టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

Posted By:

ఏటా ప్రపంచవ్యాప్త మొబైల్ ఫోన్‌ల అమ్మకాల సంఖ్య 100 కోట్లను మించుతోంది!. సామ్‌సంగ్, నోకియా, యాపిల్, ఎల్‌జి, హెచ్‌టీసీ, బ్లాక్‌బెర్రీ, సోనీ, మోటరోలా వంటి సంస్థలు అనేక స్మార్ట్‌ఫోన్ మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి.

హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు (వరల్డ్ వైడ్)

ఆ ఫోటోల్లో తప్పులు (మీరే చూడండి)

విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ అధికంగా ఉన్నట్లు పలు విశ్లేషణలు పేర్కొంటున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2012కుగాను మొబైల్ ఫోన్ అమ్మకాలలో ఉత్తమ 10 స్థానాలను దక్కించుకున్న ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీల జాబితాను మీకు పరిచయం చేస్తున్నాం.

లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

సామ్‌సంగ్ (Samsung):

2012 ప్రపంచవ్యాప్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలలో సామ్‌సంగ్ అత్యధిక మార్కెట్ వాటాను కొల్లగొట్టి నెం.1 మొబైల్ ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. మొబైల్ ఫోన్‌ల విభాగంలో సామ్‌సంగ్ అమ్మకపు వృద్ధి రోజురోజుకు పెరుగుతోంది.

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

నోకియా (Nokia):

మొబైల్ ఫోన్‌ల పరిశ్రమను రెండు దశాబ్ధాల పాటు శాసించిన నోకియా తమ వ్యాపారాన్ని 150 దేశాలకు పైగా విస్తరింపజేసింది. శక్తివంతమైన మొబైల్ తయారీ కంపెనీలలో నోకియా ఒకటి. $ 38 బిలియన్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఈ సంస్థ కలిగి ఉంది. టాప్-10 గ్లోబల్ మొబైల్ ఫోన్ బ్రాండ్‌లలో నోకియా రెండవ ర్యాంకును సొంతం చేసుకుంది.

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

యాపల్ (Apple):

$25 బిలియన్ల నికర ఆదాయాన్ని అధిగమించిన ‘యాపిల్ ' టాప్-10 గ్లోబల్ మొబైల్ ఫోన్ బ్రాండ్‌ల జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ బ్రాండ్ తన ప్రత్యేక మార్క్‌తో రూపొందించిన ఐఫోన్ ఇంకా ఐప్యాడ్‌ మోడళ్లు అమ్మకాల పరంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. 

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

జడ్‌టీఈ (ZTE):

చైనాకు చెందిన అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీ జడ్‌టీఈ (ZTE) గ్లోబల్ మొబైల్ ఫోన్ బ్రాండ్‌ల జాబితాలో 4వ స్థానాన్ని పొందింది. చైనా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థకు ఆస్ట్రేలియా, జర్మనీ, యూఎస్ఏ, హాంగ్‌కాంగ్ వంటి దేశాల్లో అనుబంధ సంస్థలు ఉన్నాయి. భారత్‌లోనూ జడ్‌టీఈ బ్రాండ్ మొబైల్ ఫోన్‌‌లను విక్రయిస్తోంది.

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

ఎల్‌జి (LG):

116 మిలియన్ల హ్యాండ్‌సెట్‌ల విక్రయాలతో ఎల్‌జి మొబైల్ ఫోన్స్ ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ తయారీ సంస్థగా అవతరించింది. టాప్-10 గ్లోబల్ మొబైల్ ఫోన్ బ్రాండ్‌ల జాబితాలో ఈ కంపెనీకి 5వ స్థానం లభించింది.

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

హువాయి (Huawei):

చైనాకు చెందిన ఈ మొబైల్ తయారీ దిగ్గజం తన బ్రాండ్ మొబైల్ ఫోన్‌లను 140 దేశాల్లో విక్రయిస్తోంది. ఆదాయం $19 బిలియన్లు. ఈ సంస్థ క్రింద 1,40,000 మంది ఉపాధిపొందుతున్నారు. టాప్-10 గ్లోబల్ మొబైల్ ఫోన్ బ్రాండ్‌ల జాబితాలో హువాయి 6వ స్థానంలో నిలిచింది.

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

బ్లాక్‌బెర్రీ (Blackberry):

కెనడా ముఖ్యకేంద్రంగా కార్యకలపాలు సాగిస్తున్న మొబైల్ తయారీ బ్రాండ్ బ్లాక్‌బెర్రీ టాప్-10 గ్లోబల్ మొబైల్ ఫోన్ బ్రాండ్‌ల జాబితాలో 7వ స్థానంలో నిలిచింది.

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

మోటరోలా (Motorola):

మొబైల్ ఫోన్స్, స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్స్ తయారీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన టెలికామ్ దిగ్గజం మోటరోలా ఫేలవమైన అమ్మకపు వాటాతో 8వ స్థానంలో నిలిచింది.

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

సోనీ (Sony):

టాప్-10 గ్లోబల్ మొబైల్ ఫోన్ బ్రాండ్‌ల జాబితాలో సోనీ 9వ స్థానంలో నిలిచింది.

 

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

హెచ్‌టీసీ (HTC):

తైవాన్ ముఖ్యకేంద్రంగా స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలను తయారు చేస్తున్న హెచ్‌టీసీ $1.3బిలియన్ల నికర ఆదాయంతో దూసుకుపోతోతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పనతో కంపెనీ అమ్మకాలు మరింతగా పెరిగాయి. టాప్-10 గ్లోబల్ మొబైల్ ఫోన్ బ్రాండ్‌ల జాబితాలో హెచ్‌టీసీ 10 స్థానంతో సరిపెట్టుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot