ఐఫోన్ 7 పార్ట్స్ తయారీ ఖర్చు లిస్ట్ ఇదే

Written By:

ఆపిల్ ఐఫోన్ అంటే చాలామందికి ఎనలేని క్రేజ్ ఉంటుంది. మార్కెట్లోకి ఈ మధ్య లాంచ్ అయిన ఐఫోన్7, 7 ప్లస్‌లు అయితే మార్కెట్లో అమ్మకాలతో దుమ్మురేపుతున్నాయి. బ్లాక్ వేరియంట్ ఫోన్ అయితే చేతికే చిక్కడం లేదు. ఇప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ కొన్ని చోట్ల బోర్డులు కూడా వెలిసాయి. ఆపిల్ అధికారికంగా 32 జిబిని 649 డాలర్లు గానూ అలాగే 128 జిబిని 749 డాలర్లగానూ నిర్ణయించింది. అయితే ఐఫోన్ 7 తయారీ ఖర్చు ఎంత అనే విషయాలపై ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో దుమ్మురేపుతోంది. సీఎన్ఎన్ మనీ ఛానల్ ఈ వీడియోని బహిర్గతం చేసింది. ఖర్చు వివరాలు ఏంటో మీరే చూడండి.

ఇది నిజం..68 రూపాయలకే ఐఫోన్‌..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

iPhone 7 Screen

దీని ఖరీదు 37 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 2470.49
image source: Teardown.com

iPhone 7 Battery

దీని ఖరీదు 4 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 267.08
image source: Teardown.com

iPhone 7 Dual Camera Setup

దీని ఖరీదు 26 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 1736.02
image source: Teardown.com

iPhone 7 Logic Board

దీని ఖరీదు 74 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 4940.98
image source: Teardown.com

iPhone 7 Speakers

దీని ఖరీదు 11.50 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 767.85
image source: Teardown.com

iPhone 7 Casing

దీని ఖరీదు 22 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1468.94
image source: Teardown.com

Other Parts of iPhone 7

దీని ఖరీదు 117.50 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.7845.47
image source: Teardown.com

మొత్తం ఖర్చు

పైన మొత్తం ఖర్చు లెక్కిస్తే 292 డాలర్లు వచ్చింది. అంటే మన కరెన్సీలో రూ.19496.83. ఆపిల్ ఐ ఫోన్లకు అయ్యే ఖర్చును ముందుగానే అంచనా వేసి వాటిని తయారుచేస్తామని టిమ్ కుక్ గత ఏప్రిల్లో చెప్పారు.

ఐఫోన్ 7 ఖరీదు

అయితే పైన వాటిల్లో హార్డ్ వేర్ మాత్రమే మెన్సన్ చేయడం. జరిగింది. అందులో డిజైనింగ్ సాఫ్ట్ వేర్ లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి ఐఫోన్ 7 ఖరీదు ఎంత ఉంటుందో మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This Is What It Costs To Manufacture An iPhone 7 Read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot