Signal యాప్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చే వాట్సాప్ ఫీచర్లు ఇవే...

|

వాట్సాప్ కొత్తగా ప్రైవసీ విధానాన్ని ప్రకటించిన తరువాత వినియోగదారులు వాట్సాప్ నుండి సిగ్నల్‌కు మారడం మొదలెట్టారు. ప్రస్తుతానికి వాట్సప్ కు పోటీని ఇచ్చే ఫీచర్లు సిగ్నల్‌లో లేనప్పటికీ భవిషత్తులో ఇతరులతో పోటీ పడటానికి కొత్త ఫీచర్లను విడుదల చేసే పనిలో నిమగ్నం అయింది. ఏదేమైనా వాట్సాప్ మాదిరిగానే క్రొత్త ఫీచర్లను వీలైనంత త్వరగా రూపొందించడానికి సిగ్నల్ తెరవెనుక కృషి చేస్తోంది. ఇదివరకు వాట్సాప్ ను వినియోగించిన వినియోగదారులు కొత్త రకం యాప్ కు మారినట్లు భావించకుండా ఉండడానికి వీలుగా కృషి చేస్తున్నది. చాట్ వాల్‌పేపర్, స్టేటస్ అప్‌డేట్, యానిమేటెడ్ స్టిక్కర్లు వంటి అన్ని రకాల ఫీచర్లు త్వరలోనే సిగ్నల్‌లో చేరనున్నాయి. సిగ్నల్ యొక్క బీటా వెర్షన్ కొత్త ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సిగ్నల్ చాట్ వాల్‌పేపర్ ఫీచర్

సిగ్నల్ చాట్ వాల్‌పేపర్ ఫీచర్

సిగ్నల్ యొక్క బీటా వెర్షన్‌లో కనుగొనబడిన మొదటి ఫీచర్ ‘చాట్ వాల్‌పేపర్'. వాట్సాప్ యూజర్లు ఏదైనా నిర్దిష్ట గ్రూపు లేదా ప్రైవేట్ చాట్ లలో తమకు నచ్చిన చాట్ వాల్‌పేపర్‌ను సెట్ చేసే సౌలభ్యం కలిగి ఉన్నారు. ఈ ఫీచర్ త్వరలోనే సిగ్నల్ యొక్క స్థిరమైన వెర్షన్ లో కూడా అందుబాటులోకి రానున్నది.

సిగ్నల్ స్టేటస్ అప్‌డేట్ ఫీచర్

సిగ్నల్ స్టేటస్ అప్‌డేట్ ఫీచర్

సిగ్నల్ యొక్క బీటా వెర్షన్‌లో కొత్తగా రాబోయే రెండవ ఫీచర్ ‘స్టేటస్ అప్‌డేట్'. ఇది ఒక స్టాండర్డ్ ఫీచర్ అయినప్పటికి వాట్సాప్ యొక్క అన్ని ఫీచర్లలో అత్యంత ప్రజాదరణను పొందింది. ఇతరులతో చురుకుగా ఉండటం మరియు వారితో సులభంగా కమ్యూనికేట్ చేయడం కోసం ప్రతి వినియోగదారుడు ఇష్టపడే ఫీచర్లలో ఇది ఒకటి. ఈ ఫీచర్ త్వరలోనే ‘సిగ్నల్‌'కి కూడా రానున్నట్లు సమాచారం.

యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్

యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్

యానిమేటెడ్ స్టిక్కర్లను ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. వాట్సాప్ లోని ఉత్తమమైన ఒకటైన ఈ యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్ ఎక్కువగా టైప్ చేయడంలో ఇబ్బంది పడే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి ప్రజలు వాటిని ఉపయోగించవచ్చు. అవి ఫన్నీగా కూడా ఉంటాయి. ఇది ఇతరులతో చాట్ చేయడం ఆసక్తికరంగా మరియు ఉత్తేజకరమైనదిగా చేస్తుంది. ఇది సిగ్నల్‌ లో కూడా అందుబాటులోకి రానున్నది.

సిగ్నల్‌ గ్రూప్ కాల్ ఫీచర్

సిగ్నల్‌ గ్రూప్ కాల్ ఫీచర్

గ్రూప్ కాల్‌లకు మద్దతును ఇచ్చే ఫీచర్లను కూడా సిగ్నల్‌లో తీసుకురానున్నది. ఇప్పటికే ఉన్న గ్రూప్ కాల్ ఫీచర్ లో ప్రస్తుతం 5 మందికి మాత్రమే మద్దతును ఇస్తుంది. కానీ అతి త్వరలో ఆ పరిమితిని వాట్సాప్ మాదిరిగానే ఎనిమిది మందికి పెంచనున్నారు. అలాగే సిగ్నల్‌లో ‘గ్రూప్ ఇన్వేట్ లింక్' మద్దతును తీసుకురానున్నది. ఈ లింక్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు తమ గ్రూప్ లింక్‌ను ఇతర వినియోగదారులతో పంచుకోగలుగుతారు.

Best Mobiles in India

English summary
These WhatsApp Features That Will be Available Soon in Signal App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X