ఒకసారి ఛార్జింగ్‌ పెడితే వారం రోజులు

Written By:

ఎంత మంచి కంపెనీ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ అయినా ఎంత సేపు వస్తుంది. అదే పనిగా నెట్ వాడుతుంటే కనీసం రెండు సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ పెడితే వన్ వీక్ వరకు ఛార్జింగ్ పెట్టనవసరం లేదు..ఏందీ నమ్మలేకున్నారా..అవును నిజం శాస్ర్తవేత్తలు ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. సరికొత్త మెటీరియల్ తో ముందుక రానున్నారు..సో దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: 9000ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరే ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రోజుకు కనీసం రెండు, మూడు సార్లు చార్జింగ్ పెట్టాల్సి రావడం

రోజుకు కనీసం రెండు, మూడు సార్లు చార్జింగ్ పెట్టాల్సి రావడం

అదరగొట్టే స్మార్ట్ ఫోన్లలో అనేకానేక ఆప్షన్లు. ఇంటర్నెట్ నుంచి గేమ్‌ల వరకు అన్నీ అత్యాధునికమే. మరి అన్ని వాడేస్తుంటే బ్యాటరీ ఎంతసేపు వస్తుంది? రోజుకు కనీసం రెండు, మూడు సార్లు చార్జింగ్ పెట్టాల్సి రావడం దాదాపు అందరికీ అనుభవమే.

పదేపదే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా

పదేపదే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా

ఈ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు నడుం కట్టారు. పదేపదే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. మొబైల్, టాబ్లెట్, స్మార్ట్ వాచీలలో ఉపయోగించే స్క్రీన్ గ్లాస్ మెటీరియల్‌ను వాళ్లు మార్చారు. ఈ కొత్త మెటీరియల్ అసలు బ్యాటరీ పవర్‌ను వాడుకోదు.

ఇన్నాళ్లూ అందరూ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంపైనే

ఇన్నాళ్లూ అందరూ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంపైనే

సాధారణంగా స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పవర్‌లో 90 శాతం వరకు స్క్రీన్‌కు వెలుతురు ఇవ్వడానికే ఉపయోగపడుతుంది. ఇన్నాళ్లూ అందరూ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంపైనే దృష్టిపెట్టారు.

స్క్రీన్ ఉపయోగించుకునే బ్యాటరీ పవర్‌ను తగ్గించాలని

స్క్రీన్ ఉపయోగించుకునే బ్యాటరీ పవర్‌ను తగ్గించాలని

కానీ బ్రిటిష్ శాస్త్రవేత్తలు మాత్రం.. స్క్రీన్ ఉపయోగించుకునే బ్యాటరీ పవర్‌ను తగ్గించాలని ప్రయత్నించి.. విజయం సాధించారు. తాము కనిపెట్టిన స్మార్ట్ గ్లాస్ ఉపయోగిస్తే.. ఫోన్లు, టాబ్‌లు, స్మార్ట్ వాచీలను కేవలం వారానికి ఒకసారి చార్జింగ్ చేస్తే సరిపోతుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్ డాక్టర్ పీమన్ హొస్సేనీ తెలిపారు.

ఈ కొత్త స్మార్ట్ గ్లాస్‌ కొన్నిరకాల ఎలక్ట్రికల్ పల్స్‌లను

ఈ కొత్త స్మార్ట్ గ్లాస్‌ కొన్నిరకాల ఎలక్ట్రికల్ పల్స్‌లను

ఈ కొత్త స్మార్ట్ గ్లాస్‌ కొన్నిరకాల ఎలక్ట్రికల్ పల్స్‌లను సృష్టిస్తుంది. దీనివల్ల మంచి ఎండలోనైనా ఫోను బ్రైట్‌నెస్ ఏమాత్రం పెంచక్కర్లేకుండా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పటివరకు అది సాధ్యమయ్యేది కాదు.

ఓ ఏడాదిలోపే అందుబాటులోకి

ఓ ఏడాదిలోపే అందుబాటులోకి

ఎండలో ఉంటే తప్పనిసరిగా స్క్రీన్ బ్రైట్‌నెస్ పెంచుకోవాల్సి వచ్చేది. ఈ కొత్త తరహా స్మార్ట్ గ్లాస్ నమూనాను ఓ ఏడాదిలోపే అందుబాటులోకి తెస్తామంటున్నారు. ఇలాంటివి వస్తే.. ఇక పవర్ బ్యాంకులకు కూడా కాలం చెల్లిపోతుందేమో!!

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write The phone you only have to charge once a WEEK: British scientists create material for the screen that uses no power
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting