తెలంగాణాలో అతి పెద్ద పారిశ్రామిక హబ్

Written By:

కలల సాకారానికి ఆహ్వానం. సరికొత్త ఆలోచనలకు శ్రీకారం. ప్రపంచ గతిని మార్చే ఆవిష్కరణల నిలయం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీ హబ్‌ వైభవంగా లాంచ్ అయ్యింది. దేశవిదేశాల పారిశ్రామికవేత్తల సమక్షంలో ప్రారంభమైంది. స్టార్టప్ లతో యువత ఆలోచలనకు ఊతమివ్వబోతోంది. యువత కలల సాకార సాధనకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ప్రాజెక్టు టీ హబ్. దేశవ్యాప్తంగా స్టార్టప్ లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు వేదిక ఇది. ఎన్నో రోజులుగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించి, యువతలో సరికొత్త ఉత్సాహం నింపిన టీ హబ్‌ గచ్చిబౌలిలో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: గూగుల్ మ్యాప్‌‌కు చిక్కని రహస్య ప్రదేశాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎంతో హట్టహాసంగా టీ హబ్

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎంతో మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, యువ ఎంట్రప్రెన్యూర్లు, విద్యార్థుల సమక్షంలో టీ హబ్ ను లాంఛ్‌ చేశారు టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్ టాటా.

ఉత్తమ ఆలోచనలకు టీ హబ్ సరియైన వేదిక

ఉత్తమ ఆలోచనలకు టీ హబ్ సరియైన వేదిక అని రతన్ టాటా అన్నారు. నవ భారత నిర్మాణానికి నూతన ఆలోచనలే ఆధారమని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలని అన్నారు.

ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి.

ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి. ఇదీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ హబ్ నినాదం. ఐటీలో దేశానికే తలమానికమైన భాగ్యనగరం స్టార్టప్ ల రాజధానిగా మరో ప్రస్థానం దిశగా దూసుకుపోతోంది.

సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో దూసుకుపోతున్న హైదరాబాద్

సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ ప్రస్థానం మరో మేలి మలుపు దిశగా అడుగు వేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త ఉత్తేజమైన స్టార్టప్‌ లకు ఇండియాలో ప్రధాన కేంద్రం కానుంది.

స్టార్టప్ అంటే కొత్త కంపెనీలు

స్టార్టప్ అంటే కొత్త కంపెనీలు. యువకుల మదిలోని పారిశ్రామిక ఆలోచనలకు కార్యరూపం. అందుకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీని కోసమే గచ్చిబౌలిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా టీ హబ్‌ ను ప్రారంభించింది.

వేలవేల ఆలోచనల సంఘర్షణక నిలయం టీ హబ్

వేలవేల ఆలోచనల సంఘర్షణక నిలయం టీ హబ్. దీంట్లో అడుగుపెడితే అదో సృజనా ప్రపంచంలా కనిపిస్తుంది. యువతలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతుంది. సృజనాత్మకతకు పదునుపెట్టే వేదిక టీ హబ్. ఔత్సాహిక యువతకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ సర్కారు.

ఒక్కరిద్దరు కాదు వేలమంది ఒకచోట చేరి

ఒక్కరిద్దరు కాదు వేలమంది ఒకచోట చేరి వందలాది నూతన ఆవిష్కరణలకు పురుడుపోసే సదావకాశం టీ హబ్ రూపంలో అందివస్తోంది.

ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, మొబైల్, డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్

ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, మొబైల్, డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి అనేక రంగాల్లో వినూత్న ఉత్పత్తుల అభవృద్దికి కృషి చేస్తున్న స్టూడెంట్స్, ఔత్సాహికులకు టీ హబ్ వేదిక అవుతుంది.

టీ హబ్ లో కార్యకలాపాలు చేపట్టడానికి దాదాపు 500 స్టార్టప్ లు

టీ హబ్ లో కార్యకలాపాలు చేపట్టడానికి దాదాపు 500 స్టార్టప్ లు అప్లై చేసుకున్నాయి. అయితే వీటిలో 140 కంపెనీలను ప్రస్తుతానికి ఎంపిక చేశారు. ఇవి వెంటనే తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయి.

రెండోదశలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో

రెండోదశలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాయదుర్గంలో మరో భవనాన్ని నిర్మించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

వచ్చే 3 సంవత్సరాల్లో అందుబాటులోకి రానున్న ఈ బిల్డింగ్

వచ్చే 3 సంవత్సరాల్లో అందుబాటులోకి రానున్న ఈ బిల్డింగ్ కోసం ప్రభుత్వం రూ. 150 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ప్రతిపాదనలో ఉంది.

2018లో హైదరాబాద్ లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరిగే నాటికి

2018లో హైదరాబాద్ లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరిగే నాటికి టీ హబ్ సెకండ్ ఫేజ్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ ను స్టార్టప్ లకు కేంద్రంగా మార్చడానికి టీ హబ్ వరమంటున్నారు పారిశ్రామికవేత్తలు.

టెక్నాలజీ హబ్‌లో సేవలందించేందుకు గాను

టెక్నాలజీ హబ్‌లో సేవలందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 20 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

బెంగళూరుకు ధీటుగా కొత్త కంపెనీల ఏర్పాటు

యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, హూస్టన్, ఎంఐటీ మీడియా ల్యాబ్, ఇంక్యుబియో ఆఫ్ స్పెయిన్ వంటి దిగ్గజ విద్యాసంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న పేరుగాంచిన పరిశోధనశాలలు, విద్యాసంస్థలతోనూ ఎంవోయూల కోసం సర్కారు ప్రయత్నిస్తోంది. బెంగళూరుకు ధీటుగా కొత్త కంపెనీల ఏర్పాటు, అభివృద్దికి అన్ని విధాలా చేయూతనివ్వాలని టీ సర్కారు ప్రయత్నిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write The Stunning New Pictures From Telangana Government’s Entrepreneurship Hub
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot