స్మార్ట్‌ఫోన్ వేగానికి అత్యంత కీలకమైన ఆయుధం

Written By:

మీ మొబైల్ స్మార్ట్‌వేగంతో రన్ కావాలంటే కీలకం ప్రాసెసర్. మీరు ఫోన్ లో చేసే ప్రతి పని ఈ ప్రాసెసర్ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు లక్ష పెట్టి ఫోన్ కొన్నా కాని ప్రాసెసర్ సరిగా లేదంటే ఆ ఫోన్ సరిగా పనిచేయనట్లే. ఫోన్‌లో ప్రాసెసర్ తక్కువగా ఉంటే ఫోన్ మధ్యలో ఆగిపోవడం అలాగే స్ట్రక్ అయిపోవడం జరుతుంటాయి. అందుకే అన్ని కంపెనీలు ముందుగా ప్రాసెసర్ కు ప్రాధాన్యం ఇస్తాయి. మరి వేగంగా పనిచేసే ప్రాసెసర్లు ఏంటివి అనేదానిపై AnTuTu ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్‌పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఫ్లిప్‌కార్డ్‌తో జతకట్టి ఆపిల్ కుమ్మేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ 820

మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రాసెసర్లలో ఇదే టాప్. అనేక ఫోన్లలో ఇప్పుడు దీన్ని వినియోగిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7, లీఎకో లీమాక్స్ ప్రొ, జియోమి ఎంఐ 5, ఎల్ జీ జీ 5, సోనీ హెచ్ పీ ఎలైట్ ఎక్స్ 3 లో ఇలా అన్ని రకాల ఫోన్లలో ఇది వస్తోంది.

ఆపిల్ ఏ 9

రెండో స్థానంలో నిలిచిన ఈ ప్రాసెసర్ ను ఆపిల్ ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ ఎస్ఈలలో ఉపయోగించారు. ఆపిల్ ఫోన్లలో ఎక్కువగా ఈ ప్రాసెసర్ ఉంటుంది.

ఎక్సినోస్ 8890

వేగం విషయంలో మూడో స్థానంలో నిలిచిన ఈ ప్రాసెసర్ ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 లో మాత్రమే వినియోగిస్తున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కిరిన్ 950

మంచి పర్ఫార్మెన్స్ లో దీనిది నాలుగో స్థానం. హువావే ఫోన్లు పీ 9, మేట్ 8, పీ 9 మాక్స్ లో ఇది కనిపిస్తుంది.

ఎక్సినోస్ 7420

ఐదో స్థానంలో నిలిచిన ఈ ప్రాసెసర్ ను శాంసంగ్ గెలాక్సీ ఎస్ 6, ఎస్ 6 ఎడ్జ్, ఎస్ 6 ఎడ్జ్ ప్లస్, మీజు ప్రొ 5 లలో ఈ ప్రాసెసర్ మీకు కనిపిస్తుంది.

స్నాప్ డ్రాగన్ 810

మంచి పనితీరుతో ఇది ఆరో స్థానంలో నిలిచింది. హెచ్ టీసీ వన్ ఎం 9, లూమియా 950 ఎక్స్ఎల్, నెక్సస్ 6 పీ, వన్ ప్లస్ 2 లలో ఉపయోగిస్తున్నారు.

స్నాప్ డ్రాగన్ 652

మంచి ఫర్మార్మెన్స్ కనబరిచే బడ్జెట్ ఫోన్లలో వినియోగించే మంచి ప్రాసెసర్ ఇది. ఏడో స్థానంలో నిలిచిన దీనిని సామ్సంగ్ గెలాక్సీ ఏ 9, ఏ 9 ప్రో, లీఎకో లీ 2, లెనెవో యోగా ట్యాబ్ 3 లలో వినియోగిస్తున్నారు.

ఆపిల్ ఏ 8

పర్ఫార్మెన్స్ లో ఎనిమిదో స్థానంలో నిలిచిన ఈ ప్రాసెసర్ ను ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ లలో వాడారు.

స్నాప్ డ్రాగన్ 650

తొమ్మిదో స్థానంలో నిలిచిన బెటర్ ప్రాసెసర్ ఇది. దీనిని రెడ్ మి నోట్ 3, సోనీ ఎక్స్ పీరియా ఎక్స్, లూమియా 650 వంటి ఫోన్లలో ఉపయోగిస్తున్నారు.

స్నాప్ డ్రాగన్ 808

పర్ఫార్మెన్స్ లో ఇది పదో స్థానంలో నిలిచింది. ఇది ఎల్ జీ జీ 4, మోటరోలా మోటో ఎక్స్ స్టైల్, నెక్సస్ 5 ఎక్స్, లూమియా 950 వంటి ఫోన్లలో ఉంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These Are the Top 10 Smartphone Processors, As Rated by AnTuTu read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot