కాల్పుల మోతల మధ్య మిరుమిట్లు గొలిపే కాంతులు

Written By:

ఈ ప్రపంచంలో చీకటిపడ్డ తరువాత దేశాల సరిహద్దులు అంతరిక్షం నుంచి కనిపిస్తాయా అని ఎవరైనా అడిగితే ఇదేం ప్రశ్న..అసలు పగలైనా కనిపిస్తాయా అన్న ఎదురు ప్రశ్న సమాధానంగా వస్తుంది. మిగతా దేశాల సంగతి పక్కన బెడితే ఇండియా పాక్ బార్డర్ రాత్రి పూట విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతుంది.నిత్యమూ చొరబాట్లు,రాత్రిపూట కాల్పుల మోతలు వినిపించే ఈ ప్రాంతంలో రెండు దేశాలు భద్రతాపరంగా గట్టి చర్యలు తీసుకోవడంతో అంతరిక్షం నుంచి చూసినా సరే సరిహద్దులు మెరుస్తూ కనిపిస్తుంటాయి.

Read more: మార్స్‌పై కార్బన్ డై ఆక్సైడ్ మిస్టరీ

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తాజాగా భారత్ ,పాక్ సరిహద్దులతో పాటు కరాచీ ఇండస్ నది ప్రాంతం హిమాలయాలను చూపుతూ తీసిన ఓ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ చిత్రంతో పాటు 2011లో హిమాలయాల సైడ్ నుంచి బార్డర్ పాయింట్ వెలుగులు విరజిమ్ముతున్నప్పుడు క్లిక్ మనిపించింది. ఇక వీటితో పాటు నాసా రాత్రి వేళ వివిధ దేశాల ఫోటోలను పై నుంచి క్లిక్ మనిపించింది వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: నాసాకే నడకలు నేర్పిన గిటార్ బాయ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రాత్రి పూట బార్డర్

రాత్రి పూట బార్డర్ ఇంత వెలుగులు విరజిమ్ముతుందా అని ఆశ్చర్యపోతున్నారు కదూ..ఈ చిత్రం  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది ఇప్పుడు 

దీపాల వెలుగులతో ప్రశాంతం

నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లే బార్డర్ దీపాల వెలుగులతో ప్రశాంతంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.ఈ ఫోటో నాసా 2011లో క్లిక్ మనిపించింది.

ఇటలీ లోని మిలన్ ప్రాంతం

ఇటలీ లోని మిలన్ ప్రాంతం రాత్రి పూట ఇలా వెలుగులు విరజిమ్మతోంది. 2011లో నాసా క్లిక్ మనిపించింది.

నైలు నది

పాములాగా మెలికలు తిరుగుతూ విద్యుత్ కాంతులు వెదజల్లుతున్న ఇది ప్రఖ్యాతిగాంచిన నైలు నది. 2011 సెప్టెంబర్ లో నాసా క్లిక్ మనిపించింది.

టోక్యో నగరంలో గల మెట్రో పాలిటన్ ప్రాంతం

జపాన్ దేశంలోని టోక్యో నగరంలో గల మెట్రో పాలిటన్ ప్రాంతం ఇది. ఇక్కడ జనాభా చాలా ఎక్కువగా ఉంటారు. ఇటు పక్క యెక్హోమా నగరం ఉంటుంది. 2011లో నాసా తీసింది.

యూరప్ అండ్ ఆప్రికా ఖండాల నైట్ వ్యూ

యూరప్ అండ్ ఆప్రికా ఖండాలను నైట్ వ్యూ లో చూస్తే ఇలా ధగధగలతో మెరిసిపోతూ ఉంటాయి. ఇది నాసా 2010లో తీసిన చిత్రం

ఫ్రాన్స్ ఇటలీ బార్డర్ లోని సిటీ లైట్ ప్రాంతం

ఫ్రాన్స్ ఇటలీ బార్డర్ లోని సిటీ లైట్ ప్రాంతం ఇది. చందమామ కిందకు దిగి రావడానికి ఎదురుచూస్తున్నట్లుంది కదా లోకేషన్ చూస్తుంటే 2010లో నాసా క్లిక్ మనిపించింది. ఈ చిత్రం మిడినైట్ 11.55కి క్లిక్ మనిపించారు.

లాస్ వెగాస్ లోని నేవడా ప్రాంతం

లాస్ వెగాస్ లోని నేవడా ప్రాంతం ఇది. చుట్టూ చీకటి మధ్యలో వెలుగు అత్యద్బుతంగా ఉన్న ఈ చిత్రాన్ని నాసా 2010 నవంబర్ లో తీసింది. చీకటిగా ఉన్న ప్రాంతం మెట్రో పాలిటన్ దగ్గర ఫ్రెంచ్ పర్వతాల ప్రాంతం.సెకండ్ కి 7 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతూ ఈ చిత్రాన్ని నాసా సిబ్బంది క్లిక్ మనిపించారు.

ఈజిప్టు రాజధాని కైరో నగరం

ఈజిప్టు రాజధాని కైరో నగరం అలాగే అలగ్జాండ్రియా నగరాలు ఇవి.అక్టోబర్ లో నాసా మిడ్ నైట్ తీసింది.

బ్రెజిల్ లోని బారాసిల్లా ప్రాంతం

బ్రెజిల్ లోని బారాసిల్లా ప్రాంతం ఇది.2011లో ఆగస్టులో నాసా తన కెమెరాలో ఈ చిత్రాన్ని బంధించింది.20వ శతాబ్దంలో దూసుకుపోతున్న నగరాల్లో బ్రెజిల్ ముందు వరుసలో ఉంది. ఇటు పక్క నేషనల్ పార్క్ అటుపక్క పొలాలతో ఈ ఫోటో కనిపిస్తుంది.

కాలిఫోర్నియాలోని బే ఏరియా ప్రాంతం

కాలిఫోర్నియాలోని బే ఏరియా ప్రాంతం. 2010 డిసెంబర్ లో నాసా క్లిక్ మనిపించింది.

కెనడాలోని మాంటెరల్ క్యూబ్ మెట్రోపాలిటన్ ఏరియా

కెనడాలోని మాంటెరల్ క్యూబ్ మెట్రోపాలిటన్ ఏరియా ఇది. ఇక్కడ మీకు కనిపిస్తున్న పుసుపు పచ్చని లైట్లు అంతా అపార్ట్ మెంట్లతో నిండిఉంటే బ్లాక్ ప్రాంతమంతా రివర్ తో నిండి ఉంది. 1976లో టోరోంటోలను అధిగమించింది.

ఇస్తాంబుల్

ఇస్తాంబుల్ రాత్రిపూట ఇలా మెరుస్తూ ఉంది. 2010 డిసెంబర్ లో నాసా తీసిన చిత్రం

యూరప్ లోని నార్త్ వెస్ట్రన్ ప్రాంతం

యూరప్ లోని నార్త్ వెస్ట్రన్ ప్రాంతం. 2011 అక్టోబర్ లో నాసా క్లిక్ మనిపించింది.

న్యూ ఓర్లియన్స్ లోని ప్రాంతం

న్యూ ఓర్లియన్స్ లోని ప్రాంతం ఇది. 2011 జనవరి లో నాసా క్లిక్ మనిపించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HERE wrtie Nasa shares stunning photos of the India-Pakistan border
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot