90 రోజుల తర్వాత జియో పరిస్థితి..?

Written By:

ఇప్పుడు ఎక్కడ చూసిన జియో ఫీవర్ నడుస్తోంది. 90 రోజుల ప్రివ్యూ ఆఫర్ అంటూ రిలయన్స్ కష్టమర్లను తన వైపుకు తిప్పుకునేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తుంటే మిగతా టెల్కోలు మాత్రం తమ కష్టమర్లు ఎక్కడ జారిపోతారోనని ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. ఎన్ని ఆఫర్లు ప్రకటించినప్పటికీ వినియోగదారులు రిలయన్స్ 4జీ వైపే చూస్తున్నారు. అయితే 4జీ త్వరలో లాంచ్ కానున్న నేపథ్యంలో జియో గురించి కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవి ఏంటో మీరే చూడండి.

Samsung Galaxy Note 7Apple iPhone 7Xiaomi Redmi Note 4

జియో స్లోగా ఉందా..అయితే ఇలా చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

90 రోజుల తరువాత..?

జియో 90 రోజుల వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అలాగే ఎసెమ్మెస్ లు .డేటాను ప్రకటించింది. అయితే ఇంతవరకు ఎటువంటి తరీఫ్ ప్లాన్స్ ప్రకటించలేదు. మరి 90 రోజుల తర్వాత తరీఫ్ ప్లాన్లు ఎలా ఉంటాయి. లీకయిన సమాచారం ప్రకారం 50 paise per MB లెక్కన తరీఫ్ ప్లాన్లు ఉండే అవకాశం ఉంది.

కమర్షియల్ లాంచ్ ఎప్పుడు..?

జియో కమర్షియల్ గా లాంచ్ ఎప్పుడు అవుతుందో ఎవ్వరికీ తెలియు. కొన్ని రిపోర్టుల ప్రకారం జియో ఆగస్టు 15న కమర్షియల్ లాంచ్ అవుతుందని చెప్పాయి కాని అది లాంచ్ కాలేదు. అయితే రిల్ యాన్యువల్ మీటింగ్ లో ముఖేష్ అంబాని సెప్టెంబర్1న కమర్షియల్ లాంచ్ అవుతుందని చెప్పారు.అయితే అదీ జరిగే అవకాశం లేనట్లు తెలుస్తోంది. షేర్ హోల్డర్లు వినియోగదారులు గతేడాది డిసెంబర్ నుంచి ఎదరుచూస్తూనే ఉన్నారు.

లీగల్ గా వెళుతోందా..?

దిగ్గజ టెల్కోలు ఈ విషయంపై ఇప్పటికే ట్రాయ్ కి ఫిర్యాదు కూడా చేశాయి. ప్రివ్యూ ఆఫర్ పేరుతో పూర్తిస్తాయి నెట్ వర్క్ కార్యకలాపాలు చేస్తుందని కమర్షియల్ లాంచ్ చేయకుండా ఇలా చేయడం చట్టపరంగా సాధ్యం కాదని ఆపాలని కోరుతున్నాయి.

వాయిస్ కాల్..?

వాయిస్ కాల్స్ బాగా డల్ గా ఉన్నాయని ఇప్పటికే చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇతర నెట్ వర్క్ లకు రిలయన్స్ జియో సిమ్ తో కాల్ చేస్తే అవి పోవడం లేదు. అలాగే రిలయన్స్ కు ఇతర నెట్వర్క్ ల నుంచి కాల్ చేసినా అవి పోవడం లేదని చెబుతున్నారు. దీనికి కారణం రిలయన్స్ ఇతర నెట్ వర్క్ లతో కమ్యూనికేట్ కాకపోవడమేనని తెలుస్తోంది.

ఇప్పుడున్న నంబర్ ను జియోకి మార్చుకునే అవకాశం ఉందా..?

జియో కమర్షియల్ గా లాంచ్ కాకపోవడంతో ఈ అవకాశం లేదు. అయితే కమర్షియల్ గా లాంచ్ అయిన తరువాత ఈ అవకాశం ఉండవచ్చు. స్మార్ట్ ఫోన్ డేటా రివల్యూషన్ కోసం ఇండియాలోని వినియోగదారులు ఎదురుచూస్తున్న తరుణంలో ముందు ముందు చాలా అద్భుతాలు జరిగే అవకాశం ఉంది.

జియో పై కష్టమర్ల అభిప్రాయం...?

జియో వాడుతున్న కష్టమర్లు పాజిటివ్ అభిప్రాయానే వ్యక్తం చేస్తున్నారు. స్పీడ్ చాలా బాగా ఉందని అయితే నెట్ వర్క్ సరిగా లేదని వారు అభిప్రాయపడుతున్నారు. పూర్తి స్థాయిలో లాంచ్ చేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని వారంటున్నారు.

డౌన్ లోడ్ స్పీడ్

రిలయన్స్ 4జీ డౌన్ లోడ్ స్పీడ్ 70 Mbps ఉంటే మిగతా నెట్ వర్క్ ల డౌన్ లోడ్ స్పీడ్ 10-20 Mbpsగా ఉందని రివ్యూలు చెబుతున్నాయి. ఇక 3జీ నెట్ వర్క్ స్పీడ్ అయితే 2 Mbps మాత్రమే ఉంటుంది.

జియో ఎందుకంటే

ఈ జియో ద్వారా రానున్న 20 సంవత్సరాల్లో ఇండియా 300 సంవత్సరాల అభివృద్ధిని సాధిస్తుందని అంబాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1.3 బిలియన్ ఇండియన్స్ దీన్ని విడిచిపెట్టరని లాంచ్ ఈవెంట్ లో అంబాని ఆశాభావం వ్యక్తం చేశారు.

డిజిటల్ ఇండియా

రిలయన్స్ 4జీ జియోతో ఇండియా డిజిటల్ ఇండియాగా మారుతుందని ప్రతి ఒక్కరూ సమాచార సాంకేతిక రంగాల గురించి తెలుసుకుంటారని అంబాని ధీమా వ్యక్తంచేస్తున్నారు. సామాన్యులు సైతం సాంకేతిక రంగంలో పట్టు సాధిస్తారని చెబుతున్నారు.

టెక్నాలజీ అప్‌డేట్ కోసం

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం మాతో కలిసి ఉండండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Things You Didn’t Know About Reliance Jio 4G and the ‘Free’ Hype
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot