ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

By Hazarath
|

గూగుల్‌కి ఆపిల్‌కి మధ్య ఇప్పుడు స్మార్ట్‌పోన్ల వార్‌కి తెరలేవబోతోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పటిదాకా సింహభాగాన కొనసాగిన ఆపిల్‌ను ఢీ కొట్టడానికి గూగుల్ రెడీ అవుతోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సింహభాగాన్ని సొంతం చేసుకోవడానికి అలాగే ఆపిల్‌కు సవాల్ విసరడానికి గూగుల్ రెడీ కాబోతోంది. ఐ ఫొన్‌ని పడగొట్టే ఫోన్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గూగుల్ పావులు కదుపుతోంది. ఎలాగైనా ఆపిల్ మార్కెట్ ను సొంతంచేసుకోవాలని ట్రై చేస్తోంది.గూగుల్ వ్యూహాంపై స్పెషల్ స్టోరి.

ఈ ఏడాది మీరు కొనేందుకు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

ఆపిల్‌తో గూగుల్ ఢీ.. ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్‌తో గూగుల్ ఢీ.. ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

అత్యాధునిక టెక్నాలజీతో కూడిన హైఎండ్ స్మార్ట్‌ఫోన్లను అందించే మార్కెట్‌లో ఇప్పటికే ఆపిల్‌దే తిరుగులేని ఆధిపత్యం. అయితే ఆపిల్‌కు ఇప్పుడు గూగుల్ రూపంలో పెద్ద సవాలు ఎదురుకానుందా? అంటే తాజా వార్తలు అవుననే అంటున్నాయి.

ఆపిల్‌తో గూగుల్ ఢీ.. ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్‌తో గూగుల్ ఢీ.. ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్ కు ధీటుగా హై ఎండ్ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయాలని గూగుల్‌ భావిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి ఈ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయని బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.

ఆపిల్‌తో గూగుల్ ఢీ.. ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్‌తో గూగుల్ ఢీ.. ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

అత్యంత ఖ‌రీదైన మోడ‌ల్‌గా పేరుగాంచింన ఐ ఫోన్ కు ధీటైన ఫోన్ ని గూగుల్ తయారుచేయబోతుందని ఇప్పటికే దీనిపై చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇది ఐఫోన్‌కు గ‌ట్టి పోటీనివ్వ‌నుంద‌ని స‌మాచారం.

ఆపిల్‌తో గూగుల్ ఢీ.. ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్‌తో గూగుల్ ఢీ.. ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఇప్పటిదాకా గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ ఫోన్లు వ‌చ్చినా అవి గూగుల్ సొంత బ్రాండ్లు కాదు. ఇత‌ర సంస్థ‌లు గూగుల్ డెవ‌ల‌ప్ చేసిన ఆండ్రాయిడ్ తీసుకుని త‌మ డివైస్‌ల కోసం ప్ర‌త్యేకంగా ఆ ఓఎస్‌ను తీర్చిదిద్దుకుంటున్నాయి.

ఆపిల్‌తో గూగుల్ ఢీ.. ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్‌తో గూగుల్ ఢీ.. ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

గూగుల్ రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ సిస్టం ప్రపంచంలోని 80శాతం స్మార్ట్‌ఫోన్లలో వినియోగింపబడుతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టి సొంతంగా మొబైళ్లు అందించే దిశగా గూగుల్ అడుగులు వేస్తున్నదని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

గూగుల్ బ్రాండ్‌ పేరిట రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రస్తుతం మొబైల్ ఆపరేటర్లతో గూగుల్ చర్చలు జరుపుతున్నదని ఆ పత్రిక వెల్లడించింది.ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్‌ రంగంలో తిరుగులేని దిగ్గజంగా విరాజిల్లుతున్న గూగుల్‌ ఇటీవల హార్డ్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టి సొంతంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, గాడ్జెట్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఐఫోన్‌లో ఉండే ఫీచ‌ర్ల‌కు ధీటుగా స‌మ‌ర్థ‌వంత‌మైన ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో గూగుల్ త‌న సొంత స్మార్ట్‌ఫోన్‌ను త‌యారుచేస్తోంద‌ని తెలిసింది. గూగుల్ తయారు చేసే స్మార్ట్‌ఫోన్‌లో ఐఓఎస్ టెక్నాలజీతో పాటు సొంతంగా ప్రత్యేక గూగుల్ ఫీచర్స్‌ను యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిస్తోంది.

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు గూగుల్ త‌న బ్రాండెడ్ ఫోన్ గురించిన‌ వివ‌రాల‌ను బ‌య‌ట‌కు తెలియ‌జేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం అందింది. ఈ క్ర‌మంలో ఆ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉండ‌బోతుంద‌నే దానిపై అప్పుడే నెట్‌లో పుకార్లు షికార్లు కూడా చేస్తున్నాయి.

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

నెక్సస్ కంపెనీతో కలిసి నెక్సస్-5X, నెక్సస్-6P ఫోన్లను తయారు చేసినా.. అవి అంతగా క్లిక్ అవ్వలేదు. దీంతో ఇతర కొత్త కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ‘ప్రాజెక్ట్ ఎరా' పేరుతో సెపరేట్ మాడ్యులర్ స్మార్ట్‌ఫోన్ ప్రాజెక్టును గూగుల్ చేపట్టినట్లు సమాచారం.

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఏది ఏమైనా గూగుల్ స్వ‌యంగా ప్ర‌క‌టిస్తేనే గానీ ఈ విష‌యంపై ఉన్నసందేహాలు నివృత్తి కావు. అప్పటిదాకా ఆపిల్ నంబర్ వన్ ఫోన్ గానే ఉంటుంది.

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write The next battle between Apple and Google is all about context

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X