9000ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరే ఫోన్

Written By:

మీ స్మార్ట్ ఫోన్ లో సామర్ధ్యం ఎంత ఉంటుంది. మహా అయితే 2500 ఎంఏహెచ్ లేకుంటే 3000 ఎంఏహెచ్ వరకూ ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే ఎంత సేపు పనిచేస్తుంది. మహా అయితే 24 గంటలు అదీ డేటా ఆన్ చేయకుండా వాడితే అదే డేటా ఆన్ చేసి వాడితే అంతకన్నా తక్కువే ఉంటుంది. కాని మార్కట్లోకి ఇప్పుడు కొత్త రకం ఫోన్ వస్తోంది. అది 9000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందట. ఈ ఫోన్ ను చైనా కంపెనీ మకూక్స్ మార్కెట్లోకి విడుదల చేసింది.

Read more : గతి తప్పిన గొప్ప ఆవిష్కరణలు

9000ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరే ఫోన్

దీని పేరు ఈ ఎక్స్ 1. మీరు ఎలా వాడినా ఈ పోన్ ఛార్జింగ్ దాదాపు నాలుగైదు రోజుల పాటు వస్తుందని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ఒకసారి పుల్ ఛార్జింగ్ పెడితే ఇక మీరు నిశ్చింతగా ఐదు రోజుల పాటు మీ ఫోన్ ను చార్జింగ్ పెట్టకుండా చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యధిక బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్ ఇదేనని ప్రకటించారు.

Read more : ఐసిస్ పేరు ఉంటే కొంప కొల్లేరే

9000ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరే ఫోన్

ఈ ఫోన్ 15 మిల్లిమీటర్ల మందం ఉండగా..4.5 అంగుళాల డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్ఠం,క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఇక కెమెరా అయితే 8 మెగా పిక్షల్ అలాగే 2 మెగా ఫిక్షల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అయితే దీని ధర ఇంకా మార్కెట్లో అనౌన్స్ చేయలేదు. దీనిపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

English summary
Here Write This Chinese handset has a whopping 9000 mAh battery
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot