ట్రంప్ ఐఫోన్, ఖరీదెంతో తెలుసా..?
ట్రంప్ పేరుతో ఆయన ఫ్యాన్స్ తయారుచేయించుకున్న ఫోన్. ఈ ఫోన్ పై ట్రంప్ ఫోటోలు, అలాగే ఆయన పేరు ఉంటుంది.
ట్రంప్ ఐఫోన్ గురించి ఎప్పుడైనా విన్నారా..అది ఆయన ఫోన్ కాదు. ట్రంప్ పేరుతో ఆయన ఫ్యాన్స్ తయారుచేయించుకున్న ఫోన్. ఈ ఫోన్ పై ట్రంప్ ఫోటోలు, అలాగే ఆయన పేరు ఉంటుంది. ఇవి కేవలం ఫ్యాన్స్ ఎవరైనా ఆర్డర్ ఇస్తే తయారుచేయిస్తారని కంపెనీ చెబుతోంది. మరి దీని ఖరీదెంతో తెలుసా..అక్షరాల లక్షా 50 వేల డాలర్లు. ప్రత్యేకతలేంటో మీరే చూడండి.
మొబైల్ పోతే రూ. 20 వేల వరకు ఉచిత బీమా

షార్జాకు చెందిన గోల్డ్ జెనీ సంస్థ
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిమానుల కోసం అత్యంత ఖరీదైన ఫోన్ ను యూఏఈలోని షార్జాకు చెందిన గోల్డ్ జెనీ సంస్థ తయారు చేసింది.

వినియోగదారులు కోరిన విధంగా
ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే, వినియోగదారులు కోరిన విధంగా వస్తువులకు రూపకల్పన చేయడం. అలాగే వారు కోరిన మోడిఫికేషన్స్ చేయడం ఈ సంస్థ ప్రత్యేకత.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐఫోన్ కు స్వచ్ఛమైన బంగారంతో
సాధారణ ఐఫోన్ కు స్వచ్ఛమైన బంగారంతో చేసిన స్మార్ట్ కేసును తయారు చేశారు. ఈ కేస్ లో వజ్రాలు పొదిగారు. దానికి తోడు డొనాల్డ్ ట్రంప్ ఫొటో, పేరు ముద్రించారు. దీంతో ఇది ట్రంప్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ధర లక్షా 51 వేల డాలర్లు
దీని ధర లక్షా 51 వేల డాలర్లు (భారతీయ కరెన్సీలో 1.02 కోట్ల రూపాయలు) అని తయారీదారులు తెలిపారు. ఐఫోన్ ను ఈ విధమైన డిజైన్ తో చేయాలంటూ చైనాకు చెందిన ఓ మహిళ గోల్డ్ జెనీ సంస్థను కోరిందట.దీంతో ఈ బంగారు హంగుల ఐఫోన్ ను ఈ సంస్థ తయారు చేయడం ప్రారంభించింది.

ఈ రకమైన ఫోన్లను
ఇప్పటి వరకు ఈ రకమైన ఫోన్లను తొమ్మిదింటిని తయారు చేసినట్టు ఈ సంస్థ చెబుతోంది. మరిన్ని ఆర్డర్లు వస్తాయని ఈ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








