మీ సెల్ ఫోన్ లోనే గ్రేటర్ ఆర్టీసిని పట్టేయండి

Posted By:

ఐటీ ఆధారిత సేవలపై గ్రేటర్ ఆర్టీసి మరో ముందడుగు వేసింది.నగరంలోని బస్సుల సమాచారాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్ మెట్రో బస్ పేరుతో ప్రత్యేక యాప్ ను రూపొందించింది. వారం పదిరోజుల్లో ఈ సరికొత్త మొబైల్ అప్లికేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు స్మార్ట ఫోన్ల ద్వారా సిటీ బస్సుల సమాచారాన్ని పొందవచ్చు.

Read more :గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త యాప్

జీపీఎస్ వైఫల్యాలను అధిగమించి సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక శ్రద్థ తీసుకున్న గ్రేటర్ ఆర్టీసి ప్రయాణికుల కోసం ఈ కొత్త యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా నగరంలో మీరు ఎక్కడ ఉన్నారు..ఎక్కడికి వెళ్లాలి లాంటి వాటి సాయం తీసుకోవచ్చు.

మరింత సులువు

భాగ్యనగరం సందర్శనకు వచ్చేవారికి ఇది మరింంత సులువుగా ఉంటుంది. వారు ఎవరి సాయం తీసుకోకుండానే డైరక్ట్ గా గమ్య స్థానానికి చేరుకోవచ్చు. మీరు ఎక్కడ ఉంది ఏ పాయింట్ కు చేరుకుంది ఇలాంటి అంశాలు సందర్శకులు ఈజీగా తెలుసుకోవచ్చు.

దశల వారీగా విస్తరణ

ప్రస్తుతం 1287 ఏసీ,మెట్రో డీలక్స్,మెట్రో ఎక్స్ ప్రెస్,సూపర్ లగ్జరీలకు సంబంధించి యాప్ సేవలు అందుతాయి. ఆర్డినరీ బస్సులకు తరువాత దశల వారీగా విస్తరిస్తామని గ్రేటర్ ఆర్టీసీ చెబుతోంది.

హైదరాబాద్ మెట్రో బస్ యాప్

హైదరాబాద్ మెట్రో బస్ యాప్ లో రూట్ సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీకు కావలిసిన రూట్ సమాచారం పొందవచ్చు.

ఫైండ్ బస్టాప్

ఫైండ్ బస్టాప్ ద్వారా పర్యాటకులు నగరానికి కొత్తగా వచ్చేవారు తాము ఉన్న చోట ఏ బస్ స్టాపులు ఉన్నాయి. ఏయే బస్సులు వస్తాయి అన్న సమాచారం పొందవచ్చు. కిలోమీటర్ పరిధిలో ఉన్న అన్ని బస్ స్టాపుల వివరాలు మ్యాప్ లో కనిపిస్తాయి.

సిటీ బస్సులకు మాత్రమే

అయితే ప్రస్తుతం ఈ యాప్ సిటీ బస్సులకు మాత్రమే పరిమితం. త్వరలో దూర ప్రాంత బస్సులకు కూడా విస్తరిస్తామని అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆర్టీసి యాజమాన్యం చెబుతోంది.

మరో యాప్

ఇందుకోసం మరో యాప్ ను సిద్ధం చేయనున్నారు. అయితే హైదరాబాద్ -కరీం నగర్ అలాగే హైదరాబాద్ -బెంగుళూరు సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించి ఆ తరువాత మిగతా బస్సులకు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరో అడుగు

ఆర్టీసీ ఈ యాప్ తో మరో అడుగు ముందుకేసినట్లేనని తెలుస్తోంది.ప్రయాణికులకు ఇక బస్సుల కోసం వేచి చూసే బాధలు తగ్గుతాయి

పర్యాటకులకు సులువు

అన్ని రూట్లలో బస్సులకు ఈ యాప్ వర్తిస్తుంది.పర్యాటకులు చాలా సులభంగా తమ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవచ్చు. 

అత్యంత సులభం

ముందు ముందు రాష్ర్టంలోని అన్ని చోట్లకు ఈ యాప్ తో అత్యంత సులభంగా చేరుకోవచ్చు. 

తక్కువ టైం

మీరు ఎక్కడున్నా కాని ఈ యాప్ ద్వారా మీరు బస్సు ఉన్న ప్రాంతాన్ని చూడవచ్చు. దగ్గర ప్రాంతాన్ని సెలక్ట్ చేసుకుని బస్సు పాయింట్ వద్దకు తక్కువ టైంలో చేరుకోవచ్చు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write Hyderabad metro bus app get the cell phone.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot