ఇది నిజం..68 రూపాయలకే ఐఫోన్‌..

Written By:

ఐఫోన్ ..ఈ పదం ఎంత పాపులర్ అంటే దీని కోసం చాలామంది చేసిన ప్రయోగాలను చూస్తే ఇట్టే తెలుస్తుంది. కిడ్నీలు అమ్ముకోవడం, వీర్యం దానం చేయండం ఇంకా ఎన్నో రకాలుగా ఐ ఫోన్ కోసం కుస్తీలు పడ్డారు. దీనిని బట్టే తెలుస్తుంది ఐ ఫోన్ అంటే జనాలకు ఎంత పిచ్చి అనేది. అయితే ఇక్కడ ఓ పిల్లాడు అవేమి లేకుండా కేవలం 68 రూపాలయకే ఐఫోన్ కొన్నాడు..చిత్రంగా ఉంది కదా..కింద న్యూస్ చూస్తే ఇంకా చిత్రంగా ఉంటుంది.

ఫోన్ సిగ్నల్ రావడం లేదా..ఈ టిప్స్ ట్రై చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నిఖిల్ బన్సల్ అనే బీటెక్ స్టూడెంట్

పంజాబ్ యూనివర్సిటీకి చెందిన నిఖిల్ బన్సల్ అనే బీటెక్ స్టూడెంట్ ఫిబ్రవరి 12న స్నాప్‌డీల్‌లో ఐఫోన్ 5ఎస్ బుక్ చేశాడు. 

డిస్కౌంట్లో 68 రూపాయలకే

ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్ ధర 28,999 రూపాయలు ఉంది. కాని అతనికి డిస్కౌంట్లో 68 రూపాయలకే అని రావడంతో వెంటనే మరో ఆలోచన లేకుండా బుక్ చేశాడు.

68 రూపాయలకే ఫోన్ అందిస్తున్నట్లు స్నాప్‌డీల్

99.7 శాతం డిస్కౌంట్ లభించినట్లు... 68 రూపాయలకే ఫోన్ అందిస్తున్నట్లు స్నాప్‌డీల్ నుంచి సందేశం వచ్చినట్లు నిఖిల్ తెలిపాడు. అయితే స్నాప్ డీల్ మాత్రం దీనిని నిరాకరించింది. ఫోన్ డెలివరీ చేయలేమని చెప్పింది.

స్నాప్‌డీల్ మాట తప్పిందని

అయితే మనోడు మాత్రం స్నాప్‌డీల్ మాట తప్పిందని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. పంజాబ్‌లోని సంగ్‌రూర్ జిల్లాలో ఈ ఫిర్యాదు నమోదైంది. స్నాప్‌డీల్ వినియోగదారుల ఫోరమ్‌లో ఆ డీల్‌కు ఒప్పుకోలేదట.

10వేల రూపాయల పెనాల్టీ, ఐఫోన్ 5ఎస్

అన్ని సాక్ష్యాలు పరిశీలించిన పిదప డీల్ ప్రకారం నిఖిల్ బన్సాల్‌కు ఫోన్ 68 రూపాయలకే విక్రయించాలని, దాంతో పాటు 10వేల రూపాయల పెనాల్టీ కట్టాలని కోర్టు ఆదేశించింది.

ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ దాకా

ఫిబ్రవరిలో మొదలైన ఈ కథ సాగి సాగి సెప్టెంబర్‌లో ముగిసింది. ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత నిఖిల్ బన్సాల్ స్నాప్‌డీల్ నుంచి 68 రూపాయలకే ఐఫోన్ 5ఎస్‌ను సొంతం చేసుకున్నాడు.

ఈకామర్స్ వెబ్‌సైట్స్ చేసే ప్రకటనలపై

కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఈకామర్స్ వెబ్‌సైట్స్ చేసే ఇలాంటి అబ్బురపరిచే ప్రకటనలపై ప్రజలు సరైన రీతిలో స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి ఈ సంఘటన నిదర్శనంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

శాంసంగ్‌కు చుక్కలు చూపిస్తున్నఐఫోన్ 7

కొంపముంచిన గెలాక్సీ నోట్ 7 : శాంసంగ్‌కు చుక్కలు చూపిస్తున్నఐఫోన్ 7..మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి

 

 

ఐఫోన్ 6 సీరిస్ ఫోన్లపై రూ.22 వేలు తగ్గింపు

త్వరపడండి :ఐఫోన్ 6 సీరిస్ ఫోన్లపై రూ.22 వేలు తగ్గింపు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఐఫోన్ 7 చీప్‌గా దొరికేది ఎక్కడ.?

ఆపిల్ ఐఫోన్ 7 చీప్‌గా దొరికేది ఎక్కడో తెలుసా..? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి

 

 

రూ. 10 వేల ఫోన్లలో ఆపిల్ ఐఫోన్ 7 ఫీచర్స్

షాక్: ఆపిల్ ఐఫోన్ 7 ఫీచర్స్ రూ.10 వేల ఫోన్లలో దొరుకుతున్నాయి! ఎలానో తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This Guy Buys Gold iPhone 5S For 68 Rupees Snapdeal read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting