Home
News

Vi టెల్కో వినియోగదారులకు అందించే ఉత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) ప్రస్తుతం మూడవ స్థానంలో అధిక యూజర్లను కలిగి ఉంది. ఈ సంస్థ ఎప్పటికప్పుడు తన యొక్క వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను అందిస్తున్నది. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్తగా అపరిమిత డేటా వంటి ఆఫర్లను ప్రకటించింది. కొత్త ఆఫర్లలో భాగంగా టెల్కో ప్రతిరోజూ అర్దరాత్రి 12AM నుండి ఉదయం 6 గంటల మధ్య ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితులు లేకుండా అపరిమిత డేటాను అందిస్తుంది. ప్రత్యేక డేటా ఆఫర్ లో లభించే అపరిమిత డేటా వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తుంది. ఇవే కాకుండా వినియోగదారులకు రీఛార్జ్ చేయడం కోసం తక్కువ ధరలో లభించే కొన్ని డేటా ప్లాన్లు, రోజువారీ అధిక డేటా ప్లాన్లు వంటివి ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా (Vi) ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా (Vi) ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థ తన వినియోగదారులకు వివిధ విభాగాలలో టన్నుల కొద్ది ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. అయితే వాటి ధరలకు వ్యతిరేకంగా ఉత్తమ విలువను అందించే కొన్ని ప్లాన్లు రూ.449, రూ.599 మరియు రూ.601 ధరల వద్ద లభిస్తాయి. ఈ ప్లాన్లన్నీ అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనంతో వస్తాయి. రూ.449 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో పాటు డబుల్ డేటా ఆఫర్ కింద వినియోగదారులకు 4GB డేటాను అందిస్తుంది. రూ.599 ప్లాన్ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాను 84 రోజుల వాలిడిటీకి, రూ.601 ప్లాన్ 56 రోజుల వాలిడిటీకి రోజుకు 3GB డేటాను అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా గరిష్ట FUP డేటా ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా గరిష్ట FUP డేటా ప్లాన్‌లు

రూ.801 మరియు రూ.401 ధరల వద్ద లభించే మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో Vi టెల్కో గరిష్ట FUP డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లన్నీ 3GB రోజువారీ డేటాతో వస్తాయి. ఇవి వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తాయి. ఇంకా ప్రతి ప్లాన్‌లో ‘బింగే ఆల్ నైట్' ఆఫర్‌తో పాటు Vi అందించే ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. డిస్నీ + హాట్‌స్టార్ విఐపికి ఒక సంవత్సరం చందాతో ఉచితంగా లభిస్తుంది. ఈ అన్ని ప్లాన్‌లు Vi మూవీస్ & టీవీ చందాకు ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి. ఈ ప్లాన్‌లు బోనస్ డేటాను కూడా అదనంగా అందిస్తుంది. రూ.401 ప్లాన్ 16GB బోనస్ డేటాను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. అలాగే రూ.801 ప్లాన్ 48GB బోనస్ డేటాను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

Vi చౌకైన డేటా ప్లాన్ (రూ .16)

Vi చౌకైన డేటా ప్లాన్ (రూ .16)

Vi గా రూపాంతరం చెందిన వోడాఫోన్ ఐడియా చౌకైన ధరలో డేటా ప్లాన్‌లను అందిస్తుంది. ఈ చౌకైన రీఛార్జి ధర కేవలం రూ.16 మాత్రమే. ఇది 1GB మొబైల్ డేటాను 24 గంటల యాక్సిస్ తో అందిస్తుంది. చౌకైన ఆఫర్‌లో తదుపరి ప్లాన్‌ రూ.48 ధర వద్ద లభిస్తుంది. ఇది 3GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్‌తో ఎటువంటి అదనపు కాలింగ్ మరియు మెసేజ్ ప్రయోజనాలు రావు.

Vi రూ.948, రూ.999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వివరాలు

Vi రూ.948, రూ.999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వివరాలు

Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో మిగిలినవి రూ.948, రూ.999, రూ.1,349 ధరల వద్ద లభిస్తాయి. వీటిలో రూ.948 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రెండు కనెక్షన్లకు ప్రయోజనాలతో లభిస్తుంది. అంటే ప్రాథమికంగా రూ.649 వ్యక్తిగత ఎంటర్టైన్మెంట్ ప్లస్ ప్లాన్ మరియు రూ .249 విలువైన ఒక యాడ్-ఆన్ కనెక్షన్ తో లభిస్తుంది. ప్రాధమిక కనెక్షన్ వినియోగదారులు (నెలకు 150GB చొప్పున, సెకండరీ కనెక్షన్ హోల్డర్లకు నెలకు 30GB) అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు. రూ.948 ప్లాన్‌తో నెలకు రూ .249 విలువైన మొత్తం ఐదు యాడ్-ఆన్ కనెక్షన్‌లను వినియోగదారులు పొందవచ్చు. అలాగే రూ.999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా ప్రస్తుతం ఐదు కనెక్షన్‌లతో లభించే ఉత్తమమైన ఎంపిక. ఈ ప్లాన్ అందించే మొత్తం డేటా ప్రయోజనం 200GB (మొదటి కనెక్షన్ కు 80GB మరియు సెకండరీకి 30GB).

వోడాఫోన్ ఐడియా లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఉత్తమమైనది రూ.1,197 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 180 రోజులు అంటే 6 నెలల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అదనంగా ఈ ప్లాన్ ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్ మరియు Vi మూవీస్ & టీవీ యొక్క OTT ప్రయోజనంతో వస్తుంది. అయితే రెండవ ఉత్తమమైన ప్లాన్ రూ.1,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 365 రోజులు (1-సంవత్సరం) చెల్లుబాటుతో వస్తుంది. ఇది Vi మూవీస్ & టీవీకి ఉచిత చందాతో పాటు 24GB డేటాను మాత్రమే అందిస్తుంది.

Best Mobiles in India

English summary
These are The Best Prepaid Plans Offered by Vi Telco Customers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X