి. చైనా 4జీ ఫోన్లకు ఇండియా డంపింగ్ గ్రౌండ్ కావడంతో ఇక్కడి కంపెనీలకు సవాల్ మొదలైంది.

చైనా ఫోన్లకు ధీటుగా తమ బ్రాండ్లను మార్కెట్ లోకి

చైనా ఫోన్లకు ధీటుగా తమ బ్రాండ్లను మార్కెట్ లోకి

అయితే ఇండియాలో బ్రాండ్ కంపెనీలు చైనా ఫోన్లకు ధీటుగా తమ బ్రాండ్లను మార్కెట్ లోకి దించుతున్నాయి. అంతే కాకుండా కొన్ని చోట్ల చైనా ఫోన్లను తిరస్కించడం కూడా ఇండియా బ్రాండ్ మార్కెట్ లో వేడి రగులుతోంది.

ఆచితూచి అడుగులు

ఆచితూచి అడుగులు

చైనా భారత 4జీ మార్కెట్ లోకి అడుగుపెడితే ఇండియా లో ఉన్న బ్రాండ్ కంపెనీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉండటంతో ఇక్కడి కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అయితే చైనా కంపెనీలు దీనికి భిన్నంగా మార్కెట్ లోకి 4జీ ఫోన్లను వదిలి కష్టమర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

4జీ సర్వీసెస్

4జీ సర్వీసెస్

ఇక్కడి మార్కెట్ లో ని పరికరాలు 4జీ సర్వీసెస్ కి సాధ్యమవుతాయి. కాని చైనా కు చెందిన కంపెనీ ఫోన్ల పరికరాలు 4జీ మార్కెట్ కు అసలు పనికారావు. అవి డంపింగ్ గ్రౌండ్ లో పడేయాలని ఇండియాలో నంబర్ 2 ఫోన్ సెల్లర్ అయిన మైక్రోమ్యాక్స్ అధినేత అంటున్నారు.

4జీ వార్‌

4జీ వార్‌

ఇండియాలో రెండు బ్రాండ్లు 4జీ ఎల్ టీఈ,అలాగే 2300 ఎమ్ హెచ్ జడ్ ఉంటే చైనా ఫోన్లలో కేవలం 1800 ఎమ్ హెచ్ జడ్ మాత్రమే ఉంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు

ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు

ఇక కార్బూన్ అధినేత మాట్లాడుతూ చైనా 4జీ వ్యాపారులు భారత్ లో ధరలతో గేమ్ ఆడుతున్నారని తద్వారా లాభాల మార్కెట్ సాధించాలంటూ తెగ తాపత్రయ పడుతున్నారని చెబుతున్నారు.అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఆయన చెప్పారు.

భారతి ఎయిర్ టెల్ 4జీ సర్వీస్

భారతి ఎయిర్ టెల్ 4జీ సర్వీస్

ఇక భారతి ఎయిర్ టెల్ 4జీ సర్వీస్ లను లాంచ్ చేసింది. అలాగే రిలయన్స్ ,ఐడియా,వోడాఫోఫోన్ కూడా వచ్చే సంవత్సరం 4జీ మార్కెట్ లోకి దూసుకురానున్నాయి.

డంపింగ్ ప్రొడక్ట్ లకు సంబంధించి ప్రశ్నలు అనవసరం

డంపింగ్ ప్రొడక్ట్ లకు సంబంధించి ప్రశ్నలు అనవసరం

మా కంపెనీ ఫోన్లు అత్యద్బుత క్వాలిటీతో అందుబాటు ధరలతో ఇండియాలోని కష్టమర్లకు అందిస్తున్నామని జీయోన్ సీఈఓ చెబుతున్నారు. ఇక్కడ డంపింగ్ ప్రొడక్ట్ లకు సంబంధించి ప్రశ్నలు అనవసరమంటూ ఆయన కొట్టి పారేశారు.

భారత్ 4జీ మార్కెట్

భారత్ 4జీ మార్కెట్

అయితే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే చైనా భారత్ 4జీ మార్కెట్ ను శాసిస్తోందని చెప్పడం. చైనా కంపెనీలు భారత్ లో ఇప్పటికే 12 శాతం స్మార్ట్ పోన్ మార్కెట్ లో వాటాను కలిగిఉన్నాయి.

6000 నుంచి రూ. 10000 మధ్యలో 4జీ ఫోన్లు

6000 నుంచి రూ. 10000 మధ్యలో 4జీ ఫోన్లు

ఇక చైనాలో 4జీ వినియోగదారులు 45 శాతం ఉంటే భారత్ లో అది కేవలం 10 శాతం కన్నా తక్కువగానే ఉంది. శ్యాంసంగ్ మాత్రమే 4జీ ఫోన్లలో కాస్త ముందు వరసలో ఉంది. వారు రూ. 6000 నుంచి రూ. 10000 మధ్యలో 4జీ ఫోన్లను తీసుకువస్తున్నారు.ఈ ధరలకు ఇండియా లోని బ్రాండ్ కంపెనీలు తమ ఫోన్లతో సవాల్ విసురుతాయా లేదా అన్నదే చూడాలి.

ఇండియాలో పాగా

ఇండియాలో పాగా

మొత్తానికి చైనా 4జీ వ్యాపారులు ఇండియాలో పాగా వేసేందుకు సిద్ధమైపోయారు.ఇండియా బ్రాండ్లకంటే ఎక్కువ అమ్మాకాలను సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. మరి ఇండియా దానికి ధీటుగా అమ్మకాలు సాగిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

 ఏడాదిలో 10 శాతం పెరుగుదల

ఏడాదిలో 10 శాతం పెరుగుదల

భారత్ మొబైల్ ఫోన్ పరిశ్రమలో స్మార్ట్ ఫోన్ల వాటా ఏడాదిలో 10 శాతం పెరిగిందంటే ఇక్కడి వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. 2015లో ప్రపంచ స్మార్ట్ ఫోన్ విక్రయాల వృద్ధిలో భారత్ మార్కెట్ దే ప్రధాన పాత్ర అని జీఎఫ్ కె కెవిన్ వాల్ష్ వెల్లడించారు కూడా.2016లో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఫీచర్ ఫోన్లను మించిపోతుందని దిగ్గజ కంపెనీ శ్యాంసంగ్ స్పష్టం చేస్తోంది.

 2017 నాటికి అమెరికాను మించిపోయి రోండో స్థానానికి భారత్

2017 నాటికి అమెరికాను మించిపోయి రోండో స్థానానికి భారత్

భారత స్మార్ట్ పోన్ల విపణి 2017 నాటికి అమెరికాను మించిపోయి రోండో స్థానానికి చేరుతుందన్న అంచానాలు ఉన్నాయి. అందుకే విదేశీ కంపెనీలు సైతం ఇప్పుడు భారత్ పై ఫోకస్ చేశాయి. చైనాలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో రూ.6వేల లోపు మోడళ్ల వాటా 20 శాతం ఉంది. అయితే భారత్ లో ఇది దాదాపు 50 శాతం ఉందని ఐడీసీ చెబుతోంది. దేశి వీదేశీ సంస్థలు 4జీ మోడళ్లను రూ. 5వేలకు తీసుకువచ్చే పనిలో పడ్డాయి.

రూ.4999కే ఫికామ్

రూ.4999కే ఫికామ్

చైనా కంపెనీ ఫికామ్ రూ.4999కే ఎనర్జీ 653 మోడల్ ను అమెజాన్ ద్వారా విక్రయిస్తోంది. లెనోవో ఏ2010 మోడల్ ను ఇంతకంటే తక్కువ ధరలో భారత్ లో ఆవిష్కరించింది. ఈ మోడల్ ను వియాత్నాంలో రూ. 4970 కే కంపెనీ విక్రయిస్తోంది.

చైనా ముందుకు దూసుకెళ్తుందా..?

చైనా ముందుకు దూసుకెళ్తుందా..?

4జీ మార్కెట్ లో ఇండియాలో చైనా పరిస్థితి ఏంటి...ముందుకు దూసుకెళ్తుందా..లేక చతికిలపడుతుందా అనేది ముందు ముందు కాని తెలియదు

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజకీ సంబధించిన లేటెస్ట్ అప్ డేట్స్ పొందవచ్చు.

https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
The 4G battle has already begun between India and China with the latter taking a substantial lead in the Indian smartphone market for the high-speed devices.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X