రోజుకు 2జిబి డేటా, జియోకి దిమ్మతిరిగింది
ప్రైవేటు రంగ టెలికాం సంస్థల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకొనేందుకు ప్రభుత్వ రంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) అడుగులు వేస్తోంది.
ప్రైవేటు రంగ టెలికాం సంస్థల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకొనేందుకు ప్రభుత్వ రంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తన వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 339 రూపాయల ప్లాన్ ను వినియోగదారులకు పరిచయం చేస్తోంది.

రూ.339 రీఛార్జ్ చేయడం ద్వారా
రూ.339 రీఛార్జ్ చేయడం ద్వారా రోజుకు 2జిబి డేటా చొప్పున నెలకు 30 జిబి డేటా వరకు వినియోగించుకోవవచ్చు.

రోజుకు 25 నిమిషాలపాటు ఉచితంగా కాల్స్
దీంతోపాటు రోజుకు 25 నిమిషాలపాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 25 నిమిషాలు పూర్తయిన తరువాత నిమిషానికి 25 పైసల చొప్పున లెవీ విధిస్తాం బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సంజీవ్ త్యాగి తెలిపారు.

ఏప్రిల్ 1 నుంచి
ఈ ఆఫర్ ఏప్రిల్ 1 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది.

జియోకి పోటీగా
జియోకి పోటీగా ఇప్పటికే అన్ని కంపెనీలు తమ వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్, డొకొమో వంటి టెల్కోలు ఇప్పటికే తమ ఆఫర్లను ప్రకటించాయి.



Click it and Unblock the Notifications








